గోపూజ సర్వదేవతా పూజ
గోపూజ సర్వదేవతా పూజ
Published Fri, Feb 10 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
బోట్‌క్లబ్ (కాకినాడ) :
గోవులను పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లేనని హిందూ ధర్మరక్షసమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా ఆనందభారతి మైదానంలో జరుగుతున్న లక్ష గో పిడకల యజ్ఞం శుక్రవారం ముగిసింది. గవర య్య మాట్లాడుతూ పూర్వీకులు గో ఆధారిత వ్యవసా యం చేయడం వల్ల వారికి ఎలాంటి రోగాలూ రాలేదన్నారు. నేడు క్రిమి సంహారక మందులతో వ్యవసాయం చేయడం వల్ల ప్రతి ముగ్గురిలో ఒక్కరు ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నారన్నారు. గోవుల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని చె ప్పారు. ఇస్కా¯ŒS ప్రతినిధి జీవదాసు, సమితి జిల్లా అధ్యక్షుడు పుట్టా రాజారావు గోవు విశిష్టతను వివరించారు. ఉదయం గాంగేయుల బుచ్చిరాజు శర్మ శిష్య బృందం సౌర పంచాయతన దీక్షా యజ్ఞం నిర్వహించారు.
Advertisement