
డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ చదలవాడ అరవిందబాబు
సాక్షి, నరసరావుపేట : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థులుగా డాక్టర్లు పోటీ పడుతున్నారు. జనసేన, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్న ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్యే జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా తొలిసారిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు పోటీ పడుతున్నారు. డాక్టర్ గోపిరెడ్డి పది రోజుల నుంచి ముమ్మరంగా ప్రచారం చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారు. డాక్టర్ చదలవాడను తమ అభ్యర్థిగా టీడీపీ మంగళవారం తెల్లవారుజామున ప్రకటించింది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు డాక్టర్లు, అందునా ఎముకల, కీళ్ల వైద్య నిపుణులు కావడం గమనార్హం.