సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 11.30 సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. తొలుతగా మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.చదవండి: ‘అమ్మ ఒడి’లో ల్యాప్‌టాప్)
రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. ‘ఒక గోవులో 33 కోట్ల దేవతలుంటారనేది ప్రతీతని, గోవును పూజిస్తే ఆ దేవతల కరుణా కటాక్షాలూ లభిస్తాయని’ గోపూజ మహోత్సవ విశిష్టత గురించి నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్ కార్య నిర్వాహకుడు వైష్ణవ కృష్ణదాస్ వివరించారు. ప్రతి ఇంట్లో గోవులను పూజించాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆచరించి చూపిస్తున్నారని ఆయన కొనియాడారు. చదవండి: పక్కా పథకం ప్రకారమే అలజడులకు కుట్ర
Comments
Please login to add a commentAdd a comment