ప్రజాసంకల్పయాత్ర.. బీసీలకు భరోసా యాత్ర! | Prajasankalpa Yatra is BC Friendly Yatra, Says Janga Krishnamurthy | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 10 2018 6:20 PM | Last Updated on Thu, Jul 26 2018 7:17 PM

Prajasankalpa Yatra is BC Friendly Yatra, Says Janga Krishnamurthy - Sakshi

బీసీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న జంగా కృష్ణమూర్తి

సాక్షి, మల్లవరం : వైఎస్‌ జగన్‌ చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర.. బీసీలకు భరోసా యాత్ర అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, దివంగత నేత వైఎస్ఆర్‌ హయాంలో బీసీలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరంలో బీసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో బీసీ ప్రజలు, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. తప్పుడు వాగ్దానాలు ఇస్తూ బీసీ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని అన్నారు. బీసీల స్థితిగతులను మార్చడానికి చంద్రబాబు ఏ ప్రయత్నం చేయలేదని, కానీ బీసీలకు అది చేసినట్టు, ఇది చేసినట్టు మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement