వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఓ పామాయిల్ తయారీ మిల్లులో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
గోపవరం: వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఓ పామాయిల్ తయారీ మిల్లులో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడగా.. నిల్వ ఉన్న ఆయిల్ దగ్ధమైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆదివారం తెల్లవారుజామున కూడా ఈ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది.
కంపెనీలో వెలువడిన బూడిదను పక్కన పోయగా.. వాటిలోని నిప్పు రవ్వలు అక్కడున్న చెత్తకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, దీన్ని పూర్తిగా ఆర్పకపోవడం వల్ల సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మరోసారి అగ్ని ప్రమాదానికి దారి తీసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. రూ.50 లక్షలు ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం.