చండీగఢ్: బిహార్లో ఎన్నికల సమరం ఊపందుకోగా పంజాబ్ ఎన్నికల ప్రచారంతో మారుమోగిపోతోంది. అదేంటి బిహార్లో ఎన్నికలు వస్తే పంజాబ్లో ప్రచారమేమిటీ, పంజాబ్లో అప్పుడే ఎన్నికలు వచ్చాయా అని అనుకుంటున్నారా.. మరేం లేదు. బిహార్కు చెందిన వారంతా దేశంలోని పలు రాష్ట్రాలు ప్రాంతాలతో పోలిస్తే పంజాబ్లోనే వివిధ పనుల్లో ఉండిపోయారంట.
దీంతో నాయకులు, వారి తరుపు ప్రచార కార్యకర్తలు అంతా పంజాబ్ వీధుల వెంట బారులు తీరి తమ అభ్యర్థులకే ఓటెయ్యాలంటూ ప్రచారం దంచి కొడుతున్నారు. ముఖ్యంగా ఎలాగైనా బిహార్ అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ఊపుతో ఉన్న బిజేపీ పంజాబ్లో చలో బీహార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే వేగంతో కాంగ్రెస్, జేడీయూ కూడా ఓటర్లను బీహార్కు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. పంజాబ్ లో దాదాపు 20లక్షలమంది బిహారీలు పంజాబ్ లో ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.
ఎన్నికలు బిహార్లో.. ప్రచారం పంజాబ్లో
Published Sun, Oct 4 2015 4:56 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Advertisement