
నేనూ పల్నాటి బిడ్డనే..!
వృత్తి పరంగా డాక్టర్ని అయినా తానూ పల్నాటి బిడ్డనేనని, ఇక్కడి గాలి పీల్చుతున్న వాడినేనని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్రమ కేసులకు, పోలీసులకు బెదిరేది లేదన్నారు.
మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల తరపున పోరాటం చేస్తున్న తనను బలవంతంగా స్టేషన్‌కు తరలించడాన్ని తప్పు పట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాలకపక్షాన్ని హెచ్చరించారు.