
నలభై ఏళ్ల నుంచి సిని పరిశ్రమలో నం.1 స్థానంలో కొనసాగుతున్నారు తలైవా రజనీకాంత్. ఇప్పటికి కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు ఈ సూపర్ స్టార్. గురువారం విడుదలైన రజనీ 2.ఓ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఇండియా టూడేతో ముచ్చటించారు రజనీకాంత్. ఈ సందర్భంగా తన భార్య లతా రజనీకాంత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు రజనీకాంత్. ‘తను నా పిల్లలను, కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటుంది. తను నాకు స్నేహితురాలు, ఫిలాసఫర్ అన్ని’ అంటూ భార్యను పొగడ్తలతో ముంచెత్తారు రజనీకాంత్.
ఈ సందర్భంగా తన పిల్లలు దర్శకురాలు ఐశ్వర్య ధనుష్, డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ సౌందర్య రజనీకాంత్‌ల గురించి కూడా మాట్లాడారు. ‘నా పిల్లల విషయంలో నేను ఎప్పుడు సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే నా పిల్లలిద్దరూ వారికి నచ్చిన రంగంలోనే స్థిరపడ్డారు. వారు చేసే పని పట్ల వారు సంతోషంగా ఉన్నారం’టూ చెప్పుకొచ్చారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment