వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి అనారోగ్యంతో నిమ్స్‌లో చేరారు.
దాచేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి అనారోగ్యంతో నిమ్స్‌లో చేరారు. గుండెకు సంబంధించి సమస్య తలెత్తటంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరినట్లు గుంటూరు జిల్లా గురజాలకు చెందిన పార్టీ నాయకులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక జంగా తండ్రి వీరయ్య, తర్వాత ఆరు నెలల వ్యవధిలోనే తల్లి వీరమ్మ మృతిచెందడంతో మానసిక ఒత్తిడికి లోనై గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తాయని పార్టీ నేతలు చెప్పారు.