ఒకే వేదికపై రజనీ,కమల్‌ | Rajini-Kamal join TN deputy CM in paying homage to Sivaji Ganesan | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై రజనీ,కమల్‌

Published Sun, Oct 1 2017 2:32 PM | Last Updated on Sun, Oct 1 2017 3:04 PM

Rajini-Kamal join TN deputy CM in paying homage to Sivaji Ganesan

సాక్షి,చెన్నై: రాజకీయ అరంగేట్రంపై విస్పష్ట సంకేతాలు పంపిన అగ్ర నటులు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ ఆదివారం ఒకే వేదికపై మెరిశారు. శివాజీగణేషన్‌ స్మారక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజకీయాలపై రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, ఇమేజ్‌ ఒక్కటే సరిపోదని ఇంకా ఏదో అవసరమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలతో మమేకమైతేనే వారి ఆదరణ చూరగొంటామన్నారు.తన కన్నా కమల్ హాసన్ కు రాజకీయాల్లో ఎలా జయించవచ్చో బాగా తెలుసన్నారు.

రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఏం కావాలని ఇటీవల తాను కమల్‌ను అడగ్గా ఆయన తనతో వస్తే  చెబుతానని చెప్పారన్నారు. ఈ విషయం రెండు నెలల ముందు అడిగి ఉంటే బాగుండేదేమోనని వ్యాఖ్యానించారు. కాగా, శివాజీ గణేషన్‌ స్మారక కేంద్రాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement