
ఓ బాలీవుడ్ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తనుశ్రీ దత్తా ఫైనల్‌గా ఆ నటుడి పేరు వెల్లడించారు. హిందీ, మరాఠీ, అస్సామీ, నేపాలీ, తమిళ చిత్రాల్లో నటించడమే కాక జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించారు. 2009లో ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు.
ఈ విషయం గురించి తనుశ్రీ దత్తా మాట్లాడుతూ ‘నానా పటేకర్ గొప్ప నటుడు కావొచ్చు. కానీ అతడు ఆడవారి పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్ కూడా చేయరు’ అంటూ వాపోయారు. ఈ సందర్భంగా ఆమె అక్షయ్ కుమార్, రజనీకాంత్‌ల పేర్లు ప్రస్తావించారు. ‘అక్షయ్ కుమార్ గత ఎనిమిదేళ్లుగా నానా పటేకర్‌తో కొన్ని సినిమాల్లో నటించారు. సుపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ మధ్యే అతనితో ‘కాలా’ సినిమాలో నటించారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలందరూ ఇలాంటి నేరస్తులతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చిన ఫలితం ఉండద’ని బాధపడ్డారు.
ఆమె మాట్లాడుతూ ‘జనాలందరూ ఈ విషయాల గురించి గుసగుసలాడతారు. కానీ ఒక్కరు కూడా ధైర్యంగా ప్రశ్నించరు. ఇంకా దారుణం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి మా గురించి చేడుగా మాట్లడతారు. ‘ఆమె స్క్రీన్ మీద ఎంత స్కిన్ షో చేస్తుంది. బయట కూడా అలానే ఉంటుంది కాబట్టే ఇలా జరిగింది’ అంటారు. కానీ ఒక్కరు కూడా మేం కేవలం మా జీవనోపాధి కోసం మాత్రమే ఇలా చేస్తున్నామని ఆలోచించరు. మాలో చాలా మంది తమ సంపాదనలోంచి కొంత భాగాన్ని పేదలకు, రైతులకు ఇస్తారనే విషయం మీకు తెలియదు. వీటన్నింటి గురించి వదిలేసి కేవలం స్కిన్ షో గురించి మాత్రమే మాట్లడతారు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment