
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలైన యలమలకుదురు, పెద్ద పులిపాకలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి సోమవారం పర్యటించారు. యలమలకుదురులో డంపింగ్ యార్డును ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..పెద పులిపాక వరుకు రిటర్నింగ్ వాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. కృష్ణమ్మ శాంతించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. అంటువ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శానిటేషన్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని..రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు.
వరద సహాయక కేంద్రాలను పరిశీలించిన ఎంపీ పొట్లూరి..
ఇబ్రహీంపట్నం: వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం విజయవాడ ఎంపీ పొట్లూరి వరప్రసాద్ పర్యటించారు. వరద సహాయక కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.వరద బాధితులను పరామర్శించి..ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందిస్తామని తెలిపారు.ఆయన వెంటన వైఎస్సాఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.