కోడెల కుమార్తెపై ఉన్న కేసుల వివరాలివ్వండి | kodela family scam: AP High Court Order on vijayalakshmi case details | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 13 2019 10:07 AM | Last Updated on Sat, Jul 13 2019 10:09 AM

kodela family scam: AP High Court Order on vijayalakshmi case details - Sakshi

సాక్షి, అమరావతి: భూ దందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, కే ట్యాక్స్‌ వసూలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై నమోదైన 15 కేసుల వివరాలను లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. విజయలక్ష్మి అరెస్టుపై సోమవారం తగిన నిర్ణయం వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు శుక్రవారం పేర్కొన్నారు. ఓ భూమి కొనుగోలు వివాదంలో గుంటూరు పోలీసులు తనపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేయడంతో పాటు తనను అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై శుక్రవారం జస్టిస్‌ సోమయాజులు విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ..ఎప్పుడో 2014లో ఘటన జరిగిందంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. ఎవరి వద్ద నుంచో ఆస్తి కొనుగోలు చేస్తే, ఆ ఆస్తికి ఫిర్యాదుకూ సంబంధం లేకపోయినా పిటిషనర్‌పై ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పిటిషనర్‌ను అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement