Rajani Kant
-
మీ కుటుంబానికి ఉన్నారా స్నేహితులు?
Rajinikanth Dadasaheb Phalke Award 2021: ‘నా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ నా స్నేహితుడు రాజ్ బహదూర్‌కు అంకితం అన్నాడు నటుడు రజనీ కాంత్. 50 ఏళ్ల నాటి స్నేహం వారిది. ఇవాళ్టికీ రజనీకాంత్ తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మంచం మీద స్నేహితుడు పడుకుంటే తాను కింద పడుకుంటాడు. కుటుంబాలు కేవలం తల్లి, తండ్రి, పిల్లలతో మనలేవు. స్నేహితులు కావాలి. గాఢమైన స్నేహాలే బతుకు నావలో సంతోషాన్ని, కష్టం వచ్చినప్పుడు సపోర్ట్నీ ఇస్తాయి. మరి మనకు ఉన్నాయా అంతటి గట్టి స్నేహాలు. మన పిల్లలకు నేర్పిస్తున్నామా ఆ సంస్కారాలు? ‘ఒక మనిషికి అసలైన నష్టం ఏమిటంటే నిజమైన మిత్రుణ్ణి కోల్పోవడమే’ అని సూక్తి. సంపదలు ఎన్ని రకాలైనా ‘స్నేహ సంపద’ వాటిలో ఉంది. స్నేహితుల్ని కోల్పోవడం అంటే సంపదను శాశ్వతంగా కోల్పోవడం. ‘నీ స్నేహితులెవరో చెప్పు... నువ్వెవరో చెప్తా’ అనేది ఎందుకంటే ఆ స్నేహితుల సంఖ్యను, వ్యక్తిత్వాన్ని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్థారించవచ్చు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు. కాని కళ్లు తడవకుండా, ఆ సమయంలో పక్కనే స్నేహితుడు లేకుండా జీవితాన్ని దాటడం కష్టం. స్నేహ సంబంధాలు నిలబెట్టు కోవడానికి సమయం ఇస్తున్నామా? స్నేహితులను కోల్పోతే మళ్లీ పొందగలమా? ‘ఫ్యామిలీ ఫ్రెండ్స్’ అనే మాట ఉంది. మనకిప్పుడు ఎంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందరు మన ఇంటికి వచ్చి ఎందరి ఇంటికి మనం వెళ్లగలిగేలా ఉన్నాము. చెక్ చేసుకోవడం తప్పనిసరి. స్నేహంలో ఉండే ఆనందమే బలం. ఆయుష్షు. రజనీకాంత్ మరియు అతడు మొన్న ఢిల్లీలో రజనీకాంత్ తన నట జీవితానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని తన గురువు కె.బాలచందర్‌తో పాటు స్నేహితుడు రాజ్ బహదూర్‌కు కూడా ఇచ్చాడు. రజనీకాంత్‌కు బెంగళూరులో రాజ బహదూర్ అనే స్నేహితుడు ఉన్నట్టు చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ స్నేహం... స్నేహానికి ఉండే విలువ చర్చకు వచ్చాయి. ‘నాలోని నటుణ్ణి రాజ్ బహదూర్ గుర్తించి నన్ను మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించాడు’ అని రజనీకాంత్ అన్నాడు. ఒక స్నేహితుడు అన్న మాట, అతని ప్రోత్సాహమే ఇవాళ దేశానికి రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌ని ఇచ్చింది. అందుకే రజనీకాంత్ ఆ స్నేహం పట్ల కృతజ్ఞతతో... ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు. ఎప్పటి స్నేహం? 1970 నాటి సమయం. అప్పుడు రజనీకాంత్ బెంగళూరులో తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌గా ఉన్నాడు. బస్ కండక్టర్‌గా కర్ణాటక ఆర్.టి.సిలో ఉద్యోగంలో చేరాడు. అతని బస్ నంబర్ 10 ఏ. మెజెస్టిక్ నుంచి శ్రీనగర్ స్టాప్ల మధ్య తిరిగేది. దాని డ్రైవర్ రాజ్ బహదూర్. రాజ్ బహదూర్ రజనీ కన్నా ఏడేళ్లు పెద్దవాడు. కాని వారికి స్నేహం కుదిరింది. ‘ఆ సమయంలోనే రజనీకాంత్‌లో మంచి స్టయిల్ ఉండేది. ప్రయాణికులకు చిల్లర ఇవ్వాల్సి వస్తే కాయిన్ ఎగరేసి ఇచ్చేవాడు. ఏ కార్యక్రమాలు జరిగినా స్టేజ్ మీద నాటకం వేసేవాడు. అందరికంటే బాగా నటించేవాడు.’ అని 77 ఏళ్ల రాజ్ బహదూర్ గుర్తు చేసుకున్నాడు. అతను అప్పటి నుంచి ఇప్పటి వరకూ చామరాజ్నగర్లోనే ఉంటున్నాడు. రజనీకాంత్ అప్పట్లో దానికి దగ్గరగా ఉండే హనుమంతనగర్ లో ఉండేవాడు. డ్యూటీ సమయాల్లోనూ డ్యూటీ లేనప్పుడూ ఇద్దరూ కలిసి తిరిగేవారు. స్నేహితుడే దారి రజనీకాంత్‌ను సినిమాల్లో చేరమని రాజ్ బహదూర్ శత పోరు పెట్టాడు. కాని ఉద్యోగాన్ని వదిలి మద్రాసు వెళ్ళడం రజనీకి పెద్ద రిస్క్. నీకెందుకు నేనున్నా అన్నాడు రాజ్ బహదూర్. ఆ రోజు ల్లో రాజ్ బహదూర్ జీతం 400. అందులో 200 రజనీకాంత్‌కు పంపేవాడు. రజనీకాంత్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న రోజులకు, స్ట్రగుల్ అయిన రోజులకు రాజ్ బహదూర్ పంపిన డబ్బే పెద్ద ఆధారం. ‘ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ పూర్తయ్యాక ముగింపు ఫంక్షన్‌కు కె.బాలచందర్ చీఫ్ గెస్ట్. ఆ టైమ్‌లో ఆయన రజనీకాంత్‌ని చూసి ‘తమిళం నేర్చుకో’ అని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. రజనీ నా దగ్గరకు వచ్చాడు. బాలచందర్ ఈ మాట అన్నాడ్రా అన్నాడు. అంతేకాదు.. ఇవాళ్టి నుంచి నాతో తమిళంలోనే మాట్లాడు అన్నాడు. నేను తమిళం మాట్లాడుతూ తమిళం నేర్చుకోవడంలో సాయం చేశాను’ అన్నాడు రాజ్ బహదూర్. కృష్ణ–కుచేల నిజానికి రజనీకాంత్ ఇప్పుడు కృష్ణుడు. కాని రాజ్ బహదూర్ దగ్గర ఎప్పుడూ కుచేలుడిగానే ఉంటాడు. ఫోన్లు చేయడు. మెసేజ్‌లు పెట్టడు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాజ్ బహదూర్ ఇంటికి వచ్చి బెల్లు కొడతాడు. ఆర్టిసిలో రిటైర్ అయ్యి తమ్ముడి కుటుంబంతో సొంత ఇంట్లో జీవిస్తున్న రాజ్ బహదూర్ దగ్గర రజనీ కాంత్ కోసమే ఎప్పుడూ ఒక గది సిద్ధంగా ఉంటుంది. ఆ గదిలో ఒక సింగిల్ కాట్ ఉంటుంది. రాజ్ బహదూర్ దానిమీద రజనీకాంత్ కింద నిద్రపోతారు. రజనీకాంత్ వచ్చాడంటే స్నేహితులిద్దరినీ ఆ గదిలో వదిలి కుటుంబ సభ్యులు ఏమీ ఎరగనట్టుగా ఉండిపోతారు. ఇక రేయింబవళ్లు వాళ్ల కబుర్లు సాగుతాయి. రజనీకాంత్ ఒక్కోసారి రాజ్ బహదూర్ దగ్గర వారం పది రోజులు ఉండిపోతాడు. ఇద్దరూ చీకటి పడ్డాక మామూలు మనుషుల్లా బెంగళూరు రోడ్ల మీద తిరుగుతారు. కొనసాగే బంధం సినిమా రంగంలోని కృత్రిమత్వం నుంచి పారిపోవడానికి రజనీకాంత్ తన స్నేహాన్ని ఒక సాధనం చేసుకున్నాడు. ఒక్క రాజ్ బహదూర్ దగ్గర మాత్రమే రజనీ మామూలు మనిషిలా ఉండగలడు. మనల్ని భ్రమల్లో నుంచి, అహంలో నుంచి బయటపడేలా చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మన పిల్లలకు ‘మావయ్యగానో బాబాయిగానో’ ఉంటూ మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఉండాలని అనిపిస్తుంది. ఇలాంటి స్నేహాలు పొందడం కష్టం కాదు. కాపాడుకోవడమే కష్టం. అందుకు ప్రయత్నించినవాళ్లే ధన్యులు. -
అదే మీ చేతిలోని బ్రహ్మాస్త్రం: కమల్
చెన్నై: మరో ఆరు నెలల్లో తమిళనాడులో ఎన్నికల నగారా మోగనుంది. పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగనున్న నటుడు, మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ ఓటర్లును ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఓటరు ఐడీ మన చేతిలోని బ్రహ్మాస్త్రం అన్నారు. అర్హులైన వారంతా ఓటరు ఐడీలకోసం సైన్ అప్ చేసుకోవాలని కోరారు. రెండున్నర నిమిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కమల్ ప్రజలను ఉద్దేశిస్తూ.. ‘ఓటరుగా ఉండటం అనేది 18 ఏళ్లు నిండిన వారికి దక్కిన అరుదైన గౌరవం. ఓటరు ఐడి అనేది పెద్ద ఆయుధం. తన బాధ్యతలను సరిగా నిర్వర్తించని సమాజం.. హక్కులను ఆటోమెటిక్‌గా కోల్పోతుంది. మార్పు రావాలని ఉపన్యాసాలు దంచేవారు.. సిస్టం సరిగ్గా పని చేయడం లేదని విమర్శించే వారు.. ప్రజా ప్రతినిధులంతా దొంగలు అని తిట్టే వారికి ఓటరు ఐడీ ఉండదు. 2021 ఎన్నికల్లో దీన్ని మీ ఆయుధంగా వాడుకోండి. నేను మారతాను.. నేను ఓటేస్తాను అని ప్రతిజ్ఞ చేయండి’ అని కోరారు కమల్. (చదవండి: ఇలాగైతే పార్టీ ఎత్తేస్తా.. కమల్‌హాసన్ హెచ్చరిక..!) ஒன்று கூடுவோம் வென்று காட்டுவோம்#iWillCHANGE_iWillVOTE#என்ஓட்டு_என்பெருமை pic.twitter.com/xvggdOfl6V — Kamal Haasan (@ikamalhaasan) November 20, 2020 వచ్చే ఏడాది మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు లెజండరీ నాయకులైన జయలలిత, కరుణానిధిలను కోల్పోయిన తర్వాత తమిళనాడులో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్ 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2018, ఫిబ్రవరిలో కమల్ మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోల బరిలో నిలిచిన కమల్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే సంపాదించింది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ ‘జీవనాధారం, ఉద్యోగాలు, తాగునీరు’ అజెండాతో ప్రజల మధ్యకు వెళ్లనుంది. వచ్చే నెల నుంచి కమల్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానికి గురించి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అనారోగ్యం కారణంగా రజనీకాంత్ ఎన్నికల్లో పోటీ గురించి పునరాలోచిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. -
పొలిటికల్ ఎంట్రీపై సూపర్‌స్టార్ పునరాలోచన!
చెన్నై : రాజకీయ రంగప్రవేశంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ పునరాలోచనలో పడినట్టు సంకేతాలు పంపారు. సరైన సమయంలో రాజకీయాల్లో అడుగుపెట్టడంపై తన వైఖరి వెల్లడిస్తానని ఆయన బుధవారం పేర్కొన్నారు. తాను రాసినట్టు చెబుతున్న బహిర్గతమైన లేఖపై రజనీ వివరణ ఇచ్చారు. ఈ లేఖ తాను రాయలేదని..అయితే తన ఆరోగ్యం, డాక్టర్ల సూచనలు మాత్రం నిజమేనని ఓ ప్రకటనలో తెలిపారు. తాను రజనీ మక్కల్ మండ్రమ్తో చర్చించి రాజకీయ వైఖరిపై సరైన సమయంలో ప్రకటన చేస్తానని రజనీకాంత్ స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ఎంట్రీ ఖాయమని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు కొద్దిముందు ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తితో తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రణాళికలు దెబ్బతిన్నాయని రజనీ రాసినట్టు చెబుతున్న లేఖపై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నందున కోవిడ్-19 సోకే ప్రమాదం ఉందని సమూహాల్లో కలువరాదని వైద్యులు ఆయనకు సూచించినట్టు ఈ లేఖలో ప్రస్తావించారు. తన చుట్టూ ఉన్న వారి బాగోగుల కంటే తన గురించి తాను ఎక్కువగా విచారించబోనని ఈ లేఖలో రజనీ పేర్కొనట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కావాలనే కోరికతో తాను ఎన్నికల్లో పోటీ చేయనని ఈ ఏడాది మార్చిలో రజనీ తేల్చిచెప్పారు. చదవండి : రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్ -
స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే
ఆ నడకలో ఓ స్టయిల్... సిగిరెట్ అలవోకగా ఎగరేయడం ఓ స్టయిల్... కూలింగ్ గ్లాస్‌ని కూల్‌గా ఎగరేయడం ఓ స్టయిల్... అందుకే ‘స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే..’ పాట రజనీకాంత్ స్టయిల్‌కి తగ్గట్టు ఉంటుంది. కండక్టర్‌గా ఉన్నప్పుడు ప్రయాణికులకు టికెట్లు తెంచారు రజనీ. యాక్టర్ అయ్యాక ప్రేక్షకులు ఆయన సినిమా టిక్కెట్లు తెంచారు. నేటితో తమిళ పరిశ్రమకు రజనీ పరిచయమై 45 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి స్పెషల్ స్టోరీ. సరిగ్గా ఇదే రోజు (ఆగస్ట్ 15), నలభై ఐదేళ్ల క్రితం తమిళ సినిమాకు ఓ కొత్త ముఖం పరిచయం అయింది. అప్పుడెవ్వరూ ఉహించి ఉండకపోవచ్చు.. తమిళ సినిమాకి ముఖం అతనే అవుతాడని. దర్శకుడు బాలచందర్ కనుగొన్న ముత్యాల్లో ఒకరు రజనీకాంత్. కె. బాల చందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు రజనీకాంత్. ఆ సినిమాలో కమల్ హాసన్ హీరో. రజనీ కీలక పాత్ర చేశారు. తర్వాత కన్నడంలో ‘కథా సంగమ’లో ఓ చిన్న పాత్ర చేశారు. వెంటనే తెలుగు చిత్రం ‘అంతులేని కథ’కి రజనీని తీసుకున్నారు బాలచందర్. ‘మూండ్రు ముడిచ్చు’ సినిమాలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో రజనీ గాల్లోకి సిగిరెట్ విసిరేసే విధానానికి విజిల్స్ పడ్డాయి. రజనీ అనేవాడు ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యాడు. ‘చిలకమ్మ చెప్పింది’ సినిమాలో తొలిసారి పూర్తిస్థాయి లీడ్ రోల్ లో నటించారు రజనీ. తెలుగులో హీరో అయినప్పటికీ తమిళంలో పూర్తి స్థాయి హీరోగా మారలేదు రజనీ. దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఆ ప్రయోగం చేశారు. ‘భువనా ఒరు కేళ్విక్కురి’లో విలన్ గా కాకుండా మంచి పాత్రలో కనబడ్డారు. ప్రయోగం ఫలించింది. ఆ తర్వాత ఎస్పీ– రజనీ కాంబినేషన్లో సుమారు 24 సినిమాలు వచ్చాయి. ఒక్క ఏడాదిలో 20 సినిమాలు 1978 రజనీకు మరచిపోలేని ఏడాది. ఆ సంవత్సరం తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఆయనవి 20 సినిమాలు విడుదలయ్యాయి. ‘భైరవి’తో తమిళంలో సోలో హీరోగా తొలి సినిమా చేశారు. ‘వణకత్తుక్కురియ కాదలియే’లో రజనీకు ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టారు. ఆ తర్వాత అదే ట్రెండ్ అయింది. ‘ముళ్ళుమ్ ములరుమ్’ మంచి పేరు తెచ్చిపెట్టింది. యాక్టింగ్‌కి టాటా నాలుగేళ్లలో సుమారు 50 సినిమాలు పూర్తి చేశారు రజనీ. అయినప్పటికీ సాలిడ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొదవయింది. ఇంకా నటుడిగా కొనసాగుదామా? ఆపేద్దామా? అనే ఆలోచనలో పడ్డారట రజనీ. కానీ 1980లో వచ్చిన ‘బిల్లా’ ఆయన ప్రయాణాన్ని మార్చేసింది. ఆ తర్వాత ‘తిల్లు ముల్లు’ (1981)లో వంటి కామెడీ టచ్ ఉన్న సినిమా చేశారు రజనీ. అప్పటికి మంచి కమర్షియల్ హీరోగా దూసుకెళుతున్న రజనీ ఆధ్యాత్మిక సినిమా ‘శ్రీ రాఘవేంద్ర’ (1985) చేశారు. ఇందులో రాఘవేంద్ర స్వామి పాత్రను చేశారు రజనీ. ఇది ఆయనకు నూరవ సినిమా. రజనీ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన పీరియడ్ 1990–2000. ఆ పదేళ్లల్లో చేసిన ’దళపతి’, ‘అన్నామలై’, ‘బాషా’, ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘నరసింహ’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. 2000 –2020 ‘నరసింహా’ సూపర్ సక్సెస్ తర్వాత రజనీ చేసిన ‘బాబా’ ఘోరపరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని, మళయాళ చిత్రం ‘మణిచిత్ర తాళు’ తమిళ రీమేక్ ‘చంద్రముఖి’లో నటించారు. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ‘శివాజీ’ చేశారు. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ‘రోబో’(2010) వచ్చింది. ఇండియన్ ఇండస్ట్రీలో అప్పటి వరకు అంత నిర్మాణం (దాదాపు 200 కోట్ల బడ్జెట్)తో ఏ సినిమా తెరకెక్కలేదు. ఆ తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు రజనీ. నాలుగేళ్ల విరామం తర్వాత తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ చేసిన ‘కొచ్చాడియాన్’ (విక్రమ సింహా), ఆ తర్వాత చేసిన ‘లింగ’ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ‘కబాలి’ కూడా హైప్ ను మ్యాచ్ చేయలేకపోయింది. ఆ తర్వాత ‘కాలా, 2.0, పేట్టా, దర్బార్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు రజనీకాంత్. హిమాలయాలకు.. రజనీ విడిగా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఒకసారి ఓ గుడికి మామూలు లుంగీ, చొక్కాతో వెళ్లిన రజనీని గుర్తు పట్టక ఒకావిడ 10 రూపాయలు ఇచ్చింది. రజనీ నవ్వుతూ ఆ నోటుని తీసుకున్నారు. లగ్జరీ కారు ఎక్కుతున్న ఆయన్ను చూసిన ఆవిడ ‘రజనీకాంత్’ అని గ్రహించింది. దగ్గరకెళ్లి క్షమాపణ చెబితే, రజనీ నవ్వేశారు. ఏడాదికి ఓసారి హిమాలయాలకు వెళతారు. కొన్ని రోజులపాటు ధ్యానం చేస్తారు. పై పై మెరుగులకు ప్రాధాన్యం ఇవ్వడం వృథా అంటారు రజనీ. అందుకే స్టార్ అయినప్పటికీ సామాన్యుడిలానే ఉంటారు. దటీజ్ రజనీకాంత్. రజనీ పంచ్ డైలాగ్స్ ► అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశ పడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. (నరసింహ) ► ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు. (బాషా) ► దేవుడు శాసిస్తాడు. ఈ అరుణాచలం పాటిస్తాడు. (అరుణాచలం) ► నాన్నా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్‌గా వస్తుంది. (శివాజీ) ► నా దారి రహదారి. బెటర్ డోంట్ కమిన్ మై వే. (నరసింహ). -
హిందీ వివాదం.. వెనక్కి తగ్గిన షా
న్యూఢిల్లీ: హిందీని జాతీయ భాషగా చేయాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోన్న సంగతి తెలిసిందే. అమిత్ షా నిర్ణయాన్ని అన్ని దక్షిణాది రాష్ట్రాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఆఖరికి బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో కూడా షా వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో జాతీయ భాషగా హిందీ అంశంలో అమిత్ షా వెనక్కి తగ్గారు. ప్రాంతీయ భాషలను వదిలి హిందీని జాతీయ భాషగా మార్చాలని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘హిందీని జాతీయ భాషగా మార్చి ప్రాంతీయ భాషలను పక్కకు పెట్టాలని నేను ఎప్పుడు అనలేదు. కాకపోతే మాతృభాషతో పాటు రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే సూచించాను. నేను నాన్ హిందీ రాష్ట్రం గుజరాత్‌కు చెందిన వాడినే కదా. కానీ కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించి.. రాజకీయం చేయలని భావిస్తున్నారు. ఇక దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అన్నారు. హిందీని జాతీయ భాషగా చేయాలన్న అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నేతలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం బలవంతంగా తమ మీద హిందీని రుద్దితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. (చదవండి: షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్..) -
భార్యను పొగడ్తలతో ముంచెత్తిన సూపర్ స్టార్
నలభై ఏళ్ల నుంచి సిని పరిశ్రమలో నం.1 స్థానంలో కొనసాగుతున్నారు తలైవా రజనీకాంత్. ఇప్పటికి కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు ఈ సూపర్ స్టార్. గురువారం విడుదలైన రజనీ 2.ఓ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఇండియా టూడేతో ముచ్చటించారు రజనీకాంత్. ఈ సందర్భంగా తన భార్య లతా రజనీకాంత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు రజనీకాంత్. ‘తను నా పిల్లలను, కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటుంది. తను నాకు స్నేహితురాలు, ఫిలాసఫర్ అన్ని’ అంటూ భార్యను పొగడ్తలతో ముంచెత్తారు రజనీకాంత్. ఈ సందర్భంగా తన పిల్లలు దర్శకురాలు ఐశ్వర్య ధనుష్, డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ సౌందర్య రజనీకాంత్‌ల గురించి కూడా మాట్లాడారు. ‘నా పిల్లల విషయంలో నేను ఎప్పుడు సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే నా పిల్లలిద్దరూ వారికి నచ్చిన రంగంలోనే స్థిరపడ్డారు. వారు చేసే పని పట్ల వారు సంతోషంగా ఉన్నారం’టూ చెప్పుకొచ్చారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. -
షాకింగ్ : ఆన్లైన్లో లీకైన 2.ఓ
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో ఎస్ శంకర్ దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన 2.ఓ అన్ని రికార్డులను తిరగరాస్తూ అత్యధిక థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ఈ మూవీ తొలిరోజు భారీ కలెక్షన్లను కొల్లగొట్టగా, మూవీ మేకర్లను షాకింగ్‌కు గురిచేస్తూ సినిమా పూర్తి హెచ్డీ ప్రింట్‌ను పైరసీ వెబ్సైట్ తమిళ్‌రాకర్స్ లీక్ చేసింది. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్దిగంటలకే హెచ్డీ ప్రింట్ పూర్తిగా లీక్ కావడం నిర్మాతలు, రజనీ అభిమానులను కలవరపరిచింది. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు ఈ తరహా పైరసీ వెబ్సైట్ల జాబితాతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఆన్లైన్ పైరసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిర్మాతలు ఇన్ని ఏర్పాట్లు చేసినా సినిమా లీక్ కావడం దుమారం రేపుతోంది. పలు పైరసీ వెబ్సైట్లను ప్రభుత్వం బ్లాక్ చేసినా తమిళ్రాకర్స్ను బ్లాక్ చేయలేదు. ఇదే వెబ్సైట్ గతంలో ధనుష్ నటించిన వడచెన్నై, విజయ్ హీరోగా తెరకెక్కిన సర్కార్ మూవీలను లీక్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 2.ఓకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సెల్ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ దుష్ర్పభవాల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది. -
2.ఓపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్ శంకర్ అద్భుత సృష్టిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొంది మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల 2.ఓపై వివాదం అలుముకుంది. ఈ మూవీలో మొబైల్ ఫోన్, టవర్లు, మొబైల్ సేవలపై చిత్ర రూపకర్తలు అశాస్ర్తీయ ప్రచారం చేశారని సెల్యులార్ ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ) ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ పోషించిన పాత్ర ద్వారా మొబైల్ ఫోన్ వాడకందారులను పర్యావరణానికి పక్షులు, జంతువులకు రేడియేషన్‌తో హాని చేసే వారిలా దూషిస్తుంటారని పేర్కొంది. మొబైల్ ఫోన్లు, టవర్లు భూమిపై జీవరాశికి, మానవాళికి ప్రమాదకరమైనవిగా దుష్ర్పచారం సాగించారని సీబీఎఫ్‌సీతో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తూ సీఓఏఐ లేఖ రాసింది. టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ వీడియోతో పాటు సినిమా తమిళ వెర్షన్‌కు ఇచ్చన సర్టిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని ఈ లేఖలో సెన్సార్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది గంటలకే ఈ ఫిర్యాదు వెలుగుచూడటం గమనార్హం. -
సూపర్స్టార్లు.. ఇప్పుడు మాట్లాడరేం?
రీల్ లైఫ్‌లో ఆడవారిని వేధించే రౌడీల బెండు తీసే సూపర్స్టార్లు.. రియాలిటీలో మాత్రం మౌనంగా ఉన్నారెందుకంటూ దక్షిణాది నటి శ్రద్ధా శ్రీనాథ్ మండి పడ్డారు. ఆడవారి మీద వేధింపులకు వ్యతిరేకంగా ప్రారంభమయిన మీటూ ఉద్యమానికి దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది.. కానీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు మాత్రం ఈ విషయంలో మౌనమే శరణ్యమన్నట్లు ఉన్నారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలు మీటూ గురించి స్పందించినా.. చాలా దౌత్యంగా మాట్లాడారు. తమిళ్, తెలుగు బడా హీరోలు మాత్రం ఇంత వరకూ ఈ విషయం గురించి నోరు మెదపలేదు. దాంతో స్టార్ హీరోల మౌనాన్ని ప్రశ్నిస్తూ నటి శ్రద్ధ వరుస ట్వీట్లు చేశారు. ‘తల్లిని, అక్కాచెల్లళ్లని వేధించే విలన్ల బెండు తీస్తారు.. అవసరమైతే భారీ ట్రక్కులను కూడా అవలీలగా గాల్లో ఎగిరిలే చేస్తారు. అయితే ఇవన్ని కేవలం 70 ఎమ్ఎమ్ స్ర్కీన్ మీద మాత్రమేనా. ఇప్పుడు కూడా ఆ మ్యాజిక్ చూపించండి. ప్లీజ్ సూపర్‌స్టార్స్ ఇప్పటికైనా మాట్లాడండి. నేను మీ స్పందన ఏంటో తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న’ అంటూ శ్రద్ధ ట్వీట్ చేశారు. I'm mildly curious. Where are the men. :) The men who on 70 mm screens vow to protect their sisters and mothers and fight off a dozen bad men and make trucks fly. Please do your magic now. Say something. I just want to know what our superheroes think. That's all. — Shraddha Srinath (@ShraddhaSrinath) October 20, 2018 -
నానా పటేకర్ నన్ను వేధించాడు : తనుశ్రీ దత్తా
ఓ బాలీవుడ్ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తనుశ్రీ దత్తా ఫైనల్‌గా ఆ నటుడి పేరు వెల్లడించారు. హిందీ, మరాఠీ, అస్సామీ, నేపాలీ, తమిళ చిత్రాల్లో నటించడమే కాక జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించారు. 2009లో ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం గురించి తనుశ్రీ దత్తా మాట్లాడుతూ ‘నానా పటేకర్ గొప్ప నటుడు కావొచ్చు. కానీ అతడు ఆడవారి పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్ కూడా చేయరు’ అంటూ వాపోయారు. ఈ సందర్భంగా ఆమె అక్షయ్ కుమార్, రజనీకాంత్‌ల పేర్లు ప్రస్తావించారు. ‘అక్షయ్ కుమార్ గత ఎనిమిదేళ్లుగా నానా పటేకర్‌తో కొన్ని సినిమాల్లో నటించారు. సుపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ మధ్యే అతనితో ‘కాలా’ సినిమాలో నటించారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలందరూ ఇలాంటి నేరస్తులతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చిన ఫలితం ఉండద’ని బాధపడ్డారు. ఆమె మాట్లాడుతూ ‘జనాలందరూ ఈ విషయాల గురించి గుసగుసలాడతారు. కానీ ఒక్కరు కూడా ధైర్యంగా ప్రశ్నించరు. ఇంకా దారుణం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి మా గురించి చేడుగా మాట్లడతారు. ‘ఆమె స్క్రీన్ మీద ఎంత స్కిన్ షో చేస్తుంది. బయట కూడా అలానే ఉంటుంది కాబట్టే ఇలా జరిగింది’ అంటారు. కానీ ఒక్కరు కూడా మేం కేవలం మా జీవనోపాధి కోసం మాత్రమే ఇలా చేస్తున్నామని ఆలోచించరు. మాలో చాలా మంది తమ సంపాదనలోంచి కొంత భాగాన్ని పేదలకు, రైతులకు ఇస్తారనే విషయం మీకు తెలియదు. వీటన్నింటి గురించి వదిలేసి కేవలం స్కిన్ షో గురించి మాత్రమే మాట్లడతారు’ అన్నారు. -
రజనీ, కమల్‌ను నమ్ముకుంటే భవిష్యత్ ఉండదు..!
సాక్షి, చెన్నై : తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీ బీజేపీ అక్కడ పాగా వేయాలని చూస్తోంది. అధికార అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని కొందరు, లేదు డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని మరికొందరు గతంలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా.. సినీ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్‌లు కూడా తమిళ రాజకీయాల్లోకి దూకిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రజనీకాంత్ లేదా కమల్ హాసన్ పార్టీలతో జతకట్టనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. సొంతంగా ప్రయత్నిస్తే కనీస ఓటు బ్యాంక్ అయినా సాధించవచ్చనీ, రజనీ.. కమల్ పార్టీలతో పొత్తు వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని మీడియాకు వెల్లడించారు. ఎవరినో నమ్మి ముందుకెళ్తే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సినీస్టార్ల రాజకీయాలపై బీజేపీ కార్యవర్గ సమావేశంలో చర్చించాలని సూచించారు. కరునానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్‌కే పార్టీని నడిపించే సమర్థత ఉందని వ్యాఖ్యానించారు. -
‘కాలా’ టీజర్లో ధోని..
సాక్షి, చైన్నై: సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాలా’ సినిమా ఫీవర్ దక్షిణాదిలో సినీప్రియులకు ఎంతలా సోకిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను విడుదలైన 24 గంటల్లోనే కోటి ఇరవై లక్షల మంది వీక్షించారు. దీన్ని బట్టి తెలుస్తుంది కాలా ప్రభంజనం. అయితే తాజాగా క్రికెటర్లూ రజనీ ‘కాలా’ టీజర్‌కు ఫిదా అయిపోయారు. ఈ సినిమా ట్రైలర్‌ను స్పూఫ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (సీఎస్కే) రజనీపై తమ అభిమానాన్ని చాటుకుంది. సీఎస్కే టీజర్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ ‘కాలా’ అదేం పేర్రా..! అంటాడు. వెంటనే ఓపెనర్ విజయ్ కాలా అంటే కరికాలుడు..చావుకే దడ పుట్టించేవాడు అనే డైలాగ్ విసురుతాడు. వెస్టిండీస్ ప్లేయర్ డ్వేన్ బ్రావో కాలా అంటే కాపాడేవాడు.. నమ్మిన వాళ్లను గొడవ పడైనా కాపాడతాడు అంటూ విజయ్‌ని అనుసరిస్తాడు. టీజర్ చివర్లో.. టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ‘ఏం రా సెట్టింగా’ అంటూ రజనీ స్టైల్లో చెప్తాడు. చివర్లో మళ్లీ సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని ఎప్పుడు చూళ్లేదు కదూ... ఇప్పుడు చూపిస్తా అని విలన్లను రఫ్పాడిస్తాడు. ఇలా కాలా టీజర్లో సీఎస్కే క్రికెటర్లు హంగామా చేశారు. ఒక పక్క ‘కాలా’ సినిమా టీజర్‌ను చూసి రజనీ అభిమానులు ఎంజాయ్ చేస్తుండగా.. మరోపక్క సీఎస్కే జట్టు ఈ సినిమా టీజర్‌ని తన వెర్షన్లో చూపించి అటు సినిమా ఇటు క్రికెట్ అభిమానులని ఆకట్టుకుంటోంది. -
ఒకే వేదికపై రజనీ,కమల్
సాక్షి,చెన్నై: రాజకీయ అరంగేట్రంపై విస్పష్ట సంకేతాలు పంపిన అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్ ఆదివారం ఒకే వేదికపై మెరిశారు. శివాజీగణేషన్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, ఇమేజ్ ఒక్కటే సరిపోదని ఇంకా ఏదో అవసరమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలతో మమేకమైతేనే వారి ఆదరణ చూరగొంటామన్నారు.తన కన్నా కమల్ హాసన్ కు రాజకీయాల్లో ఎలా జయించవచ్చో బాగా తెలుసన్నారు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఏం కావాలని ఇటీవల తాను కమల్‌ను అడగ్గా ఆయన తనతో వస్తే చెబుతానని చెప్పారన్నారు. ఈ విషయం రెండు నెలల ముందు అడిగి ఉంటే బాగుండేదేమోనని వ్యాఖ్యానించారు. కాగా, శివాజీ గణేషన్ స్మారక కేంద్రాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రారంభించారు. -
తలైవా మద్దతు!
► అన్నదాతకు అండగా ముందుకు ► రూ.కోటి ఇవ్వడానికి సిద్ధమని ప్రకటన ► అయ్యాకన్నుకు రజనీకాంత్ అభినందనలు కరువు కోరల్లో చిక్కి తల్లడిల్లుతున్న తమిళ రైతుకు మద్దతుగా దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్ ముందడుగు వేశారు. రైతుపోరుకు మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా ముందుకు సాగాలని అన్నదాతకు సూచించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు నదుల అనుసంధానానికి రూ. కోటి ఎప్పుడైనా ఎక్కడైనా ఇవ్వడానికి సిద్ధం అని స్పష్టంచేశారు. ఇక, రైతు నాయకుడు అయ్యాకన్ను బృందాన్ని తలైవా అభినందించారు. సాక్షి, చెన్నై : వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతుల గుండె ఆగడం, బలవన్మరణాల సంఖ్య పెరగడం వెరసి అన్నదాతల్లో ఆందోళన బయలుదేరింది. తమను ఆదుకోవాలని నినదిస్తూ రైతు నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నెలన్నర రోజుల పాటుగా పోరాటాలు సాగించారు. ఆ సమయంలో కంటితుడుపు చర్యగా హామీలు గుప్పించిన పాలకులు, తదుపరి విస్మరించడంతో మళ్లీ రైతన్నలు పోరుబాటకు సిద్ధమయ్యారు. దక్షిణ భారత నదుల అనుసంధాన సంఘం నేత అయ్యాకన్ను నేతృత్వంలో ఉద్యమం ఉధృతం అవుతోంది. రాష్ట్రంలో తొలి విడతగా ఆందోళనలు సాగుతున్నాయి. తదుపరి మళ్లీ ఢిల్లీ వేదికగా ఉద్యమానికి రైతులు సిద్ధం అవుతున్నారు. ఈ సమయంలో తలైవాతో రైతు బృందం భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీ రాజకీయ ఆరంగ్రేటంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో కథానాయకుడు అన్నదాతలతో భేటీ కావడం, వారికి మద్దతుగా ‘నేను సైతం’ అని మద్దతు ప్రకటించడం గమనార్హం. కథానాయకుడి మద్దతు నదుల అనుసంధానానికి రూ. కోటి ఇస్తానని గతంలో రజనీ కాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన మేరకు అయ్యాకన్ను నేతృత్వంలో రైతు ప్రతినిధులు ఆదివారం ఉదయం పోయెస్ గార్డెన్లో అడుగు పెట్టారు. అక్కడ రజనీకాంత్‌తో భేటీకి ప్రయత్నించారు. రైతు నాయకుల రాకతో రజనీకాంత్ ఇంటినుంచి ఆహ్వానం లభించింది. అయ్యాకన్ను బృందంలోకి వెళ్లగానే తలైవా మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం, శాలువతో సత్కరించడం విశేషం. అరగంట పాటు సాగిన భేటీ అనంతరం మీడియాతో అయ్యాకన్ను మాట్లాడుతూ, తమ పోరాటాలకు కథానాయకుడు మద్దతు ప్రకటించినట్టు పేర్కొన్నారు. నదుల అనుసంధానానికి రూ.కోటి ఎప్పుడు ఇస్తారని..? ప్రశ్నించేందుకు వెళ్లిన తమతో రజనీకాంత్ మర్యాద పూర్వకంగా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు. రైతు రుణాల రద్దు, ఢిల్లీ జంతర్‌మంతర్ నిరసను, మళ్లీ పోరుబాట ఉధృతం గురించి వివరిస్తూ రజనీకాంత్‌కు ఓ వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. దానిని పరిశీలించి ఆయన తన మద్దతు ప్రకటించారన్నారు. శాంతియుతంగా నిరసనలు సాగాలని ఆయన సూచించినట్టు తెలిపారు. నదుల అనుసంధానానికి రూ.కోటి ఎప్పుడైనా, ఎక్కడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు రజనీ సూచించారన్నారు. త్వరలో ప్రధానికి అందజేయాలని తాము కోరినట్టు తెలిపారు. రైతులకు సహకారంగా ముందుకు సాగుతానని, తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని రజనీ భరోసా ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. -
రజనీ ప్రకటనపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
రజనీ ప్రకటనపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ప్రకటనపై ఉత్కంఠ కొనసాగు తోంది. అభిమానులతో ఈ నెల 15 నుంచి రజనీ సమావేశాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజూ వేలాదిమంది వచ్చి రజనీని కలుసుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలన్న తమ బలమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం సైతం పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ‘మీరు రాజకీయాల్లోకి వస్తారని దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్నాను, నాకు 58 ఏళ్లు, నేను చనిపోయేలోగా ఏదో ఒకటి తేల్చండి’ అంటూ ఒక అభిమాని ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, రాజకీయాలపై ప్రశ్నించవద్దంటూ గురువారం మీడియా నుద్దేశించి రజనీకాంత్ పేర్కొనడం గమనార్హం.