
సాక్షి, గుంటూరు : నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి సుబ్బాయమ్మ (85) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుబ్బాయమ్మ మృతి పట్ల పలువురు పార్టీ నేతలు ఎమ్మెల్యే గోపిరెడ్డికి సంతాపం తెలిపారు. కాగా ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవింద బాబుపై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment