అత్యధిక మెజార్టీ ఖాయం | YSR Congress party winning the highest margin | Sakshi
Sakshi News home page

అత్యధిక మెజార్టీ ఖాయం

Published Wed, Apr 30 2014 12:51 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

అత్యధిక మెజార్టీ ఖాయం - Sakshi

అత్యధిక మెజార్టీ ఖాయం

నరసరావుపేట ఈస్ట్, న్యూస్‌లైన్ :జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందనున్న నియోజకవర్గాల్లో నరసరావుపేట మొదటి స్థానంలో నిలుస్తుందని వైఎస్సార్ సీపీ నరసరావుపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వైఎస్సార్ సీపీని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. మూడున్నరేళ్లుగా పార్టీ కోసం పని చేశానని, సమస్యలపై ఉద్యమాలు, దీక్షలు చేపట్టిన విషయం ప్రజలందరికి తెలుసని చెప్పారు. ప్రజలతో మమేకమైతేనే వాళ్లకు ఏం కావాలో తెలుసుకోగలుగుతామని, డబ్బుతో రాజకీయాలు చేయలేమని తెలిపారు.
 
 పట్టణం, గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహన ఉందని, పార్టీ అధికారంలో రాగానే పరిష్కరిస్తానని చెప్పారు. నరసరావుపేట ప్రజలు ఆత్మసాక్షిగా ఓటు వేయాలని, ప్రజల తరపున నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం చారిత్రక తప్పిదం అన్న చంద్రబాబు ఏ విధంగా మళ్లీ పొత్తుపెట్టుకున్నారని ప్రశ్నించారు. ఫ్యాన్ గాలిని తట్టుకోలేక టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయని, అయినప్పటికీ వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని జననేత జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అన్నవరపు కిషోర్, పార్టీ పట్టణ యువజన విభాగం కన్వీనర్ రామిశెట్టి కొండ, ఎంఐఎం నాయకులు షేక్ మస్తాన్‌వలి, కాపు యువజన నాయకుడు ఎన్‌కే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement