సాక్షి, వైఎస్‌ఆర్: బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లెలో ల్యాప్‌టాప్ పేలి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుమలత (22) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుమలత శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
ప్రమాదం ఇలా జరిగింది..
సుమలత సోమవారం ఉదయం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బెడ్‌పైన కూర్చొని వర్క్ చేస్తున్న సుమలత విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బెడ్‌కు సైతం మంటలు అంటుకున్నాయి.
గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అప్పడికే తీవ్రంగా గాయపడిన సుమలతను చికిత్స నిమిత్తం కడప సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 80 శాతం కాలిన గాయాలవ్వడంతో యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, సుమలత బెంగుళూరుకు చెందిన మ్యాజిక్ టెక్ సొల్యూషన్‌లో పనిచేస్తోంది.
ఇది చదవండి: కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం
Comments
Please login to add a commentAdd a comment