గుంటూరు: గుంటూరు జిల్లా నరసారావుపేట శివారులోని దివ్య నాగసాయి ఆయిల్మిల్లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటాలార్పుతున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని ఆయిల్ మిల్ యాజమాన్యం వెల్లడించింది.