కమల్ హాసన్, రజనీకాంత్
సాక్క్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ సినీ నటులు చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయాల్లోకి వస్తానంటూ ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ ఊరిస్తుండగా.. మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తానంటూ తేల్చిచెప్పారు. అవసరమైతే సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న రజనీకాంత్ తాజాగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 'స్వచ్ఛతే దైవత్వం' అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలపెట్టిన 'స్వచ్ఛతే సేవ' ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు.
రజనీ రాజకీయ రంగ ప్రవేశం వెనుక బీజేపీ ప్రోత్సాహం ఉందనే వ్యాఖ్యానాలు వినిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్న రజనీ ద్వారా తమిళనాడు రాజకీయాల్లో ప్రాబల్యం చాటాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్న కమల్ హాసన్ బీజేపీయేతర ప్రతిపక్ష రాజకీయ పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నటులు రాజకీయ ప్రవేశం చేస్తే.. అది తమిళనాడు రాజకీయాల్లో మరింత వేడీ రాజేసే అవకాశముంది.
I extend my full support to our hon. Prime Minister @narendramodi ji’s #SwachhataHiSeva mission. Cleanliness is godliness.
— Rajinikanth (@superstarrajini) 22 September 2017