
సాక్షి, అమరావతి: నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం.. ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకోనున్నారు. మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొనున్నారు మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి సీఎం జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు. చదవండి: సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు