Vellore district
-
గుడియాత్తంలో ప్రేమికుల ఆత్మహత్య?.. రీట ఇంటి సమీపంలో వ్యవసాయబావిలో
సాక్షి, చెన్నై: వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా నెల్లూరు జిల్లా పేటకు చెందిన వెంకటేశన్ కుమారుడు అజిత్‌కుమార్(26) పాల వ్యాపారం చేసేవాడు. ఆదివారం రాత్రి శెట్టికుప్పం కాలియమ్మన్ ఆలయం వెనుక ఉన్న నీటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అజిత్‌కుమార్ చెప్పులు, సెల్‌ఫోన్ కుంట సమీపంలో ఉండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇదే గ్రామానికి చెందిన పెరుమాల్ కుమార్తె రీట(22) కాట్పాడిలోని ఓ ప్రైవేటు టీచర్ ట్రైనింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నెల్లూరు పేట పంచాయతీ వార్డు సభ్యురాలిగా కూడా ఉంది. ఇదిలా ఉండగా రాత్రి 2 గంటల సమయంలో రీట ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఒకే రోజు ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఏడాదిగా రోజూ రూ.లక్షల్లో డిపాజిట్) -
ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్
సాక్షి, వేలూరు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పును తీసుకురావాలని సినీ నటుడు, మక్కల్ నీది మయం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ తెలిపారు. మంగళవారం తిరువణ్ణామలై జిల్లాలో కమల్‌హాసన్ ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నాలుగు ప్రాంతాల్లో ప్రజలను ఆయన సందర్శించారు. ప్రజలకు అభివాదం మాత్రం చేస్తూ ఎటువంటి ప్రచారం చేయకుండా వెళ్లారు. అనంతరం ప్రయివేటు కల్యాణ మండపంలో ఆయన అభిమానులు, కార్యకర్తలతో చర్చించారు. రాజకీయల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. చదవండి: రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా! మక్కల్ నీది మయం అధికారానికి వచ్చిన వెంటనే సెయ్యారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని, నిరుపేదలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో అధికంగా గ్రామీణ కళాకారులున్నారని, వారి కష్టాలు తనకు తెలుసునన్నారు. అధికారంలోకి వస్తే కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని ప్రకటించారు. చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై! -
యాసిడ్ దాడి కేసుపై విచారణ
కేకేనగర్: వేలూరు జిల్లా తిరుపత్తూర్ సమీపంలోని కురిసిలా పట్టు మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న లావణ్య 2009లో ఉద్యోగంలో చేరింది. అనంతరం శిక్షణ పూర్తిచేసుకుని వేలూరు సాయుధదళం పోలీసుగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన సొంత ఊరైన తిరుపత్తూర్‌కు బదిలీ అయ్యారు. ఇలా ఉండగా గత శుక్రవారం ఇద్దరు అగంతకులు లావణ్యపై యాసిడ్ దాడి జరిపిన సంఘటన తెలిసిందే. దీంతో ఆమె కుడికన్ను పూర్తిగా దెబ్బతిని చూపు కోల్పోయింది. దీనిపై ఎస్పీ పగలవన్, ఐజీ తమిళచంద్రన్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న లావణ్య వద్ద విచారణ జరిపారు. లావణ్య వద్దనున్న సెల్‌ఫోన్ ద్వారా సంఘటన రోజు ఆమె ఎవరితో మాట్లాడిందనే వివరాలను పోలీసులు పరిశీలించారు. అవి పోలీసుల నంబర్లుగా తెలిశాయి. ఈ నంబర్ల ద్వారా విచారణ జరుపుతున్నారు. సంఘటన రోజు లావణ్య తనకు ఒంటరిగా ఇంటికి వెళ్లేందుకు భయంగా ఉందని, తండ్రికి ఫోన్ చేసి తోడు రమ్మని పిలిచినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెపై దాడి జరిగే విషయం ఆమెకు ముందుగానే తెలిసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసుపై విచారణ జరుపుతున్నారు. -
బతుకు బలి
వేలూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట సిప్కాట్లోని కలుషిత నీటి ట్యాంక్ పగిలిపోవడంతో పది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విషవాయువులు పీల్చడం వల్ల మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. వేలూరు:రాణిపేట సిప్కాట్లో తోళ్లు, రసాయనాలు, ఇనుము, ప్లాస్టిక్ తదితర 86 పరిశ్రమలున్నాయి. ప్రధా నంగా తోళ్ల పరిశ్రమల నుంచి వెలువడే కలుషిత నీటిని శుభ్రం చేసి నిల్వ చేసేందుకు 50 లక్షల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన స్టోరేజ్ట్యాంక్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ట్యాంక్‌లోని నీటిని శుద్ధిచేసి మళ్లీ పరిశ్రమలకు విని యోగిస్తుంటారు. తోళ్ల పరిశ్రమలో పనిచేసే కార్మికుల విశ్రాంతి షెడ్‌ను ఈ తొట్టె సమీపంలోనే నిర్మించారు. శుక్రవారం రాత్రి విధులు పూర్తిచేసుకుని 13 మంది కార్మికులు షెడ్లో నిద్రిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సుమారు వెయ్యి మీటర్ల ఎత్తున్న ఈ కలుషిత నీటిట్యాంక్ ఒక్కసారిగా బద్ధలైంది. అందులోని నీరు వరదలా కార్మికులు నిద్రిస్తున్న షెడ్లోకి ప్రవేశించింది. ప్రవాహం తీవ్రతకు పరిశ్రమల ప్రహరీగోడ సైతం కూలిపోయింది. అనుకోకుండా ఆదే సమయంలో అక్కడికి చేరుకున్న పరిశ్రమల సూపర్వైజర్ అమీర్, రవి, పయణిలు ముక్కులు మూసుకుని ప్రమాద స్థలం నుంచి పరుగులు తీశారు. విషయాన్ని పరిశ్రమ యాజమాన్యానికి, అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వేలూరు జిల్లా కలెక్టర్ నందగోపాల్, పోలీస్ డీఐజీ తమిల్ చంద్రన్, ఎస్పీ సెంథిల్‌కుమారి సంఘటనా స్థలానికి చేరుకుని వేలూరు, రాణిపేట, వాలాజలోని అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి సహాయక చర్యలు ప్రారంభించారు. వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు జేసీబీ సాయంతో అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. నిద్ర మత్తులో ఉన్న పదిమంది కార్మికులు బురదలో కూరుకుపోవడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో తొమ్మిదిమంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారుకాగా మరోవ్యక్తి తమిళనాడుకు చెందిన వాడిగా గుర్తించారు. ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు కార్మికుల్లో ఇద్దరికి విషవాయువు శోకడంతో శ్వాస ఆడక కొంత సేపటికే స్పహతప్పి పడిపోయారు. మృతదేహాలను, స్ఫృహకోల్పోయిన వారిని వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా విషవాయువు ఆ ప్రాంతంలోని వీధుల్లో ప్రవేశించి బీభత్సంగా మారింది. రోడ్లన్నీ బురదమయమై దుర్వాసన ప్రబలడంతో గ్రామస్తులు ఆందోళన చె ందారు. అనుమతిలేకుండానే తొట్టి నిర్మాణం పరిశ్రమల వ్యర్థాల నుంచి వెలువడే నీటిని శుద్ధిచేసే విభాగానికి కాలుష్యనియంత్ర మండలి అనుమతి పొందిన యాజమాన్యం భారీ నీటితొట్టిను మాత్రం అనుమతి పొందకుండానే నిర్వహిస్తోంది. పైగా నీటిశుద్ధి విభాగ నిర్మాణం పూర్తికాకుండానే వినియోగించడం, అనుమతి పొందని నీటి తొట్టె ప్రమాదానికి కారణమని వేలూరు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి కామరాజ్ తెలిపారు. నీటిశుద్ధి విభాగానికి సీల్‌వేసి సమగ్రవిచారణ జరుపుతామని ఆయన చెప్పారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు పది మంది మృతి చెందిన ప్రాంతాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేసీ వీరమణి, కార్మిక సంక్షేమ శాఖ మంత్రి మోహన్, ఎమ్మెల్యేలు డాక్టర్ విజయ్, మహ్మద్‌జాన్, శ్రీనివాసన్, కలైఅరసన్, రవి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రిలో ఉన్న మృత దేహాలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. పది మందిని బలిగొన్న ప్రమాదంపై వెంటనే విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ నందగోపాల్‌ను ఆదేశించారు. మృతులకు తలా రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ప్రకటించారు. మృతుల వివరాలు తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని మేల్వలం గ్రామానికి చెందిన వాచ్‌మన్ సంపత్(40), పశ్చిమబెంగాల్‌కు చెందిన అబీర్ఖాన్(50), అలీ ఆస్కార్(25), అలీ అక్బర్(23), సుకూర్(45), ఏసియామ్(23), అక్రమ్(22), ఫియార్(25), షాజహాన్(25), కుదూర్(18)లు మృతి చెందారు. -
చేతులు, కాళ్లు కట్టివేసి విద్యార్థినిపై హత్యాచారం
మానవ మృగాలు బాలికతో ఆడిన రాక్షస క్రీడ పురుష జాతికే మాయని మచ్చలా మిగిలిపోయింది. భయంతో, బాధతో విలవిల్లాడుతున్న బాలిక కాళ్లు, చేతులు కట్టేసి మృగాల కంటే క్రూరంగా ప్రవర్తించారు. ఆ తరువాత నిర్దయగా మద్యం బాటిల్‌తో కొట్టి చంపేశారు. మద్యం మత్తులో మునిగిన కొందరు దుండగులు సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న బాలికపై సాగించిన వికృత క్రీడ ఇది. పాఠశాలకు వెళ్లిన కుమార్తె, మరుసటి రోజు ఉదయం శవమై కనిపించడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతమైంది. ఏ పాపం తెలియని ఆ బాలికపై జరిగిన అఘారుుత్యానికి గుండెలు చెరువయ్యేలా రోదించారు. వేలూరు: గుడియాత్తం సమీపంలో ఆరో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన అమానుష సంఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో సంచలనం రేపింది. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ కూలీ. ఇతని రెండో కుమార్తె కీర్తిక(11) మార్చనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లిన కీర్తిక రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియరాలేదు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చే దారిలోని పెరియాంకుప్పం వద్ద ఉన్న మామిడితోటలో కీర్తిక మృతదే హాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కేవీ కుప్పం పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. కీర్తిక కాళ్లు, చేతులు కట్టి తలపై బాటిల్‌తో కొట్టిన గాయాలున్నట్లు గుర్తించారు. మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు ఉండడాన్ని పరిశీలించారు. విద్యార్థిని సైకిల్ మామిడి తోట పక్కన ఉన్నట్లు కనుగొన్నారు. విద్యార్థిని పాఠశాల నుంచి వస్తుండగా, కొందరు అడ్డుకుని మామిడి తోటలోకి లాక్కెళ్లినట్లు భావిస్తున్నారు. విద్యార్థిని స్కూల్ బ్యాగును తోటలో ఒక పక్క విసిరి వేశారు. విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టి వేసి, అత్యాచారం చేసి, తరువాత బాటిల్‌తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా కీర్తిక స్నేహితులు ముగ్గురి వద్ద విచారణ చేస్తున్నారు. డీఐజీ విచారణ: విషయం తెలుసుకున్న డీఐజి తమిళ్ చంద్రన్, ఎస్పీ సెంథిల్‌కుమారి సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ రిటో అనే విద్యార్థి వద్దకు వెళ్లింది. అనంతరం అక్కడ నుంచి విద్యార్థి ఇంటిని చుట్టి దురైమూలం గ్రామం వద్దకు వెళ్లి నిలిచిపోయింది. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.