
సాక్షి, వైఎస్సార్ : నాలుగేన్నరేళ్ల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను రాజకీయంగా వాడుకుని వదిలేశారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం కడప జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ విమర్శించారు. బీసీలపై చంద్రబాబు తీరుకు నిరసనగా ఈనెల 20న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు బీసీ నాయకుల అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ సంఘం నేతలు సాయన్న, నాగయ్యతో కలిసి ఆయన మాట్లాడారు.
బీసీలకు ఏం ఉద్ధరించారని టీడీపీ నాయకులు జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు జన్మహక్కులా మారిందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.