సాక్షి, కృష్ణా: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడమే టీడీపీ లక్ష్యమని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందకూడదని టీడీపీ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. కృష్ణా డెల్టాలో కెనాల్ ఆధునీకరణ పనులపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. యనమలకుదురు-కంకిపాడు కెనాల్ ద్వారా 2 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. కెనాల్ అభివృద్ధి పనులపై టీడీపీ నేత బోడె ప్రసాద్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్క గంపెడు మట్టి కూడా తీయలేదని,టీడీపీ నేతలు కాలువ పనులపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నీరు, చెట్టు పేరుతో కాంట్రాక్టులు పిలిచి అవినీతికి ఆస్కారం ఉన్న పనులే చేశారని మండిపడ్డారు. నీరు, చెట్టు కింద కాలువ పనులు చేయలేకపోయారని, సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మే నెలలోనే రాష్ట్రంలో ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి కమిటీ వేశారని గుర్తుచేశారు.
జూన్‌లో వర్షాలు ప్రారంభమవడం వల్ల అప్పుడు పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. తర్వాత నుండి చిన్న కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, అందుకే ఎక్కువ మిషనరీ ఉన్న ఒకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ నా బినామీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిడ్డారు. ఇదే కాంట్రాక్టర్ గతంలో దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పనులు చేశారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment