ముద్రగడకు కూరగాయల వర్తకుల మద్దతు | Vegetable sellers support Mudragada Padmanabham hunger strike | Sakshi
Sakshi News home page

ముద్రగడకు కూరగాయల వర్తకుల మద్దతు

Published Sat, Feb 6 2016 3:41 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

ముద్రగడకు కూరగాయల వర్తకుల మద్దతు

ముద్రగడకు కూరగాయల వర్తకుల మద్దతు

- ఖాళీ కంచాలపై గరిటెలతో డప్పు వేసిన వర్తకులు

నరసరావుపేట (గుంటూరు) : తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా మానిఫెస్టోలో పొందుపరచిన కాపుల రిజర్వేషన్‌ను అమలుచేయాలని కోరుతూ ఆమరణదీక్ష చేపట్టిన కాపు నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతు పెరుగుతోంది. నరసరావుపేటలోని లాల్‌బహదూర్ కూరగాయల మార్కెట్ వర్తకులు శనివారం కూరగాయల మార్కెట్ ముందు ఖాళీ కంచాలపై గరిటెలతో డప్పు వాయిస్తూ ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కాపుల రిజర్వేషన్‌పై వెంటనే జీవో జారీచేయాలని, కాపు నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. లాల్‌బహదూర్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనకు వర్తక సంఘ అధ్యక్షుడైన షేక్ ఆదంషఫీ కూడా పాల్గొని మద్దతును తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement