సాక్షి, గుంటూరు/తెనాలిరూరల్: తెనాలిలో తొలి కరోనా పాజిటివ్ కేసు బాధితుడి, అతని తండ్రి, చెన్నై నుంచి అతన్ని తీసుకువచ్చేందుకు సహకరించిన లారీ ఓనర్, డ్రైవర్‌పై కేసు నమోదైంది. వైరస్ భారినపడిన ఐతానగర్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు చెన్నైలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల ఒకటో తేదీన చెన్నై కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు తెనాలి నుంచి కాయగూరల లోడ్‌తో వెళ్లింది. ఈ లారీ డ్రైవర్ ఫోన్ నెంబర్‌ను చెన్నైలో ఉన్న యువకునికి తండ్రి ఇచ్చి లారీలో తెనాలికి రావాలని సూచించాడు. (కరోనా.. వివక్షను తొలగిద్దాం)
దీంతో కాయగూరల లారీలో నాలుగో తేదీ యువకుడు తెనాలిలోని నివాసానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న వలంటీర్లు, వైద్య సిబ్బంది పరీక్షలు జరుపగా ట్రూనాట్ విధానంలో పాజిటివ్ వచ్చింది. తదుపరి పరీక్షల కోసం గుంటూరు పంపగా యువకుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. స్థానిక ఏఎన్‌ఎం ఫిర్యాదు మేరకు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కరోనా బాధితుడు, అతని తండ్రి, లారీ ఓనర్ పాలేటి గోపి, డ్రైవర్ సారథిలపై తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. (చిన్నారులు సహా ప్రతి ఒక్కరికీ సాయం)
Comments
Please login to add a commentAdd a comment