
సాక్షి, గుంటూరు: జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ నరసరావుపేటలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా అక్కడ 48 గంటల పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ మంగళవారం తెలిపారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలంతా సహకరించాలన్నారు.
(చదవండి: పట్టణాలకే పరిమితమైన కరోనా)
‘ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అత్యవసరమైనవి తప్ప మరెలాంటి కేసులు చూడటానికి వీల్లేదు. క్వారంటైన్ సెంటర్లలో మంచి ఆహారం అందిస్తున్నాం. ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ కూడా ఇస్తున్నాం. అనుమానిత లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోండి. లాక్ డౌన్ ఉల్లంఘించినవారిని జైలుకు పంపుతున్నాం’అని శామ్యూల్ ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా గడిచిని 24 గంటల్లో కొత్తగా మరో 17కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 254కు చేరింది. 8 మంది మృతి చెందారు.
(చదవండి: ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment