BC cell president
-
రాజధానికి 53 వేల ఎకరాల భూమి అవసరమా?
సాక్షి, అమరావతి : రాజధాని విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలోనూ మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించే కార్యక్రమాల్లో బీసీలందరూ పాల్గొనాలని పిలుపినిచ్చారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం జగన్ ఒక సముచిత, చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రశంసించారు. మూడు రాజధానులు అనగానే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని బడుగు బలహీన వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు. (బాబుతో ప్రతాప్ కలిసి పనిచేశారు: జంగా) రాజధాని ఎక్కడికి పోవడం లేదని, శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని తెలిపారు. ప్రజల్ని తికమక పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, రాజధానికి 53 వేల ఎకరాల భూమి అవసరమా అని ప్రశ్నించారు. 53 వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు అమరావతిలో గ్రాఫిక్స్ చూపారని, అమరావతిని బ్రమరావతిగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు లెక్కల ప్రకారం అమరావతి నిర్మించాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందని ప్రశ్నించారు. ఒకే చోట రాజధాని వల్ల ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి నడుస్తున్నారని, జరుగుతున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబుఅక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు ఆపి రాజధాని చేపట్టాలా అని, అలా చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని జంగా కృష్ణమూర్తి తెలిపారు. -
‘అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం’
-
‘మోసం చేయడం చంద్రబాబు జన్మహక్కు’
సాక్షి, వైఎస్సార్ : నాలుగేన్నరేళ్ల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను రాజకీయంగా వాడుకుని వదిలేశారని వైఎస్సార్సీపీ యువజన విభాగం కడప జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ విమర్శించారు. బీసీలపై చంద్రబాబు తీరుకు నిరసనగా ఈనెల 20న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు బీసీ నాయకుల అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సంఘం నేతలు సాయన్న, నాగయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీలకు ఏం ఉద్ధరించారని టీడీపీ నాయకులు జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు జన్మహక్కులా మారిందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. -
బీసీలకు న్యాయం.. ఆయనతోనే సాధ్యం
సాక్షి, గన్నవరం (కృష్ణా): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పత్రిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ ప్రవేశపెట్టబోయే పథకాలతోనే బీసీలకు గౌరవం, న్యాయం జరుగుతుందన్నారు. శనివారం గన్నవరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను మభ్యపెట్టడానికే ఆదరణ పథకం పెట్టారని విమర్శించారు. జన్మభూమి కమిటీలతో ఆదరణ పథకం అవినీతిమయమైందన్నారు. ఆదరణ పథకంలో నాణ్యత లోపమున్నట్లు, ఆరు శాతం అవినీతి జరిగినట్లు స్వయంగా చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఆదరణ పథకం బూటకమని, అవినీతిమయమని ఆరోపించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే 2014లో ఇచ్చిన హామీలు ‘బీసీ డిక్లరేషన్’, ‘ప్రతి సంవత్సరం పది వేల కోట్ల నిధులతో బీసీ సబ్ ప్లాన్’, నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
'బీసీ నేతల సూచనలు వైఎస్ జగన్‌కు..'
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా : బీసీ నేతల సూచనలను తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నామని వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీ సమస్యలు, అభ్యున్నతిపై పార్టీ బీసీ అధ్యయన కమిటీ శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, జంగా కృష్ణమూర్తి పార్టీ నేతలు సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి, పులువురు నేతలు హాజరయ్యారు. మెరుగైన డిక్లరేషన్ కోసం బీసీ సంఘాలను సంప్రదిస్తున్నామని ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి చెప్పారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ చేసిందేమీ లేదని, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. -
గుంటూరులో టీడీపీ నేత హత్య
గుంటూరు: గుంటూరు జిల్లా టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏమినేడి వెంకటేశ్వరరావు(40) ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా మంగళవారం వేకువజామున దుండగులు ప్రవేశించి కత్తులతో పొడిచి చంపారు. ఉదయం స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు అర్బన్ సౌత్ జోన్ డీఎస్పి బి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. టీడీపీలో క్రియాశీలంగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావును ప్రత్యర్థులే హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.