oil mill
-
‘విజవర్ధిని’ కి పునర్జీవం
సాక్షి, అలంపూర్:బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్‌మిల్‌కు పునర్జీవం రానుంది. ఏళ్ల తరబడిగా మూతబడిన పరిశ్రమ త్వరలోనే కళకళ లాడనుంది. ఫ్యాక్ట రీ తిరిగి ప్రారంభించడానికి ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ఆయిల్‌ఫెడ్ ఎండీ నిర్మల, సీనియర్ మేజర్ సుధాకర్‌రెడ్డితో బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్‌మిల్ పునరుద్ధరణపై సమావేశం జరిగింది. దీంతో మిల్లు పునఃప్రారంభంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్డీడీ బీ నుంచి తీసుకున్న అప్పును చెల్లించి తిరిగి ఆయిల్ మిల్ పునఃప్రారంభానికి చర్యలు చేపట్టారు. విజయవర్ధిని ఆయిల్‌మిల్ తిరిగి తెరచుకోనుండటంతో స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఉద్యోగావకాశాలు కలగనుండటంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు నెలల్లో విజయవర్ధినికి పునర్జీవం కలగే అవకాశం ఉంది. మిల్లులను తెరుచుకుంటే బీచుపల్లి ప్రాంతంలో వ్యాపార లావాదేవీలు జోరందుకునే అవకాశం ఉంటుంది. బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్ మిల్లు 2003లో మూతపడింది. మిల్లులో ఉత్పత్తయిన నూనె, ఇతర పదార్థాల అమ్మకాల్లో అధికారుల చేతివాటం అక్రమాలు తోడై అప్పుల ఊబిలోకి వెళ్లింది. అప్పులను తీర్చి మళ్లీ ప్రారంభించేందుకు ఎన్డీడీబీ (నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు) ఆర్థిక సాయం అందించింది. అయినప్పటికీ అక్రమాలు ఆగక వచ్చిన ఆర్థికసాయం కూడా నష్టాల్లోకి వెళ్లడంతో 2003లో పూర్తిగా ఫ్యాక్టరీ మూతపడింది. మిల్లు మూతపడడంతో గద్వాల, వనపర్తి వ్యవసాయ మార్కెట్లలో వేరుశనగ ఉత్పత్తులకు కేవలం వ్యాపారులు మాత్రమే ధర నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఆయిల్‌మిల్లు పనిచేసినంత కాలం ఈ మార్కెట్లో మిల్లుకు సంబంధించిన అధికారులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల గిట్టుబాటు ధర లభించింది. ప్రస్తుతం మార్కెట్లలో ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా తర్వాత గద్వాల, వనపర్తి జిల్లాలో వేరుశనగను ఎక్కువగా పండిస్తున్నందున ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయిల్‌మిల్ మూత పడడం రైతులకు శాపంగా మారింది. ఏళ్ల తరబడిగా మిల్లు మూతపడి ఉండటంతో ఉమ్మడి రాష్ట్రంలోనే కొంత సామగ్రి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తరలించారు. ఉన్న సామగ్రి తుప్పుపడుతున్నాయి. బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్మిల్ను 1990లో ప్రారంభించారు. ఇటిక్యాల మండలం తిమ్మాపురం శివారులోని 410,411,412,413,401 సర్వే నంబర్లలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌మిల్ ఏర్పాటు చేశారు. అప్పట్లో దాదాపు రూ.18కోట్ల వ్యయంతో దీన్ని ప్రారంభించారు. 1983లో వేరుశనగ రైతులకు మరింత ఆదాయం కల్పించడానికి, తక్కువ ధరకే వేరుశనగ నూనె ప్రజలకు అందించడానికి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి బీజాలు పడ్డాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కర్నూలు జిల్లాలో నూనె గింజలను సేకరించి రైతులకు మద్దతు ధర కల్పించడం కూడా ఒక ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. ప్రభుత్వం బీచుపల్లి వద్ద విజయబ్రాండ్ ఆయిల్ మిల్లును ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడంతోపాటు, విజయ బ్రాండ్ నూనెలను ఉత్పత్తి చేసి వచ్చే ఆదాయంలో రైతులకు వాటా ఇచ్చే లక్ష్యంతో బీచుపల్లి ఆయిల్ మిల్‌ను ప్రభుత్వం నిర్మించింది. వేలాదిమంది కార్మికులతోపాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించడం, రైతులకు వాటా ఇవ్వడం బీచుపల్లి మిల్లు నిర్మాణం లక్ష్యం. అప్పట్లోనే ఈ మిల్లు ద్వారా 1400 మందికి ఉద్యోగావకాశాలను కల్పించారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 2వేల మందికి పైగానే ఉపాధి కల్పించిన ఆయిల్‌మిల్లు కొన్నేళ్లపాటు విజయవంతం కొనసాగింది. పునరుద్ధరణకు సన్నాహాలు దాదాపు 16ఏళ్ల పాటు మూతపడిన విజయర్ధిని ఆయిల్ ఫ్యాక్టరీ పురుద్ధరణకు ఆయిల్‌ఫెడ్ కంపెనీవారు సన్నాహాలు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఫ్యాక్టరీ తెరవడానికి చర్యలు చేపడుతుంది. అప్పట్లో వేరుశనగ నూనె, కేక్ ఆయిల్ తయారీ జరిగేది. ఇందుకోసం జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ) నుంచి అప్పు తీసుకుంది. ప్రస్తుతం ఈ అప్పు చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ అప్పును వన్ టైం సెటిల్మెంట్తో చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవాలని ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్డీడీబీ రూ.7.5 కోట్లు కావాలని కోరుతుండగా ఆయిల్‌ఫెడ్ రూ.3 నుంచి రూ.5 కోట్లతోనే సెటిల్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయిల్‌ఫెడ్ ఎండీ సమావేశం నిర్వహించింది. గతంలో 200 మెట్రిక్ టన్నులు వేరుశనగ, ఇతరత్రా నూనెలను ఉత్పత్తి చేయడం జరిగేది. ఫ్యాక్టరీ తెరిచాక వేరుశనగ నూనెలతోపాటు పామాయిల్, ఇతరాత్ర నూనెలు ఉత్పత్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిచేసి రెండు లేక మూడు నెలల్లో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ పునఃప్రారంభం అయితే జోగుళాంబ జిల్లాలో కీలకంగా మారనుంది. ఉద్యోగ, వ్యాపారాలతో కళకళ లాడనుంది. -
విద్యుత్‌తో నడిచే గానుగలపై 15 రోజుల శిక్షణ
ఆరోగ్య స్పృహతో పాటు గానుగ నూనెలకు గిరాకీ పెరుగుతున్నది. నూనె గింజల నుంచి ఆరోగ్యదాయక పద్ధతిలో వంట నూనెలను గ్రామస్థాయిలోనే ఉత్పత్తి చేయడానికి విద్యుత్‌తో నడిచే గానుగ(పవర్ ఘని)లు మంచి సాధనాలు. వీటి నిర్వహణలో మెలకువలపై ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ 16 ఏళ్లు నిండి, కనీసం 8వ తరగతి చదివిన రైతులు, యువతీ యువకులకు శిక్షణ ఇవ్వనుంది. గతంలో నెల రోజులు శిక్షణ ఇచ్చేవారు. తాజాగా 15 రోజుల స్వల్పకాలిక శిక్షణా కోర్సును రూపొందించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో గల డా. బీఆర్ అంబేడ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థలో శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 4,070. ప్రయాణ చార్జీలు అదనం. విద్యుత్‌తో నడిచే గానుగ గంటకు 15 కిలోల గింజల నుంచి నూనెను తీయవచ్చు. 40–45% వరకు నూనె వస్తుంది. శిక్షణ పొందిన వారు సబ్సిడీపై స్వయం ఉపాధి రుణాలు పొందొచ్చు. హైదరాబాద్‌లోని ఖాదీ కమిషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఎం. హరిని సంప్రదించవచ్చు.. 95335 94597, 040–29704463. -
నిషేధానికి పొగ
పాడైన పాత టైర్లను పంక్చర్ దుకాణదారు వద్దనో.. లేదా టైర్లు మార్చిన మెకానిక్ వద్దనో వదిలేస్తాం. కానీ హైదరాబాద్‌కు చెందిన కొంతమంది వాటితోనే వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సేకరించిన పాత టైర్లను చిన్నశంకరంపేట మండల కేంద్రానికి తరలిస్తున్నారు. ఇక్కడి టైర్ల నుంచి అయిల్ తీసే మిల్ (ఈ తరహా పరిశ్రమలపై నిషేధం ఉంది)లో గానుగాడించేందుకు రాత్రికి రాత్రికి తెస్తున్నారు. ఇలా పరిశ్రమలో ఉడికించిన టైర్ల నుంచి వచ్చిన ఆయిల్‌ను గుట్టు చప్పుడు కాకుండా మళ్లీ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీన్ని బీటీరోడ్డు కోసం వాడుతున్న తారులో కలిపి నాసిరకం తారు దందాను నడుపుతున్నారు. అనుమతులు లేని ఈ కంపెనీలో పచ్చని చెట్ల నుంచి సేకరించిన కలపను బట్టీల నిర్వహణకు వాడుతున్నారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వం కాలుష్య కారక పరిశ్రమలపై వేటు వేసింది. అయినా చిన్నశంకరంపేట శివారులో అధికారుల కన్నుగప్పి గుట్ట చప్పుడు కాకుండ టైర్ల నుంచి ఆయిల్ తీసే పరిశ్రమలను నడుపుతున్నారు. పగలంత గప్‌చూప్‌గా ఉండేæ ఈ పరిశ్రమలు రాత్రయితే చాలు పని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ పాత టైర్ల నుంచి ఆయిల్ తీసి అక్రమ దందాను నడుపుతున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు కామారం శివారులోనూ ఈ రకమైన పరిశ్రమలున్నాయి. గతంలోనే టైర్లను ఉడికించి అయిల్ తీసే పరిశ్రమలు కాలుష్య కారకమైనవిగా గుర్తించి ప్రభుత్వం వాటిని నిషేధించింది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ నిషేధిస్తు ఉత్తర్వులు ఇవ్వడంతో మూత పడ్డాయి. తాజాగా కొన్ని నెలలుగా ఈ వ్యాపారం మళ్లీ ప్రారంభించారు. టైర్లను రాత్రి సమయంలో ఉడికించి తీసిన అయిల్ను ట్యాంకర్ల ద్వారా రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. పగలంతా ఆ పరిశ్రమలకు తాళం వేసి ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో రాత్రి సమయంలో వదిలే కాలుష్య రసాయనలతో వాతవారణం చెడిపోతుంది. సమీప వ్యవసాయ పొలల్లో దుమ్మదూలి పేరుకుపోవడంతో పాటు బోర్లలోని నీరు సైతం కాలుషితం అవుతున్నాయి ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. హైదరాబాద్‌కు తరలింపు.. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన టైర్లను చిన్నశంకరంపేట శివారులోని గోడుగుమర్రి సమీపంలో ఉన్న టైర్ల కంపెనీలో ఉడికిస్తున్నారు. ఇలా ఉడికించగా టైరు డాంబర్ అయిల్‌గా మారిపోతుంది. దీంతో పాటు టైర్లలోని ఇనుప తీగలు కూడ బయటకు తీస్తున్నారు. ఈ అయిల్ను ట్యాంకులో నుంచి ట్యాంకర్‌లోకి తీసుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఇనుప తీగలను సైతం ఒక దగ్గర చేర్చి పాత ఇనుప సామను తరలించే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అక్రమ కలప నిలువ... నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఈ పరిశ్రమలలో టైర్లను ఉడికించడానికి బారీగా కలప అక్రమ నిల్వలను సేకరిస్తున్నారు. ఈ కలపతోనే బాయిలర్లను నడుపుతున్నారు. దీంతో మండలంలోని వృక్ష సంపద కూడా తగ్గిపోతోంది. దీని కోసం కలప వ్యాపారులను ప్రోత్సహిస్తూ అవసరమైన కలపను పరిశ్రమకు తెప్పించుకుంటున్నారు. గుట్టుగా జరుగుతోంది.. ఈ కంపెనీల్లో పని చేసే కూలీలు సైతం చత్తీస్‌గఢ్ నుంచి తీసుకువస్తున్నారు. వీరంతా రాత్రి పని చేసి, పగలంతా విశ్రాంతి తీసుకుంటారు. పరిశ్రమ పరిసరాల్లోనే వీళ్లకు అవసరమైన ఇళ్లను ఏర్పాటు చేశారు. వీరికి బయట ఎవరితోనూ సంబంధం లేకుండా అవసరమైన కిరాణం సమాను సైతం వారే సమకూర్చుతున్నారు. స్థానికంగా ఓ వ్యక్తి ఇదంతా మేనేజ్ చేస్తున్నప్పటికి టైర్లు తీసుకువచ్చేవారు కాని, డాంబ ర్ను తరలించేవారు కాని తనకు తెలియదని చెబుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దందా నడిపిస్తున్నాడని తెలిపాడు. రోజు కంపెని నడవదని, టైర్లు వచ్చినప్పుడు, మరో వైపు డంబర్ అయిల్ తీసుకుపోతారనుకున్నప్పుడే నడిపిస్తారని చెప్పాడు. -
నమ్మించి...వంచించాడు..
► చెల్లి పెళ్లికి వడ్డీకి డబ్బు తెచ్చిన పవన్ ► తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని సోమశేఖర్‌ను అడగటంతోనే హత్య ప్రత్తిపాడు: అవసరమంటే అప్పు ఇచ్చాడు.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటే నమ్మకంగా వెళ్లాడు... ఇచ్చిన రుణమే యమపాశమవుతుందని గ్రహించలేకపోయాడు... అప్పుతీసుకున్న వ్యక్తే అభం శుభం తెలియని యువకుడిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే తుమ్మలపాలెంకు చెందిన కోనంకి పవన్‌కుమార్‌ది సామాన్య కుటుంబం. తండ్రి చిలకలూరిపేటలో ని ఓ ఆయిల్ మిల్లులో కూలీగా పనిచేస్తాడు. తల్లి వ్యవసాయ పనులకు వెళుతుంది. ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద చెల్లి సునీతకు కొంతకాలం కిందట వివాహం చేశారు. తాజా గా నెలన్నర కిందట రెండవ చెళ్లి లక్ష్మికి కూడా వివాహం చేశారు. వివాహం చేసేందుకు డబ్బులు లేకపోవడంతో వడ్డీకి అప్పు తెచ్చి చేశారు. పవన్‌కుమార్‌కు కూడా వివాహమైంది. పదకొండు నెలల పసికందు ఉన్నాడు. ఆ అప్పు తిరిగి చెల్లించేందుకు .. కొద్ది నెలల కిందట కోనంకి పవన్‌కుమార్ మంగళగిరికి చెందిన తలతోటి సోమశేఖర్‌ను నమ్మి అతనికి ఐదు లక్షల రూపాయలు ఇంటి డాక్యుమెంట్లు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్పుగా ఇచ్చాడు. చెల్లి వివాహ సమయంలో డబ్బుల్లేక అప్పు చేశామని, ఆ డబ్బును తిరిగి మేం చెల్లించాల్సి ఉందని, తనకు ఇవాల్సిన ఐదులక్షలు తిరిగి ఇచ్చేయాలంటూ పవన్‌కుమార్ సోమశేఖర్‌ను ఇటీవల తరచుగా అడుగుతున్నాడు. తన వద్ద డబ్బులు లేవని, ఇంటి డాక్యుమెంట్లు తీసుకొస్తే అవి వేరే వాళ్ల దగ్గర తనఖా పెట్టి డబ్బులు ఇస్తానని సోమశేఖర్ పవన్‌కు చెప్పినట్లు సమాచారం. దీంతో నిజమేనని నమ్మ వెళ్లిన పవన్‌కుమార్ చివరకు దారుణ హత్యకు గురయ్యాడు. చివరి చూపునకు కూడా నోచని వైనం.. సోమశేఖర్ చేతిలో దారుణ హత్యకు గురైన కోనంకి పవన్‌కుమార్‌ను కడసారి చూసుకునే అవకాశం కూడా కుటుంబ సభ్యులకు లేకుండా పోయింది. చంపేసి తగలబెట్టడం, అస్తికలను నదిలో కలపడంతో పవన్‌కుమార్ కుటుంబ సభ్యుల వేదన అరణ్యరోదనగా ఉంది. కడసారి చూసుకునేందుకు కూడా అవకాశం లేకపోవడంతో భార్యతో పాటు తల్లిదండ్రులు కుమిలికుమిలి ఏడుస్తున్నారు. వారి ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. -
మిల్లులో అగ్నిప్రమాదం: భారీగా ఆస్తి నష్టం
మెదక్ : మెదక్ జిల్లా సిద్ధిపేట నర్సాపూర్ చౌరస్తా వద్ద గణేష్ ఆయిల్‌మిల్లులో బుధవారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మిల్లులోని భద్రత సిబ్బంది వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆయిల్ మిల్లులో తనిఖీలు
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరులోని వీరభద్ర ఆయిల్ మిల్లును గురువారం పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆయిల్ నమూనాలను సేకరించారు. మిల్లులో ఆయిల్ కల్తీ జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఏఎన్‌వో తెలిపారు. నమూనాలను ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించనున్నట్లు వివరించారు. -
నూనె మిల్లులో ప్రమాదం: కార్మికురాలు మృతి
పాల్వంచ టౌన్ (ఖమ్మం) : ఆయిల్ మిల్లులో ప్రమాదవశాత్తూ ఓ కార్మికురాలు మృతి చెందింది. ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలోని గొల్లగూడెంలో వాసవి ఆయిల్ మిల్లులో దేశబోయిన కవిత (25) కార్మికురాలిగా పనిచేస్తోంది. సోమవారం మధ్యాహ్నం మిల్లులో పల్లీలను పోస్తున్న సమయంలో ఆమె చీర కొంగు మిషన్‌కు చుట్టుకోవడంతో అది ఆమె మెడకు ఉచ్చులా బిగుసుకుంది. దీంతో ఊపిరాడక కవిత ప్రాణాలు కోల్పోయింది. కవితకు భర్త కన్నస్వామి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఆయిల్ మిల్లుపై విజిలెన్స్ దాడులు
గార్లదిన్నె (అనంతపురం జిల్లా) : గార్లదిన్నె మండలం కల్లూరులోని రాధాకృష్ణ ఆయిల్ మిల్లుపై సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ.20 లక్షల విలువ చేసే వేరుశనగను సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు, లైసెన్స్ చూపించకపోవడం వల్లే సీజ్ చేస్తున్నట్లు డీసీటీఓ చెన్నయ్య, విజిలెన్స్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ అనిల్ బాబు ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించారు. -
ఆయిల్ మిల్లులో తనిఖీలు
వేములవాడ రూరల్ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలోని ఓ ఆయిల్ మిల్లులో మార్కెట్ కమిటీ కార్యదర్శి పృథ్వీరాజ్ సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఆయిల్ మిల్లు అనుమతి లేకుండా నడస్తుండడంతో తక్షణమే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం
-
ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం
గోపవరం: వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఓ పామాయిల్ తయారీ మిల్లులో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడగా.. నిల్వ ఉన్న ఆయిల్ దగ్ధమైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆదివారం తెల్లవారుజామున కూడా ఈ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో వెలువడిన బూడిదను పక్కన పోయగా.. వాటిలోని నిప్పు రవ్వలు అక్కడున్న చెత్తకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, దీన్ని పూర్తిగా ఆర్పకపోవడం వల్ల సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మరోసారి అగ్ని ప్రమాదానికి దారి తీసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. రూ.50 లక్షలు ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. -
ఆయిల్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
-
ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లా నరసారావుపేట శివారులోని దివ్య నాగసాయి ఆయిల్‌మిల్‌లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటాలార్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని ఆయిల్ మిల్ యాజమాన్యం వెల్లడించింది. -
ఆయిల్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
నర్సారావుపేట: గుంటూరు జిల్లా నర్సారావుపేట శివార్లలోని విజయనాగసాయి ఆయిల్ మిల్లులో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మిల్లు పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు వ్యాపించాయి. సుమారు రూ.కోటి ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. -
దూదిగింజలు.. కాసుల గలగలలు..
భైంసా, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా తెల్లబంగారానికి పెట్టింది పేరు. ఏటా లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. రూ.కోట్ల వ్యాపారం జరుగుతోంది. వ్యాపారులు పత్తిని మార్కెట్లో కొనుగోలు చేసి నేరుగా జిన్నింగ్ మిల్లులకు పంపిస్తారు. అక్కడ దూది, దూది గింజలను వేరు చేస్తారు. దూదితో బేళ్లు తయారు చేసి బట్టల మిల్లులకు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి అవుతాయి. మరి దూది గింజలు కూడా క్వింటాళ్ల కొద్ది వస్తాయి. వీటిని సాల్వెంట్ మిల్లులకు పంపిస్తారు. ఈ గింజలతో అక్కడ నూనె, పశువులదాణా(కల్లీ), వ్యర్థాలు(మడ్డ)లు వేరు చేస్తారు. క్వింటాలు గింజల నుంచి.. క్వింటాలు పత్తిలో దూది దాదాపు 38 కిలోలు, గింజలు దాదాపు 62 కిలో లు వస్తాయి. క్వింటాలు దూది గింజల్లో పది శాతం వృథా అవుతాయి. ఇందులో 8 శాతం నూనె, 82 శాతం పశువులదాణా(కల్లీ) తయారవుతుం ది. దూది గింజల ద్వారా వచ్చే నూనెను కిలో రూ.61 చొప్పున ట్యాంకర్ల ద్వారా హైదరాబాద్, గుజరాత్‌లోని ఆయిల్ రిఫైనరీ కేంద్రాలకు ఎగుమతి అవుతాయి. క్వింటాలు దూది గింజల నుంచి వచ్చే ఎనిమిది కిలోల నూనె విలువ రూ.488 ఉంటుంది. పశువుల దాణ అయితే ప్రస్తుతం క్వింటాలు ధర రూ.1,350 పలుకుతోంది. క్వింటాలు గింజల నుంచి ఆయిల్ మిల్లుల ద్వారా వచ్చే 82 కిలోల పశువులదాణాద్వారా రూ.1,107 వ్యాపారులకు వస్తుంది. ఇలా మిల్లులో తయారయ్యే నూనె నుంచి వచ్చే వ్యర్థాలు(మడ్డ)ను వ్యాపారులు కొనుగోలు చేస్తారు. క్వింటాలు గింజల నుంచి ఆరు నుంచి ఎనిమిది కిలోల మడ్డా వస్తుంది. ఈ మడ్డా కిలో రూ.7 నుంచి రూ.8 వరకు పలుకుతుంది. మడ్డా నుంచి కూడా రూ.50 మేర వస్తాయి. కాగా, మడ్డాను సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. ఆయిల్ మిల్లులో ఇలా... రూ.5 లక్షలతో ఒక ఆయిల్ మిల్లు యంత్రాన్ని బిగించుకోవచ్చు. ఫ్యాక్టరీ ల్లోనూ ఆయిల్ మిల్లు షెడ్లలో యంత్రాలు 4 నుంచి 32 వరకు ఉంటాయి. ఒక్కో యంత్రం గంటకు ఆరు క్వింటాళ్ల దూది గింజలను నూర్పిడి చేస్తుం ది. పత్తి సీజన్లో 24 గంటల పాటు ఒక్కో యంత్రం 150 క్వింటాళ్ల మేర దూది గింజలను నూర్పిడి చేస్తాయి. ఇలా ఫ్యాక్టరీ యజమాని నెలకొల్పిన సంఖ్యను బట్టి మిల్లుల్లో దూది గింజలు ఏరోజుకు ఆ రోజు నూర్పిడి అవుతాయి.