gopuja
-
హిందూ ప్రధానిగా గర్విస్తున్నా
లండన్: బ్రిటన్ మొట్టమొదటి హిందూ ప్రధాని అయినందుకు గర్వపడుతున్నానని భారత సంతతికి చెందిన రిషి సునాక్ అన్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో భావాల్ని పంచుకున్నారు. ప్రధానిగా తాను ఎన్నికవడం బ్రిటన్‌లో భిన్నత్వానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.యూకేకి 42 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రిషి సునాక్ ఏదైనా ముఖ్య కార్యక్రమం చేయడానికి ముందు గోమాతకి పూజ చేస్తారు. దీపావళి పండుగని ఘనంగా జరుపుకుంటారు. ‘‘ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి పండుగకి దివ్వెలు వెలిగించాను. అలా చెయ్యగలగడం మన దేశం ఎంత అద్భుతమైనదో చాటి చెప్పింది. అదే సమయంలో అదో పెద్ద విషయం కాదన్న అంశాన్ని కూడా చెప్పింది.’ అని సునాక్ అన్నారు. ప్రధాని ఎన్నిక సమయంలో బోరిస్ జాన్సన్ ప్రధాని కావడానికి వీలుగా తాను పోటీ నుంచి తప్పుకుంటానని జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘‘పార్లమెంటులో నా సహచర ఎంపీల నుంచి నాకు గట్టి మద్దతు ఉంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న సమయంలో ప్రధానిగా నేనే సరైన వ్యక్తినని గట్టిగా నమ్మాను. రేసు నుంచి తప్పుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు’’ అని సునాక్ స్పష్టం చేశారు. -
బ్రిటన్ ప్రధాని రేసు.. రిషి సునాక్ గోపూజ
లండన్: ఎక్స్‌చెకర్ మాజీ ఛాన్సలర్, బ్రిటన్ ఎంపీ, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా గెలవాలని భారత ప్రజలతో పాటు ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవైపు కన్జర్వేటివ్ పార్టీలో తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే రేసులో వెనుకబడిపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం రిషి సునాక్ గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా లండన్‌లో రిషి సునాక్(42) గోపూజ నిర్వహించారు. భార్య అక్షతా మూర్తితో కలిసి ఓ గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భార్యాభర్తలిద్దరూ రంగులతో అలంకరించిన ఆవుకు హారతి ఇచ్చి.. పూజలు చేశారు. అది మన గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి మనం గర్వపడాలి అంటూ ఓ ట్విటర్ యూజర్ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. లండన్ శివారులో జన్మాష్టమి వేడుకల సందర్భంగా భక్తివేదాంత్ మనోర్‌లో జరిగిన పూజలకు రిషి సునాక్ తన సతీసమేతంగా హాజరయ్యారు. భగవద్గీత తనపై ఎంత ప్రభావం చూపిందన్నది రిషి సునాక్ ఈ సందర్భంగా వివరించారని.. మనోర్ తన అధికారిక పేజీలో వివరించింది. అంతేకాదు.. స్వయంగా రిషి సునాక్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆ ఫొటోలను ఉంచారు. Who? Rishi Sunak (PM candidate) Where ? London, England What ? Performing Cow worship That’s our rich cultural heritage we must be proud about. तत् त्वम असि = Tat twam asi #Hinduism #Rishisunak #India #London #Hindutva pic.twitter.com/aaKdz9UM5R — Sumit Arora (@LawgicallyLegal) August 25, 2022 ఇదిలా ఉంటే.. చెకర్ ఛాన్స్‌లర్‌గా ఉన్న టైంలో 2020 దీపావళి వేడుకల్లో రిషి సునాక్ పాల్గొన్నారు. లాక్డౌన్ ఆంక్షల నడుమ దీపాలను వెలిగించి వేడుకల్లో ఆయన పాల్గొన్న తీరుపై అక్కడ విమర్శలు ఎదురైనా.. భారత్ నుంచి మాత్రం మంచి మద్దతే లభించింది. ఎక్కడికెళ్లినా భారతీయులు కొందరు తమ సంప్రదాయం, ఆచార వ్యవహారాలను మరిచిపోరని.. రిషి కుటుంబం అందుకు మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) ఇదీ చదవండి: అక్కడ భారత సంతతి వ్యక్తులదే హవా.. 130మందికి కీలక పదవులు -
విశాఖ శారదాపీఠంలో గోపూజ
-
టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా గోమాహా సమ్మేళనం
-
‘గుడికో గోమాత’కు విశేష స్పందన..
సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గోమాతలను దానం ఇచ్చేందుకు భక్తులు ముందుకొస్తున్నారు. కాశీ విశ్వేశ్వర ఆలయానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీదగా కపిల గోవును గాయత్రీ సొసైటీ అందజేసింది. గోపూజ నిర్వహించి ఆలయానికి గోమాతను టీటీడీ ఛైర్మన్ అప్పగించారు. గోపూజలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.(చదవండి: ‘అదే మమ్మల్ని గెలిపించే మంత్రం’) ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గోవును పూజిస్తే ముక్కోటి దేవతలు, తల్లిదండ్రులను పూజించినట్టేనని ఆయన తెలిపారు. గోమాత విశిష్టతను తెలియచేసేందుకు గుడికో గోమాత కార్యక్రమం చేపట్టామని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో ‘గుడికో గో మాత’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఆలయ నిర్వాహకులు ముందుకొస్తే ఆవును,దూడను టీటీడీ అందచేస్తుందన్నారు. టీటీడీ ఖర్చులతోనే ఆలయాలకు గోవులను చేరుస్తామని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు.(చదవండి: స్థానిక ఎన్నికలు: బీజేపీ.. ఓటుకు రేటు) గత ప్రభుత్వం కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిలిపివేసిందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఆర్థిక స్థోమత లేని పేద జంటలకు తాళిబొట్టు, బట్టలు అందచేసి వివాహాలు జరిపిస్తామని చెప్పారు. అందరికీ వెంకన్నను చేరువ చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో 500 దేవాలయలను నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారని తెలిపారు. త్వరలోనే ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. కరోనా కారణంగా ఆలయాల నిర్మాణం ఆలస్యమయిందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
మనసున్న మారాజు మా జగనన్న..
సాక్షి, గుంటూరు: గోపూజ మహోత్సవంలో ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. స్టాల్స్‌ను సందర్శిస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ గంగిరెద్దు వద్ద ఆగారు. అపుడు ఆయనను ఆశీర్వదిస్తున్నట్లు ఎద్దు తలను ఆడించింది. ఆ క్షణంలో ఇనుప కంచెకు అటువైపు ఉన్న గంగిరెద్దు తల, ఫెన్సింగ్‌పై ఉన్న ఇనుప రాడ్‌కు తగిలేలా అనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం జగన్.. ఆ ఇనుప రాడ్‌పై తన చేతిని ఉంచారు. ఆ తర్వాత ఎద్దు తలను తన చేత్తో పక్కకి జరిపి జాగ్రత్త అంటూ గంగిరెద్దును ఆడిస్తున్న వ్యక్తిని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా.. మూగజీవికి ఇబ్బంది కలగకుండా సీఎం జగన్ చూపించిన చొరవ చూసి.. ‘‘మరోసారి మనసున్న మారాజు అని నిరూపించుకున్నారు’’ అంటూ ఆయనపై అభిమానం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.(చదవండి: గోపూజ మహోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్) కాగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. మొదట మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించిన ఆయన.. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
గోపూజ మహోత్సవంలో సీఎం జగన్
-
గోపూజ మహోత్సవంలో సీఎం జగన్
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 11.30 సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. తొలుతగా మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.చదవండి: ‘అమ్మ ఒడి’లో ల్యాప్‌టాప్) రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. ‘ఒక గోవులో 33 కోట్ల దేవతలుంటారనేది ప్రతీతని, గోవును పూజిస్తే ఆ దేవతల కరుణా కటాక్షాలూ లభిస్తాయని’ గోపూజ మహోత్సవ విశిష్టత గురించి నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్ కార్య నిర్వాహకుడు వైష్ణవ కృష్ణదాస్ వివరించారు. ప్రతి ఇంట్లో గోవులను పూజించాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆచరించి చూపిస్తున్నారని ఆయన కొనియాడారు. చదవండి: పక్కా పథకం ప్రకారమే అలజడులకు కుట్ర -
నేడు నరసరావుపేటకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం.. ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకోనున్నారు. మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొనున్నారు మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి సీఎం జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు. చదవండి: సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు -
గోపూజ సర్వదేవతా పూజ
బోట్‌క్లబ్ (కాకినాడ) : గోవులను పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లేనని హిందూ ధర్మరక్షసమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా ఆనందభారతి మైదానంలో జరుగుతున్న లక్ష గో పిడకల యజ్ఞం శుక్రవారం ముగిసింది. గవర య్య మాట్లాడుతూ పూర్వీకులు గో ఆధారిత వ్యవసా యం చేయడం వల్ల వారికి ఎలాంటి రోగాలూ రాలేదన్నారు. నేడు క్రిమి సంహారక మందులతో వ్యవసాయం చేయడం వల్ల ప్రతి ముగ్గురిలో ఒక్కరు ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నారన్నారు. గోవుల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని చె ప్పారు. ఇస్కా¯ŒS ప్రతినిధి జీవదాసు, సమితి జిల్లా అధ్యక్షుడు పుట్టా రాజారావు గోవు విశిష్టతను వివరించారు. ఉదయం గాంగేయుల బుచ్చిరాజు శర్మ శిష్య బృందం సౌర పంచాయతన దీక్షా యజ్ఞం నిర్వహించారు.