
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్‌కు జడ్ కేటగిరి ఉన్నా ఆ మేరకు భద్రత కల్పించడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పాదయాత్రలో రోప్‌పార్టీ మినహా పోలీసులు మరెక్కడా కనిపించడం లేదు. వైఎస్ జగన్‌ను కలిసేందుకు ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు.
భద్రత కల్పించాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారి వద్ద నుంచి సరైన స్పందన రాకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం నరసరావుపేట పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా జనం తరలి వచ్చే అవకాశం ఉండటంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.