
సాక్షి, గుంటూరు: అధికార టీడీపీకి చెందిన కార్యకర్తలు హద్దుమీరుతున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు హల్‌చల్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఇంటిముందుకు చేరుకున్న కార్యకర్తలు ఆ పార్టీ నాయకుడు కోడెల శివరామ్ పుట్టిన రోజు వేడుకలను జరిపారు. టీడీపీ ఫ్లెక్సీలు చూపుతూ.. నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది సరైన పద్దతి కాదంటూ అభ్యంతరం వ్యకం చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి యత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను తరిమికొట్టారు.