Narsaraopeta
-
నరసరావుపేటలో స్థానికేతరులకే పట్టం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల్లో అభ్యర్థి స్థానికత అంశం ఎంతో కీలకం. కొన్నిసార్లు దాని ఆధారంగా గెలుపోటములు ప్రభావితమవుతుంటాయి. నరసరావుపేట ఓటర్లు 1998 పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటివరకు పల్నాడు వెలుపలి వారినే పట్టం కడుతున్నారు. ప్రధాన పారీ్టలు కూడా నాన్‌లోకల్ అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నాయి. 1998 ఎన్నికలలో ప్రస్తుత బాపట్ల జిల్లాలోని వేమూరులో జన్మించిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్యను నరసరావుపేట పార్లమెంట్ ఓటర్లు గెలిపించారు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి లాల్‌జాన్‌బాషాపై గెలుపొందారు. ఇదే లోకసభ నియోజకవర్గం నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి ఎంపీగా గెలవడంతో ముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంలను ఢిల్లీకి పంపిన ఘనత నరసరావుపేటకి దక్కింది. నేదురుమల్లి తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు. వీరు ముగ్గురు కాంగ్రెస్–ఐ పార్టీ తరపున గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గెలుపొందారు. మోదుగుల స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు మాత్రం అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందినవారు.2019లో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన లావు శ్రీకృష్ణదేవరాయులు వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా గత ఆరు ఎన్నికల్లో ఐదుమంది పల్నాడు ప్రాంతానికి చెందని వారు ఎంపీగా గెలుస్తున్నారు. నెల్లూరు సెంటిమెంట్ రాజకీయంగా నరసరావుపేటకి నెల్లూరుకి అవినాభావసంబంధం ఉన్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1999 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని పల్నాడు ప్రాంత వాసులు గెలిపించారు. తరువాత ఎన్నికల్లో అదే నెల్లూరు నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డిని నరసరావుపేట పార్లమెంట్ ఓటర్లు 86,255 ఓట్ల భారీ మెజారీ్టతో గెలిపించారు. ఇలా ఇప్పటివరకు నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేసిన నేతలకు నరసరావుపేట ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లా వాసి మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వైఎస్సార్సీపీ తరపున పోటీలో ఉంటున్నారు. దీంతో మరోసారి నెల్లూరు సెంటిమెంట్ పనిచేసి అనిల్‌కుమార్ యాదవ్ గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌కు బ్రహ్మరథం బీసీల అడ్డా అయిన నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఇంతవరకు ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఎంపీగా గెలుపొందలేదు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ వర్గానికి చెందిన పి.అనిల్‌కుమార్ యాదవ్‌ను పోటీలో ఉంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఆయన గెలుపు పక్కా అనే టాక్ వినిపిస్తోంది. -
నరసరావు పేట గడ్డపై అనిల్ కుమార్ యాదవ్ గూస్ బంప్స్ స్పీచ్
-
నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్
-
ఆ 87 గ్రామాలు పంచాయతీలా.. కాదా?
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను వాటిపక్కనే ఉన్న నరసరావుపేట మున్సిపాలిటీలో విలీనం చేయాలని రెండున్నరేళ్ల కిందట మున్సిపల్ శాఖ ప్రతిపాదించింది. వివిధ కారణాలతో ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో గ్రామ పంచాయతీలను స్థాయి పెంచాలని, లేకపోతే సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేయాలని పురపాలకశాఖ ప్రతిపాదించింది. పలు పంచాయతీలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు కొన్నింటిని వాటిపక్కనున్న మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. 19 మండలాల్లోని 87 గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. మున్సిపల్ శాఖ ఈ తరహాగా ప్రతిపాదించిన గ్రామ పంచాయతీల్లో అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆ 87 గ్రామ పంచాయతీల తాజా పరిస్థితి గురించి ఆరాతీసింది. వాటిని నగర పంచాయతీలుగా మార్చే, సమీప పట్టణాల్లో విలీనం చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ఇటీవల మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు లేఖ రాసింది. ఆ పంచాయతీలను గ్రామాలుగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారా అని అడిగింది. ఈ విషయాలు తెలపాలని కోరింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయా పంచాయతీల తాజా పరిస్థితిని తెలియజేయాలంటూ రెండురోజుల కిందట మున్సిపల్ శాఖకు లేఖ రాసింది. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? -
‘బీసీల అభివృద్ధికి పాటుపడే నాయకుడు సీఎం జగన్’
సాక్షి, గుంటూరు: బీసీ కులాల అభివృద్దికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల బీసీ కులాల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని నర్సారావు పేటలో సోమవారం నిర్వహించిన ఈ ర్యాలీలో ఎంపీలె మోపిదేవి వెంటకరమణ, శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ యేసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి మాట్లాడుతూ... బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. బీసీ కులాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి అభివృద్ధికి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారన్నారు. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీల అభ్యున్నతికి అభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీసీలకు తగిన గుర్తింపు గౌరవం ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా నిలిపారన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని పేర్కొన్నారు. ఆయన క్యాబినెట్లో బీసీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. బీసీలకు గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఏడాదిన్నర కాలంలో 34 వేల కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు పెట్టిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
‘ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’
సాక్షి, గుంటూరు : టీడీపీ నేతల అరాచకాలపై నరసరావుపేట ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తిపోట్లకు గురైన వెంకటరెడ్డిని శనివారం ఎమ్మెల్యే పరామర్శించారు. చంద్రబాబు పునరావాస కేంద్రంలోని వ్యక్తే కత్తితో దాడి చేశాడని విమర్శించారు. ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలే దాడులు చేస్తూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
నోట్ దిస్ పాయింట్
సాక్షి, నరసరావుపేట : పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధిగా తనను కలిసేందుకు శాలువాలు, బోకెలు, ఇతర సన్మాన సామగ్రితో రాకుండా నోట్ పుస్తకాలతో రావాల్సిందిగా సూచించారు. నిత్యం నియోజకవర్గం నుంచి ఎందరో పార్టీ నాయకులు, అధికారులు తనను కలిసేందుకు వస్తూ దండలు, బోకెలను తీసుకురావడాన్ని గమనించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా, వైద్యానికి ఇస్తున్న అధిక ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వంలో భాగస్వామ్యిగా ఉడతా సాయంగా విద్యాభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయించారు. తన వద్దకు వచ్చే సందర్శకులను బొకెలు, పూలదండలకు బదులు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు వంటి విద్యా సామగ్రితో కలవాల్సిందిగా పిలుపునిచ్చారు. విశేష స్పందన.... పేద విద్యార్థులకు సహకారం అందించే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఇచ్చిన పిలుపుతో అధికారులు, పార్టీ నాయకులు స్పందించారు. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చిన ప్రతిసారి నోట్ పుస్తకాలతో హాజరవుతున్నారు. గత పదిహేను రోజుల్లో దాదాపు ఎనిమిది వేల నోటుపుస్తకాలు ఈ విధంగా ఎమ్మెల్యేకు అందజేశారు. ఇలా లభించిన నోట్ పుస్తకాలను మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు పంపిణీకి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 29 మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఈ పుస్తకాలను అందిస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని 17 పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ పూర్తయింది. గోపిరెడ్డి చారిటీస్ ద్వారా... దాతలు అందించిన 8వేల నోట్ పుస్తకాలను పంపిణీ చేయగా మిగిలిన పాఠశాలలకు గోపిరెడ్డి చారిటీస్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్‌గోపిరెడ్డి తన సొంత నిధులతో మరో 8 వేల పుస్తకాలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల్లో మున్సిపాలిటి పరిధిలోని అన్ని పాఠశాలలకు నోట్ పుస్తకాలను అందజేయనున్నారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన విద్య ద్వారానే పేదిరికాన్నినిర్మూలించవచ్చని బలంగా నమ్మే కుటుంబం మాది. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన మాతండ్రి మా ముగ్గురు అన్నదమ్ములు, సోదరికి విద్యనే ఆస్తిగా ఇచ్చారు. ఇప్పుడు సమాజంలో గౌరవస్థానాల్లో ఉన్నాం. అటువంటి విద్య అందరికీ అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి భవిష్యత్‌లో మరికొన్ని కార్యక్రమాలను తీసుకురాబోతున్నాం.. – ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
పల్నాడు అభివృద్ధే లక్ష్యం
సాక్షి, గుంటూరు : నరసరావుపేట లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పిన్న వయస్కుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు రికార్డు సృష్టించారు. తొలి సారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన ‘సాక్షి’కి ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందేది తానేనని, పల్నాడు ప్రజల ఆశలు తీర్చటమే లక్ష్యంగా పనిచేస్తానని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టంచేశారు. ప్రశ్న : పల్నాడు ప్రాంతం నుంచి పోటీచేయడాన్ని మీరు ఏవిధంగా భావిస్తున్నారు? జవాబు: చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో చరిత్ర ఉన్న పల్నాడు సీమను అభివృద్ధి చేసే అవకాశం రావటం నా జీవితంలోనే గొప్ప విషయం. ప్రశ్న: ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? జవాబు: నరసరావుపేట ఎంపీగా ఈ ఎన్నికల్లో నేనే గెలవబోతున్నా. పల్నాడు ప్రజలు అఖండ మెజార్టీతో నన్ను గెలిపించబోతున్నారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 140 సీట్ల వరకు రాబోతున్నాయి. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మూడు దశాబ్దాలపాటు మేము నవ్యాంధ్రకు సువర్ణ పాలన అందించబోతున్నాం. ప్రశ్న: గెలుపుపై అంత నమ్మకం ఎలా వచ్చింది? జవాబు: నరసరావుపేట పార్లమెంటు సమన్వయకర్తగా మా పార్టీ నన్ను ఆరునెలల క్రితం నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల మధ్య, వారితోనే తిరుగుతున్నా. ఇప్పటి వరకు 900 గ్రామాలకు పైగా సందర్శించా. 70 వేలకు పైగా కిలోమీటర్లు తిరిగి 12 లక్షల మందికి పైగా ప్రజలను కలిశా. ఇదంతా నాకు ఎంతో మేలు చేసింది. ప్రజల నాడి తెలిసింది. టీడీపీ ఐదేళ్లపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో విసిగిపోయారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఎదురుచూస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్‌పై జనానికి ఉన్న నమ్మకం వారి మాటల్లోనే ప్రతిబింబిస్తోంది. ప్రశ్న: పార్లమెంటు స్థానం పరిధిలో ప్రధానంగా ఉన్న సమస్యలను గుర్తించారా? జవాబు : సమస్యలు చాలా ఉన్నాయి. వాటిపై అధ్యయనం చేసేందుకు ఐదు నెలల కిందటే 50 మందితో ఒక కమిటీని ఏర్పాటుచేశా. వారు ప్రతి గ్రామాన్నీ సందర్శించి ప్రజల సమస్యలపై సమగ్రమైన నివేదిక అందజేసింది. ప్రశ్న: ఆ కమిటీ మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏమిటి? జవాబు : వందల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. సాగునీరులేక అన్నదాతలు ఐదేళ్లుగా అల్లాడుతున్నారు. భూగర్భ జలాలు పడిపోగా, వర్షాలు లేక రైతులు, ఉద్యోగాలు లేక యువత ఆందోళన చెందుతోంది. పార్లమెంటు పరిధిలో ఒక్క యూనివర్సిటీ లేదు. ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. ఘన చరిత్ర గల ఈ పార్లమెంటు పరిధిలో ఒక్క మెడికల్ కళాశాల లేకపోవటం బాధ కలిగిస్తోంది. పల్లెల్లో పేదలకు కూలి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అభివృద్ధిలో ఎంతో వెనుకబడి ఉంది. ఆర్టీసీ బస్సు ముఖం చూడని పల్లెలు ఇంకా ఉన్నాయి. ప్రధాన రహదారులు విస్తరణ లేక రోజూ ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ప్రశ్న: మీరు గెలిచి అధికారంలోకి వస్తే సాగునీటి సమస్య తీరుస్తారా? అదెలా సాధ్యం? జవాబు: తప్పకుండా సాగునీటిసమస్య తీర్చొచ్చు. గోదావరి జలాలను పల్నాడుకు పరుగులు పెట్టించొచ్చు. రూ.1500 కోట్లు ఖర్చుచేస్తే చాలు కృష్ణానదితో సంబంధం లేకుండా సాగర్ కాలువలను గోదావరి జలాలతో నింపొచ్చు. పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తిచేసుకుంటే గోదావరి జలాలను పులిచింతలకు తీసుకురావచ్చు. అమరావతి మండలం వైకుంఠపురం వద్ద ఒగ మెగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటే అక్కడి నుంచి గోదావరి జలాలను నకరి కల్లు అడ్డరోడ్డు వద్ద సాగర్ జలాల్లో కలపొచ్చు. ఈ కాలువ నుంచి మరో ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను బుగ్గవాగు రిజర్వాయర్‌కు తరలించుకుంటే పల్నాడు మొత్తానికి సాగునీరు అందుతుంది. కేవలం రూ.4 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులను పూర్తిచేయొచ్చు. పోలవరం పూర్తయ్యేలోగా పట్టిసీమ నుంచి గోదావరి జలాలను తెచ్చుకొని పల్నాడును రతనాల సీమగా మార్చుకోవచ్చు. మేం గెలిస్తే ఇదే మా ప్రథమ ప్రాధాన్యం అవుతుందనటంలో సందేహమే లేదు. ప్రశ్న: తాగునీటి సమస్యను ఏవిధంగా పరిస్ఖరిస్తారు? జవాబు : సాగర్ కాలువల నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పల్నాడు పల్లెలు అన్నింటికీ తాగునీరు అందించొచ్చు. కేవలం రూ.1500 కోట్లు ఖర్చుచేస్తే గురజాల, వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లో తాగునీటి గ్రిడ్లను నిర్మించి అన్నీ గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. పిడుగురాళ్ల పట్టణానికి కృష్ణా జలాలను తరలించే ఉద్దేశంతో రూ.80 కోట్లతో చేపట్టిన రక్షిత మంచినీటి పథకం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మూలన పడినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రశ్న: పల్నాడు అభివృద్ధికి మీ వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? జవాబు : పల్నాడులో ఎక్కువగా మిరప, పత్తి పండిస్తారు. ఈ రెండు పంటలకు మద్దతు ధర దక్కాలంటే వరంగల్ తరహాలో ఓ పత్తి విక్రయం కేంద్రం, గుంటూరు తరహాలో మిర్చి యార్డును ఇక్కడ అభివృద్ధి చేయాలి. వంద ఎకరాల్లో మెగా ఫుడ్‌పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా అమలుకు నోచుకోవట్లేదు. దీన్ని వెంటనే పట్టాలు ఎక్కించాలి. 500 ఎకరాల్లో మెగా టూరిజం పార్కు, మూడు వందల మెగా వాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కాయి. ఈ ఫైళ్ల బూజును దులపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్న: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? జవాబు : చాలా బాగా సాగుతోంది. విరామం లేకుండా ప్రజల్లోనే ఉంటున్నా. నేనే కాదు నా కోసం నా భార్య మేఘన, చెల్లెలు రుద్రమదేవి విరామంలేకుండా కష్టపడుతున్నారు. నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలోనే ఉంటూ నాకు మద్దతుగా నిలుస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. నాన్నగారు లావు రత్తయ్య క్షేత్రస్థాయిలో నా విజయంకోసం శ్రమిస్తున్నారు. ప్రశ్న: ఓటర్లకు ఏమైనా చెబుతారా? జవాబు : నాయకుడు పరిగెత్తే స్థితిలో ఉంటేనే ప్రజలు ఆయనతో పరిగెత్తగలరు. నాయకుడు, ప్రజలు కలిస్తే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. నాయకుడు కనీసం నడవలేని స్థితిలో ఉంటే ప్రజలకు లాభం ఉండదు. ఓట్లు వేయించుకొని ఆ తర్వాత కన్పించకుండా వెళ్లిపోయే మనస్తత్వం నాదైతే కాదు. మా నాయకుడు నాకు నరసరావుపేట బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి నేను ఇక్కడి ప్రజల మధ్యనే ఉంటున్నా. వారి సమస్యలు వింటూనే ఉన్నాను. పని చేసేవారెవరో, స్థానికంగా అందుబాటులో ఉంటున్న వారెవరో, ఉత్సాహంగా జనంతో కలిసి తిరుగుతున్న వారెవరో గుర్తించి ఓట్లేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. -
ఇద్దరు డాక్టర్ల మధ్యే పోటీ
సాక్షి, నరసరావుపేట : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థులుగా డాక్టర్లు పోటీ పడుతున్నారు. జనసేన, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్న ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్యే జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా తొలిసారిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు పోటీ పడుతున్నారు. డాక్టర్ గోపిరెడ్డి పది రోజుల నుంచి ముమ్మరంగా ప్రచారం చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారు. డాక్టర్ చదలవాడను తమ అభ్యర్థిగా టీడీపీ మంగళవారం తెల్లవారుజామున ప్రకటించింది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు డాక్టర్లు, అందునా ఎముకల, కీళ్ల వైద్య నిపుణులు కావడం గమనార్హం. -
బంగారంపై ఎక్సైజ్ పన్ను ఉపసంహరించాలి
- ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ డిమండ్ నరసరావుపేట వెస్ట్: బంగారం వస్తువులపై విధించిన సెంట్రల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని, అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తమ పోరాటం కొనసాగుతుందని ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ స్పష్టం చేశారు. పన్నును వ్యతిరేకిస్తూ వ్యాపారులు చేపట్టిన నిరవధిక బంద్ కార్యక్రమం గురువారానికి రెండవ రోజుకు చేరుకుంది. వ్యాపారులంతా తమ షాపులను మూసేసి మెయిన్‌రోడ్డులోని శ్రీ శారదా జ్యూయలరీ మార్టు ముందు కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఇదే డిమాండ్‌పై గతంలో కొన్నిరోజులు వ్యాపారులు బంద్ పాటించారని గుర్తుచేశారు. అయితే కార్పోరేట్ వ్యాపారులు కొంతమంది బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విజయవాడ, గుంటూరుల్లో ఆయా కార్పోరేట్ సంస్థల ముందు వ్యాపారులు కూర్చోని బంద్‌కు సహకరించాలని కోరారన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ పన్నును ఉపసంహరించకుండానే తామేమి వ్యాపారులను ప్రశ్నించమని, తనిఖీలు చేపట్టమని చెబుతున్నా అవేమీ నెరవేరేవి కావన్నారు. పన్నును ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది వ్యాపారులు, వారిపై ఆధారపడిన పనివారు ఇబ్బందులు పడతారన్నారు. నరసరావుపేట అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గొడవర్తి చంద్రశేఖరరావు, కాపులపల్లి ఆదిరెడ్డి, కోశాధికారి కూకుట్ల కృష్ణారావు, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. -
టైర్లను ఇనుపచువ్వలతో గుచ్చిన పోలీసులు