నర్సారావుపేట: గుంటూరు జిల్లా నర్సారావుపేట శివార్లలోని విజయనాగసాయి ఆయిల్ మిల్లులో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మిల్లు పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు వ్యాపించాయి. సుమారు రూ.కోటి ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా.