
సాక్షి, వైఎస్‌ఆర్ జిల్లా : బీసీ నేతల సూచనలను తాము వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నామని వైఎస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీ సమస్యలు, అభ్యున్నతిపై పార్టీ బీసీ అధ్యయన కమిటీ శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
ఈ భేటీలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, జంగా కృష్ణమూర్తి పార్టీ నేతలు సురేష్ బాబు, అమర్‌నాథ్ రెడ్డి, పులువురు నేతలు హాజరయ్యారు. మెరుగైన డిక్లరేషన్ కోసం బీసీ సంఘాలను సంప్రదిస్తున్నామని ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి చెప్పారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ చేసిందేమీ లేదని, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment