
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గురువారం కోర్టులో లొంగిపోయారు. ఉద్యోగాల పేరుతో రూ. లక్షలు దండుకుని అమాయకపు ప్రజలను మోసం చేసిన కేసుకు సంబంధించి ఆమె కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆమెకు రెండు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ప్రతి ఆదివారం వన్‌టౌన్, టూటౌన్ స్టేషన్‌లలో సంతకం చేయాలని.. 1వ అదనపు జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు విజయలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయలక్ష్మి పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆమెపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment