Trafficking cases
-
మెక్సికోలో కాల్పులు .. ఇద్దరు చిన్నారులు సహా 8 మంది మృతి
మెక్సికోసిటి: మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. గ్వానాజుటావో రాష్ట్రం సిలావో గ్రామంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్ మీద వచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులలో ఎనిమిది మంది అమాయకులు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు.. ఆగంతకులను పట్టుకోని వారిపై దాడిచేశారు. దీంతో వారు కూడా మరణించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు దుండగులతో సహా, మరో 8 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈ దాడులు నిర్వహించిన వారు డ్రగ్స్ ముఠాకు చెందిన వారిగా భావిస్తున్నారు. శాంటా రోసాడి లిమా, జాలిస్కో న్యూజనరేషన్ల మధ్య పోరాటం కారణంగా గ్వానాజువాటో అత్యంత హింసాత్మక ప్రదేశంగా మారింది. 2006లో మెక్సికో మాదక ద్రవ్యాల అక్రమరవాణాపై నియంత్రణ విధించినప్పటి నుంచి ఈ దాడులు అధికమయ్యాయి. కొన్ని డ్రగ్స్ గ్యాంగ్‌లు ఆధీపత్యం కోసం పరస్పరం దాడులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత నవంబరులో జరిగిన దాడిలో 11 మంది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే. 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది అమాయకులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: మరో రైల్వే స్టేషన్ పేరు మార్చేసిన యోగి ప్రభుత్వం.. ఇక నుంచి -
అక్రమ ఇసుక, మద్యం రవాణాపై కఠిన చర్యలు
సాక్షి, కృష్ణా: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక, మద్యం రవాణా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ అన్నారు. ఆయన గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక, మద్యం రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. గుర్తించిన మార్గాలలో సీసీ కెమెరాలు, మొబైల్ చెక్ పోస్ట్, ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేశాని తెలిపారు. సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (ఆగస్ట్ నుంచి గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన) పాత నేరస్తులుగా ఉంటే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై రౌడీషీట్ కూడా తెరుస్తామని వినీత్ బ్రిజ్ లాల్ అన్నారు. గురువారం ఒక్క రోజే 41 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. 65 వాహనాలు స్వాధీనం చేసుకొన్నామని, 851 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రజలు సహకరిస్తే అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడం సులభతరం అవుతుందని అన్నారు. (జగనన్న చేదోడుపై సర్వత్రా హర్షం!) -
15 రోజుల్లో 1,648 వాహనాలు సీజ్
సాక్షి, అమరావతి: స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ) దాడుల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాలు భారీగా పట్టుబడుతున్నాయి. రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గత 15 రోజుల క్రితం ఎస్ఈబీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ 15 రోజుల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న 1,648 వాహనాలను ఎస్ఈబీ అధికారులు సీజ్ చేశారు. వీటిలో అధికంగా ఖరీదైన హై ఎండ్ మోడల్ కార్లు ఉండటం గమనార్హం. ప్రధానంగా ఖరీదైన కార్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం పట్టుబడుతోంది. పెద్ద ఎత్తున వాహనాలు పట్టుబడటంతో వీటిని ఉంచేందుకు ఎక్సైజ్ స్టేషన్లు సరిపోవడం లేదు. దీంతో ఎక్సైజ్ స్టేషన్లలో ఉన్న అంతకుముందు పట్టుబడిన పాత వాహనాలకు వేలం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ► నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) ఒక్క బాటిల్ ఉన్నా వాహనాన్ని సీజ్ చేస్తారు. అదే డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లు మూడుకు మించి ఉంటే కేసులు నమోదు చేస్తారు. ► సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్ పార్టీలను రంగంలోకి దించి మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నారు. ► పదే పదే పట్టుబడుతున్న వారిపై పీడీ కేసులు నమోదు చేయనున్నారు. -
అక్రమరవాణాను అరికట్టేందుకు సాంకేతిక టెక్నాలజీ వినియోగం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రం సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నాం. ప్రభుత్వ లక్ష్యాన్ని ఛేదించేందుకు సాంకేతిక టెక్నాలజీని వినియోగిస్తున్నాం. రాత్రివేళల్లో గస్తీని ముమ్మరం చేశాం. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపు దాడులు చేస్తున్నాం. సీసీ కెమెరాలు, మొబైల్ చెక్‌పోస్టులతో పాటు ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నాం. అధికారులు ఎంత పటిష్టంగా పనిచేసినా ప్రజల సహకారం కీలకం. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తేనే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో చేరుకోగలం. ఇప్పటి వరకు 485 కేసులు నమోదు చేశాం. 955 మంది పై కేసులు పెట్టాం. 730 వాహనాలు సీజ్ చేశాం. 29629.075 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకొన్నాం. ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పాత నేరస్థులైతే పీడీయాక్టు ప్రయోగిస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై రౌడీషీట్స్ తెరవాలని యోచిస్తున్నాం. ఆస్తులను కూడా జప్తు చేసేందుకు వెనకాడం. అక్రమార్కులను వెంటనే రిమాండ్‌కు తీసుకునేలా జ్యుడీషియల్ వ్యవస్థనూ సంప్రదిస్తున్నాం. ఇసుక, సిలికా, గ్రావెల్ నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం అని వినీత్ తెలిపారు. -
డ్రగ్స్ ఓవర్ డోస్
-
గౌరవంగా బతికేందుకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: అక్రమ రవాణాకు గురైన మహిళలను రక్షించి, సమాజంలో గౌరవంగా జీవించేందుకు వారికి మరో అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చేతన్ బి.సంఘి పేర్కొన్నారు. ఇందుకోసం మానవ అక్ర మ రవాణా వ్యతిరేక చట్టానికి ముసాయిదా బిల్లును రూపొందించామన్నారు. మానవ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు నిందితుల పట్ల ఈ చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా యూఎస్ కాన్సులేట్ జనరల్, ప్రజ్వల, కాథలిక్ రిలీఫ్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ప్రారంభమైన దక్షిణాసియా ప్రాంత సదస్సు లో చేతన్ బి.సంఘి మాట్లాడారు. ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ చొరవ ఫలితంగా మానవ అక్రమ రవాణా నిర్మూలనకు చట్టం రూపొందించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందన్నారు. పటిష్టమైన భాగస్వామ్యం లేకపోతే మానవ అక్రమ రవాణాలో ప్రభుత్వం, పోలీసులు, న్యాయ వ్యవస్థ, పౌర సమాజం, మీడియా, స్వచ్ఛం ద కార్యకర్తలెవరూ విజయవంతం కాలేరని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా స్పష్టం చేశారు. కోటి మందికి అవగాహన మానవ అక్రమ రవాణా, వ్యభిచారాన్ని జయించి బయటకు వచ్చిన విజేతల సారథ్యంలో 2016లో స్వరక్ష ప్రచారోద్యమాన్ని ప్రారంభించి, కోటి మందికి అవగాహన కల్పించామని సునీతా కృష్ణన్ తెలిపారు. 18,500 మంది బాధితులను కాపాడానని తెలిపారు. -
ఆ కేసులు కక్షపూరితం
బాధ్యులను వదలి.. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపైతప్పుడు కేసులా? ఇదెక్కడి న్యాయమని వైఎస్ఆర్సీపీ ధర్మాగ్రహం సర్కారు తీరుపై నిరసనలతో విరుచుకుపడిన పార్టీశ్రేణులు ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యాన్ని, సిబ్బందిని.. పోస్టుమార్టం లేకుండానే డ్రైవర్ మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించిన అధికారులను వదిలేశారు.. ఇదేమిటని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై మాత్రం కక్ష సాధిస్తున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. సర్కారు పాల్పడుతున్న ఈ కక్షపూరిత చర్యలపై గురువారం వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. నల్లబ్యాడ్జీలు ధరించి.. నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశాయి. విశాఖ నగరం, జిల్లావ్యాప్తంగా ధర్నాలు, మానవహారాలు, మౌన ప్రదర్శనలతో సర్కారుపై ధర్మాగ్రహం వ్యక్తం చేశాయి. తమ నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి సంఘీభావం ప్రకటించాయి. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులు బనాయించడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. పదకొండు మంది ప్రాణాలను బలిగొన్న దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా.. ఇదేమిటని ప్రశ్నించిన జననేతపై కక్ష పూరితంగా కేసులు నమోదు చేయడంపై మండిపడింది. ప్రతిపక్ష నాయకుడు పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు జీవీఎంసీ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో నిరసనలతో హోరెత్తి పోయింది. నియోజక వర్గ కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శనలు నిర్వహించారు. నాలుగు రోడ్ల జంక్షన్లో మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. బనాయించిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేసి వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్షమాపణలు చెప్పాలంటూ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డాబాగార్డెన్ జంక్షన్లో జరిగిన నిరసనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తి పోశారు. అదే విధంగా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన నిరసనల్లో కూడా పార్టీ కో ఆర్డినేటర్లు ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిప్పులు చెరిగారు. విశాఖ తూర్పులో.. విశాఖ తూర్పు కో ఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరిలోవలో నిరసన ప్రదర్శన చేశారు. నోటికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని పీఐసీ పాయింట్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ మానవహారం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొన్న విశాఖ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై జగన్‌ను అడ్డుకున్నారని..నేడు ఇదేమిటని ప్రశ్నించినందుకు జగన్‌పై తప్పు డు కేసులు పెట్టారని వంశీకృష్ణ ఆరోపించా రు. ఎస్సీసెల్ నగర కన్వీనర్ బోని శివరామకృష్ణ, నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్తి మం దారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి ఎ.రాజబాబు, నగర కార్యదర్శులు ఇ మ్మంది సత్యనారాయణ, పీఐ బాలరాజు, వైదా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమలో.. విశాఖ పశ్చిమ పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో మల్కాపురం ప్రకాష్ నగర్లో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. గడిచిన మూడేళ్లుగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పట్ల చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..అందువలనే జగన్‌పై కేసులు బనాయిస్తూ చంద్రబాబు వికృతంగా ప్రవర్తిస్తున్నారని మళ్ల విజయప్రసాద్ ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ బద్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తరంలో... విశాఖ ఉత్తర కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తొలుత బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. అనంతరం వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. తక్షణమే కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, సంస్కృత విభాగం నగర కన్వీనర్ రాధ, గిడ్డంకుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణా రెడ్డి, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్ అలి, యువజన విభాగం కార్యదర్శి రెయ్యి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణంలో.. విశాఖ దక్షిణ కో ఆర్డినేటర్ కోలా గురువులు ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ ఎల్ఐసీ భవనం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన 11మందికి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నా«థ్ మాట్లాడుతూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి వెళ్లిన శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రభుత్వం అక్రమకేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మాసిపోగు రాజు, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో... గాజువాక కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వందడుగుల రోడ్డులో మౌనప్రదర్శన చేశారు. వందడుగుల రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నాచేశారు. కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్‌తో కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించిన చంద్రబాబు నేడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని మరోసారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అదే విధంగా స్టీల్‌ప్లాంట్‌లో పొట్టి శ్రీరాములు కూడలి వద్ద వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తానప్ప ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పార్టీ కో ఆర్డినే టర్ తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. పెందుర్తిలో.. పెందుర్తి కో ఆర్డినేటర్ అన్నంరెడ్డి అదీప్‌రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టా్టరు. పెందుర్తి బీఆర్టీఎస్ రహదారి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దారు పాండురంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అదీప్‌రాజు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్ నడుపుతూ పదిమంది ప్రాణాలు తీసిన ట్రావెల్స్ యాజమాన్యాన్ని వదిలిపెట్టి బాధితులకు అండగా నిలబడిన జగన్మోహన్రెడ్డిపై కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు సర్కారు దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి గొర్లె రాము నాయుడు, మండల అధ్యక్షులు నక్కా కనకరాజు, తుంపాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భీమిలిలో.. భీమిలి, ఆనందపురం మండలాల్లో పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. భీమిలి పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇక్కడ జిల్లా అధికార ప్రతినిధి ఎస్.కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులపై కేసులను ఎత్తేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితులపై అక్రమ కే సు ల్ని ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నిర్వాసితులపై కాల్పులు, లాఠీచార్జీపై ప్ర భుత్వం క్షమాపణ చెప్పాల్సిందిపోయి వారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపా రు. పోలీసులు అరెస్టు చేసిన మెదక్ జిల్లా సీపీఎం కార్యదర్శి మల్లేశ్, మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కమిటీ కన్వీనర్ భాస్కర్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎక్కువ మంది రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరని, భూఉద్యమ నాయకులను జైలుకు పంపి నిర్వాసితులను బలవంతంగా ఒప్పించడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. -
వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
కడప: రాష్ట్రంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగితే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ అవినాష్ రెడ్డి, రఘురామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ కడపలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులను, ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి ఓడిపోయిన వారితో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. అవినీతిపై పోరాడుతున్నందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్చ్.. అమలుకు నోచుకోని హామీలు
రాజధాని చుట్టే చక్కర్లు అయినా ఒక్క అడుగూ ముందుకు పడని వైనం ప్రజా సమస్యలు గాలికి రుణమాఫీ పుణ్యంతో కొత్త రుణాలకు కోత నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు కాసుల వేటలో అధికార పార్టీ నేతలు అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు.. దాడులు అమరావతి : ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి నేటికి సరిగ్గా రెండేళ్లయింది. ఈ రెండేళ్లూ చంద్రబాబు పాలన మొత్తం రాజధాని చుట్టూనే తిరుగుతోంది. అదీ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల ప్రారంభం తప్ప ఒక్క అడుగూ ముందుకు పడకపోవటం గమనార్హం. ఇకపోతే ప్రజలకు ఏమైనా చేశారా అంటే.. శూన్యమనే చెప్పాలి. అధికార యంత్రాంగం మొత్తం రాజధాని నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నామంటూ రెండేళ్లు పూర్తిచేశారు. సీఎం, మంత్రులు, చైనా, జపాన్, సింగపూర్ బృందాల సేవలకే వారు పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తంగా కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలకు చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదు. తొలిరోజు నుంచీ షాకులే... సరిగ్గా రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆరోజు కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తారని ఆశతో ఓట్లేసి గెలిపించారు. అదేరోజు వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆరోజు దశలవారీగా.. లక్షలోపు రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆ రోజు మొదలైన చంద్రబాబు షాక్‌లు నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బలవంతపు భూసేకరణ రాజధాని పేరు చెప్పి గుంటూరు జిల్లా పరిధిలోని 29 గ్రామాల పరిధిలోని రైతుల నుంచి భూముల సేకరణకు నిర్ణయించారు. రైతులు అడ్డం తిరగటంతో ల్యాండ్‌పూలింగ్ పేరుతో బలవంతంగా భూములను లాక్కున్నారు. భూములు తీసుకునే సమయంలో పాలకులు రకరకాల హామీలు ఇచ్చారు. నేటికీ ఒక్క హామీ కూడా అమలు కాకపోవటం గమనార్హం. ఇదే ల్యాండ్‌పూలింగ్ పేరుతో బందరు పోర్టు, గన్నవరం విమానాశ్రయం, ఏలూరు కాలువ మళ్లింపునకు భూ సేకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నించింది. అక్కడి రైతులు ఎదురుతిరగటంతో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురిచేసింది. రుణాలు మాఫీ కావు... కొత్త రుణాలు ఇవ్వరు రైతు, డ్వాక్రా రుణాలు ఇప్పటి వరకు మాఫీ కాకపోవటం గమనార్హం. మొదటి విడతగా విడుదల చేసిన నిధులు వారు తీసుకున్న వడ్డీకే చాల్లేదు. రెండో విడత నిధులు ఇంతవరకు విడుదల కాలేదు. డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు మాఫీ చేస్తానని చెప్పి ఏడాదికి రూ.3 వేల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. దీంతో అటు రైతులు.. ఇటు డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వటానికి ముందుకు రాలేదు. రుణాలు కావాలంటే తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలని పట్టుబడుతున్నారు. బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవటంతో అనేక మంది బంగారు ఆభరణాలను బ్యాంకర్లు వేలం వేశారు. తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక, మట్టిని అమ్ముకున్న తమ్ముళ్లు కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాతో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. డ్వాక్రా మహిళల ముసుగులో తెలుగు తమ్ముళ్లు తెగబడ్డారు. అడ్డుకున్న స్థానికులు, అధికారులపై దాడులకు తెగబడ్డారు. కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పలుచోట్ల స్థానికులపై దాడులు చేశారు. నిలదీసిన వారిపై తప్పుడు కేసులు బనాయించారు. నీరు-చెట్టు పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతలు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు. గతంలో ఉపాధి హామీ కింద చేపట్టిన పనులను చూపించి బిల్లులు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. చెరువుల్లోని మట్టిని సైతం అమ్మి సొమ్ము చేసుకోవటం గమనార్హం. ప్రొటోకాల్ బిజీలో అధికార యంత్రాంగం అమరావతిని రాజధానిగా ప్రకటించటం, నిర్మాణానికి వివిధ దేశాల ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పాలన అంతా విజయవాడ కేంద్రంగా చేసుకోవటంతో సీఎం, మంత్రులు, చైనా, జపాన్, సింగపూర్ నుంచి ప్రతినిధులు పలుమార్లు విజయవాడకు వచ్చారు. సీఎం, మంత్రులు విజయవాడ కేంద్రంగా ఉండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు వారికి వసతి సౌకర్యాలతో పాటు, సమావేశాలకు ఏర్పాట్లు చేయటంలోనే రెండేళ్లు గడిచిపోయింది. దీంతో ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. పెరిగిన ఇంటి అద్దెలు.. నిత్యావసర వస్తువుల ధరలు అమరావతిని రాజధానిగా ప్రకటించటంతో విజయవాడ, గుంటూరు పరిధిలో నివాసాల అద్దెలు అమాంతం పెంచేశారు. రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల పరిధిలో 34 వేల ఎకరాలకు పైగా భూములు తీసుకోవటంతో ఆ ప్రాంతం అంతా ముళ్లచెట్లను తలపిస్తోంది. కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెంచేశారు. దీంతో సామాన్యుడి జీవనం భారంగా మారింది. -
కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తే సహించం
సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ రూరల్: కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తూ మరోపక్క దాడులకు పాల్పడుతున్నారని.. ఇలా వేధిస్తే సహించబోమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. చాలా కేసుల విషయంలో నల్లగొండ రూరల్ పోలీసులు, సీఐ పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఇసుక అక్రమ దం దాలో మునిగి తేలుతున్నారని డీఎస్పీ సుధాకర్‌కు శనివారం ఆయన వివరించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నల్లగొండ మండలంలోని అప్పాజీపేట గ్రామ సర్పంచ్ భర్త గంగుల సైదులును టీఆర్ఎస్ కార్యకర్త చంపుతామని బెదిరించినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, అనంతారంలో కాంగ్రెస్ కార్యకర్తపై గొడ్డలితో దాడి చేసినా చట్టపరంగా వ్యవహరించలేదని ఆరోపించారు. కేసుల విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించకపోతే లక్ష మందితో హైవేపై ధర్నా చేయడంతోపాటు సీఎంను అసెంబ్లీలో నీలదీస్తామమన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే దాడులు, దౌర్జన్యాలు అధికమవుతున్నాయన్నారు. సీఎం యాగాలు, యజ్ఞాలు చేస్తూ కిందిస్థాయిలో జరుగుతున్న దౌర్జన్యాలను పట్టించుకోకపోతే పుణ్యం కలుగకపోగా పాపం తలుగుతుందన్నారు. -
న్యాయంగా పోరాడితే కేసులా?
బొబ్బిలి: చెరుకు బిల్లుల చెల్లింపుల్లో చట్టాలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టకుండా బకాయిల కోసం పోరాడిన వారిపై అక్రమ కేసులు పెట్టడం న్యాయమా అని ఏపీ చెరుకు రైతు సంఘ జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు ప్రశ్నించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెరుకు సరఫరా చేసిన 15 రోజుల్లో చెల్లింపులు చేయాలని చట్టం చెబుతున్నా ఖాతరు చేయని యాజమాన్యంపై ఎన్ని స్టేషన్లలో కేసులు నమోదు చేశారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనల సమయంలో రైతులది న్యాయమైన డిమాండ్ అని చెబుతున్న పోలీసు అధికారులు ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి సమన్లను పంపించడం భావ్యం కాదన్నారు. యాజమాన్యంపై ఆర్ఆర్ యాక్టు కింద కేసులు పెడతామని చెప్పి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కేసులు పెట్టిభయపెడితే ఉద్యమాలు ఆగవని స్పష్టం చేశారు. తక్షణమే రైతులపై కేసులను వెనక్కి తీసుకుని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం పార్వతీరం, బొబ్బిలి డివిజన్ కార్యదర్శులు రెడ్డి శ్రీరాంమూర్తి, రె డ్డి వేణు పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయపడం: చెవిరెడ్డి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని వైఎస్సార్ సీపీ నాయకుడు, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. సీఎం సొంత జిల్లాలో వైఎస్సార్ సీపీ బలీయంగా ఉండటం, సొంత నియోజకవర్గం చంద్రగిరిలో తాము విజయం సాధించడం జీర్ణించుకోలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి నీచపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రాజమహేంద్రవరంలో పోలీసులు పెట్టిన బెదిరింపు కేసులో పీటీ వారంట్ పెండింగ్‌లో ఉంది. దీంతో శుక్రవారం నెల్లూరు వెళ్లిన పోలీసులు శనివారం ఉదయం చెవిరెడ్డిని నెల్లూరుజైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. మూడో జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులతో మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరుచేశారు. తర్వాత మళ్లీ చెవిరెడ్డిని నెల్లూరు తీసుకెళ్లేందుకు పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అసహనం పెరిగిపోయిన ప్రభుత్వం ఇంకెన్ని అక్రమ కేసులు బనాయించినా ఎదుర్కొంటామే తప్ప మడమ తిప్పేది లేదన్నారు. కాగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చెవిరెడ్డి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు గురవుతోంది. -
వైఎస్సార్ సీపీ ద్వితీయ శ్రేణి నేతలపై టీడీపీ కన్ను
► కొమ్మలపై కన్ను! ► వైఎస్సార్ సీపీ ద్వితీయ శ్రేణి నేతలపై టీడీపీ కన్ను ► ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు కుట్రలు..కుతంత్రాలు ► వ్యాపారాలకు అడుగడుగునా ఆటంకాలు..అడ్డగింతలు ► పార్టీకి దూరం చేసేందుకు ‘శక్తిమేర’ విఫలయత్నాలు మహావృక్షంగా ఎదిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలకు అంతమే లేదు. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతలపై సైతం అక్రమ కేసులు బనాయించేందుకు వెనుకాడడం లేదు. చివరకు మహావృక్షానికి చిరు కొమ్మల్లాంటి ద్వితీయ శ్రేణి నాయకులను దెబ్బతీసే దుశ్చర్యకు తెరతీశారు. ఈ సారి వారి ఆర్థిక మూలాలపై ఎక్కుపెట్టారు. అధికారులను అడ్డుపెట్టుకుని అడుగడుగునా వెంటాడుతూ వేధింపులకు దిగుతున్నారు. గుంటూరు : వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులపై టీడీపీ నేతలు కన్నేశారు. అధికారుల సాయంతో వేధింపులకు దిగుతున్నారు. వారి వ్యాపారాలకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు. పోలీస్స్టేషన్లలో పాత కేసులు ఉంటే తిరగదోడుతున్నారు. ఆ వివరాలను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపడం తోపాటు వైఎస్సార్ సీపీ ద్వితీయశ్రేణి నాయకులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఆర్థిక మూలాలకు నష్టం కలిగిస్తే వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేయలేరనే ఉద్దేశంతో వారి వ్యాపారాలపై దాడులు చేయిస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంఘటనకు ముందు నుంచే ఈ ప్రక్రియను చాపకింద నీరులా కొనసాగిస్తున్నారు. కొత్త కార్యకర్తలను పార్టీలో చేరకుండా చేస్తున్నారు. పాతవారిపై నిరంతరం వేధింపులకు పాల్పడుతున్నారు. ఇవిగో ఉదంతాలు.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణకు మద్దతుగా పనిచేసిన బడుగు నాగరాజు చౌకధరల దుకాణాన్ని రద్దు చేయించి టీడీపీ కార్యకర్తకు కేటాయించారు. చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామానికి చెందిన నాగరాజు ఆ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపునకు గట్టిగా కృషి చేశారు. ఫలితాల తరువాత నాగరాజు దుకాణంపై వివిధ వర్గాల ప్రజలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయించారు. విచారణలో దుకాణం నిర్వహణలో లోపాలున్నాయనే కారణం చూపి రద్దు చేయించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. గుంటూరు రూరల్ పరిధిలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మండెపూడి పురుషోత్తంకు సమీప బంధువు గుడిపూడి అరుణ పేరున ఉన్న చౌకధరల దుకాణంపై కూడా పార్టీ నేతలు అధికారులను అడ్డు పెట్టుకుని వేధింపులకు దిగుతున్నారు. దుకాణాల ఎంపిక సమయంలో నిర్వహించిన రాత పరీక్షలో అరుణకు మంచి మార్కులు వచ్చినా రాత పరీక్షలో ఫెయిల్ అయినట్టుగా చూపారు. సమాచార హక్కు చట్టం ద్వారా అరుణ రాసిన పరీక్ష పత్రంలో సమాధానాలు సక్రమంగా ఉన్నట్టు ఉన్నతాధికారులు గుర్తించి గోరంట్లకు సమీపంలోని నగరాల్లో 247 దుకాణాన్ని కేటాయించారు. ఆ దుకాణం ప్రారంభించిన పదిరోజుల్లోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి రికార్డులు పరిశీలించారు. అన్నీ సక్రమంగా ఉండడంతో వెనుతిరిగారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ పట్టణంలో వైఎస్సార్ సీపీలో చురుగ్గా పనిచేస్తున్న కౌన్సిలర్లపై ఇదే వివక్ష కొనసాగుతోంది. పిడుగురాళ్ళ మండల అధ్యక్షులు చల్లా పిచ్చిరెడ్డిపై కాల్‌మనీ కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆ కేసుతో పిచ్చిరెడ్డికి సంబంధం లేకపోయినప్పటికీ జైలుకు పంపించారు. 15వ వార్డు కౌన్సిలర్ మందా డానియేలు ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో గళం విప్పుతున్నాడనే ఉద్దేశంతో కేసులు మోపి జైలుకు పంపించారు. మూడు కౌన్సిల్ సమావేశాలకు వరుసగా హాజరుకాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే నిబంధనను అన్వయించేందుకు, మూడో కౌన్సిల్ సమావేశానికి వస్తున్న డానియేలును పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మహిళలు, ప్రజా సంఘాల నాయకులు అడ్డుపడి సమావేశానికి తీసుకువచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి రేబాల శ్రీనివాసరావుపై కాల్‌మనీ కేసు బనాయించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసి, వివాదం తీవ్రమౌతుందనే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దాచేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఇలా పార్టీ తరఫున ఉత్సాహంగా పనిచేస్తున్న వారిపై కేసులు పెట్టేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసులను ‘శక్తిమేర’ వాడుకుంటున్నారు. ఆపై పోలీసులూ ఓవర్‌యాక్షన్ చేస్తున్నారు. -
నేనూ పల్నాటి బిడ్డనే..!
వృత్తి పరంగా డాక్టర్ని అయినా తానూ పల్నాటి బిడ్డనేనని, ఇక్కడి గాలి పీల్చుతున్న వాడినేనని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్రమ కేసులకు, పోలీసులకు బెదిరేది లేదన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల తరపున పోరాటం చేస్తున్న తనను బలవంతంగా స్టేషన్‌కు తరలించడాన్ని తప్పు పట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాలకపక్షాన్ని హెచ్చరించారు. -
నరసరావుపేటలో ఉద్రిక్తత
అక్రమ కేసును నిరసిస్తూ ధర్నాకు దిగిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు ఆందోళనకు దిగిన కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు దందాలకు దిగుతూ దౌర్జన్యాలకు పాల్పడడం. అడ్డువచ్చినవారిపై అక్రమ కేసులు పెట్టించడం. ప్రజాధనాన్ని దోచుకు తినడం. ప్రజల తరఫున పోరాడే ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగడం. అధికారులను అడ్డుపెట్టుకుని కుట్ర పన్నడం. ఇలాంటి అరాచకాలన్నీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలకు పరిపాటిగా మారాయి. చివరకు పేద రైతులకు అండగా నిలిచిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అక్రమ కేసు బనాయింపజేయడం వారి అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నిలిచింది. - సాక్షి, గుంటూరు నరసరావుపేట రూరల్ : తనపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమం పోలీసుల ఓవరాక్షన్ కారణంగా ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నాకు ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో ఈ నెల 15వ తేదీన నమోదైన కేసు విషయంపై ఎమ్మెల్యేని అరెస్టు చేశారు. అడ్డుకోబోయిన కార్యకర్తలు లాఠీలు ఝుళిపించారు. రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో రోడ్డు నిర్మాణంపై విషయంలో ఎమ్మెల్యేపై తహశీల్దార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎమ్మెల్యే గోపిరెడ్డిపై తప్పుడు కేసును కొట్టేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీసీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యేను జీపులో స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ఎదుట కార్యకర్తల ఆందోళన.. ఎమ్మెల్యే గోపిరెడ్డిని స్టేషన్లో ఉంచి గేట్లు మూసి వేయడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఒకానొక దశలో పోలీసులు కార్యకర్తలపై లాఠీచార్జికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. లోపల ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఆందోళన చెందిన కార్యకర్తలు గేటు తోసుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళా కార్యకర్తలను సైతం నె ట్టి వేయడంతో వారు గాయపడ్డారు. ఎమ్మెల్యేను విడుదల చేసే వరకు కదిలేది లేదంటూ గేటు వద్ద బైటాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు మధ్యాహ్నం 2.30 గంటలకు విడిచిపెట్టారు. ఆ సమయంలో కార్యకర్తలు ఎమ్మెల్యేను భుజాలపైకి ఎత్తుకుని నినాదాలు చేశారు. అక్కడ నుంచి ఇంటికి ప్రదర్శనగా వెళ్తున్న వారిని పోలీసులు తిరిగి అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ప్రదర్శన చేపట్టకూడదంటూ కార్యకర్తలను చెదరగొట్టారు. నాయకులు జోక్యం చేసుకుని పోలీసులతో మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే ఇంటి వద్దకు ప్రదర్శన చేరుకోగానే మరోమారు పోలీసులు కార్యకర్తలతో వాగ్వాదానికి దిగి లాఠీచార్జి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలను చంపుతారా అంటూ డీఎస్పీ నాగేశ్వరరావును అంబటి గట్టిగా ప్రశ్నించారు. పోలీసుల చర్యతో కార్యకర్తలు తిరగబడ్డారు. నాయకులు సర్దిచెప్పడంతో శాంతించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రజల పక్షాన పోరాడితే అక్రమ కేసులా ! గుంటూరు : ప్రజా సమస్యలపై పోరాడుతున్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అక్రమ కేసు బనాయించి సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు మద్దతుగా వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దుర్భాషలాడారు. ఇదీ నేపథ్యం... నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామంలో అనేక ఏళ్ల కిందట నిరుపేద రైతులకు 2.44 ఎకరాల అసైన్డ్ భూమికి సెటిల్మెంట్ పట్టాలు ఇచ్చారు. ఈ నిరుపేదలు వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉంటున్నారనే కక్షతో టీడీపీ ప్రభుత్వం ఆ భూముల మీదుగా ఉపాధి హామీ పథకం కింద సిమెంటు రోడ్డు నిర్మాణానికి గత సోమవారం శ్రీకారం చుట్టింది. దీనిపై ముందుగా నోటీసులు ఇచ్చి భూములు ఉన్న రైతులకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. తమకు గతంలోనే పట్టాలు ఇచ్చారని చెబుతున్నా పోలీస్ బందోబస్తు నడుమ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పేద రైతులంతా అదే రోజు తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్కడకు చేరుకుని బాధితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ఘటనపై రొంపిచర్ల తహశీల్దారు గత గురువారం నరసరావుపేట రూరల్ సీఐకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యేపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారు. టెండర్ ఫారాలు లాక్కుంటే కేసులేవీ ?.. నరసరావుపేటలోని ఎన్ఎస్పీ కార్యాలయం వద్ద ఇటీవల టెండర్లు వేసేందుకు వచ్చిన వారి వద్ద నుంచి దౌర్జన్యంగా ఫారాలు లాక్కుని చించి వేసిన ఘటనపై మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి చలమారెడ్డి కుమారుడిపై కేసు నమోదు అయినప్పటికీ ఇంత వరకు అతడిని అరెస్టు చేసిన దాఖలాలు లేవు. అధికాార పార్టీ నేతలు ఏం చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినపడుతున్నాయి. ప్రజల తరఫున పోరాడుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అక్రమ కేసు బనాయించడాన్ని అంతా తప్పుపడుతున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్ని కేసులు బనాయించినా వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని, ప్రజాదరణ చూసి ఓర్వలేకే అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్టుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
ఖాకీ దూకుడు!
వైఎస్సార్ సీపీ నాయకులే లక్ష్యంగా దాష్టీకం అధికార పార్టీ ప్రతినిధుల్లా పోలీస్ అధికారులు ముఖ్య నేతల ఆదేశాలే శిరోధార్యంగా వృత్తికి ద్రోహం చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, పొన్నూరులలో అరాచకాలు.. వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి చిత్రహింసలు ఇప్పటికే రూరల్ ఎస్పీ నారాయణనాయక్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు గుంటూరు : సాక్షాత్తూ పోలీస్ అధికారులే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం చెవికెక్కించుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు చెప్పిందే చేస్తున్నారు. అది అక్రమమా సక్రమమా అనేది పరిశీలించడం లేదు. అధికార పార్టీ నేతల అక్రమ వ్యాపారానికి ప్రమోటర్లుగా వ్యవహరిస్తూ, అడ్డు వచ్చే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఫలానా నేత చెప్పినట్లు వింటే సరే లేదంటే అంటూ... సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులే బెదిరిస్తున్నారు. రూరల్ జిల్లా పరిధిలోని కొందరు సీఐ, ఎస్సై స్థాయి అధికారులు టీడీపీ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు. పొన్నూ రు, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరి పేట నియోజకవర్గాల్లో పోలీసు అధికారుల తీరు అరాచకాన్ని తలపించే రీతిలో ఉందని ప్రజల నుంచే విమర్శలు వస్తున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏళ్లతరబడి వ్యాపారాలు చేసుకుంటున్న వారి వద్ద నుంచి అధికార పార్టీ ముఖ్యనేత దౌర్జన్యంగా ఆ వ్యాపారాలను లాక్కొని తమ బినామీలకు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో తమకు అన్యాయం జరిగిందంటూ వచ్చిన వ్యాపారులను పోలీసులు బెదిరించడమే కాకుండా, వారిపైనే అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేశారు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారనే అక్కసుతో అధికార పార్టీ నేత పోలీసులను ఉసిగొల్పుతున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి పోలీసులు సహకరిస్తూ తమ స్వామి భక్తిని చాటుతున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అక్కడి అధికారపార్టీ ముఖ్యనేత తనయుడు చేస్తున్న దౌర్జన్యాలు, దాష్టికాలకు పోలీసు అధికారులు సహకరిస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేత కనుసన్నల్లో నడుస్తున్న పోలీస్ అధికారులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ముఖ్యనేత చెప్పిన అడ్డమైన పనులు చేయలేక కొందరు పోలీసు అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాత్రం అధికారపార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు. ఆ ముఖ్యనేత వ్యాపారానికి సహకరించని వారిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సుమారు 200 మంది పోలీసులతో వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గురువారం రూరల్ జిల్లా ఎస్పీ నారాయణనాయక్‌ను కలసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రజలను హింసిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులపై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
అధికారపార్టీకి చెంపపెట్టు
రాజకీయ దురుద్దేశంతో కేసులు తగదని హైకోర్టు వ్యాఖ్య అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులను సమంగా చూడాలని సూచన ధర్మాసనం స్పందనపై జిల్లా వ్యాప్తంగా చర్చ రాజకీయ ప్రత్యర్థులను వేధించే అధికార పార్టీ నాయకులకు పోలీసులు కొమ్ముకాయొద్దని హైకోర్టు సూచించింది. రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులకు అండగా నిలిచిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసులు పెట్టిన అధికారులు, అదే క్రమంలో వారి ఫిర్యాదును పట్టించుకోకపోవడం తగదని హితబోధ చేసింది. కోర్టు స్పందన నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులపై పెడుతున్న అక్రమ కేసులు మరోమారు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. తిరుపతిః అధికారులను పావులుగా ఉపయోగించి ప్రతిపక్షంపై అక్రమకేసులు బనాయిస్తు న్న అధికారపార్టీ నాయకులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. పోలీసులు, అధికారులు ఒక వర్గం ఫిర్యాదుతో కేసు నమో దు చేసి.. మరొకరి విన్నపాన్ని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దురుద్దేశంతో వేసే కేసులు, ఫిర్యాదులపై అధికారులు, పోలీసులు విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలని హితబోధ చేసింది. రేణిగుంట విమానాశ్రయంలో ఈనెల 26వ తేదీన ఎయిర్ ఇండియా విమానంలో న్యూఢిల్లీకి వెళ్లాల్సిన 19 మంది ప్రయాణికుల విషయంలో ఆ సంస్థ మేనేజరు రాజశేఖర్ దురుసుగా వ్యవహరించారని బాధితులు ఎంపీ మిథున్‌రెడ్డి వద్ద వాపోయారు. దీంతో ఆయన ప్రయాణికులకు అండగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి ప్రయాణించే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక పోలీసులు మాత్రం ఎంపీ, ఎమ్మెల్యేపై అధికారపార్టీ నాయకుల ప్రోద్భలంతో కేసులు నమోదు చేయడంతో హైకోర్టు ఈ వాఖ్యలు చేసింది. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తే.. ఇక బాధితులకు పోలీసులు ఏం న్యాయం చేసినట్లని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ తర్వాత సెక్షన్ 41(ఏ)కింద వారికి నోటీసులు ఇచ్చి వాటిపై బాధితుల వివరణ పూర్తిగా తెలుసుకున్నాకే కేసులో ముందుకు సాగాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం జిల్లా నాయకులు వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులపై పెట్టిన అక్రమ కేసులు మరోమారు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ‘మచ్చ’తునకలు మార్చి నెలలో పూతలపట్టులో ట్రాన్స్‌కో షిప్టు ఆపరేటర్ పోస్టు స్థానికుడికి ఇవ్వలేదని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌పై అధికారపార్టీ నాయకులు తప్పుడు కేసులు బనాయించారు. దీనికి ప్రధాన కారణం రోస్టర్ పాయింట్ ప్రకారం తన నియోజకవర్గంలోని నిరుద్యోగులకు అవకాశం ఇవ్వకుండా ఇతర జిల్లాల వారికి ఎందుకు స్థానం కల్పించారని ఎమ్మెల్యే ప్రశ్నించడమే. దీనిపై ఇప్పటికీ ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. పూతలపట్టు, ఐరాల మండలాల్లోని స్థానికులు ఈ అంశంపై ఆయన ఆమరణదీక్షకు దిగిన ఎమ్మెల్యేకు తమ మద్దతు ప్రకటించారు. ఆగస్టులో పుత్తూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో దళిత సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే రోజా ధర్నా చేస్తుండగా.. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకులు అడ్డుకుని ధర్నాను భగ్నం చేశారు. పైగా దళితులను కులంపేరుతో కించపరిచినట్లు ఆరోపిస్తూ.. అక్రమ కేసులు బనాయించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఇరువర్గాలు చర్చించి కేసులు ఎత్తివేశారు. అడుగడుగునా ఆగడాలు.. ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ అధికారపార్టీ నాయకులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఒక్కచోట కూడా ప్రోటోకాల్ నిబంధనలను పాటించడం లేదు. రేషన్‌కార్డు మంజూరు నుంచి కాంట్రాక్టుల వరకు అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట్ల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఇక నీరు- చెట్టు పథకంలో తెలుగుదేశం నాయకులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో చెరువు మట్టిని వ్యవసాయ పొలాలకు తరలించాల్సి ఉండగా.. పారిశ్రామిక వేత్తలు, రియల్ఎస్టేట్ వ్యాపారుల లేఔట్లకు తరలించడంపై చాలా మండలాల్లో రైతులు తిరగబడ్డారు. ఇక జన్మభూమి కమిటీ సభ్యుల పేరిట అధికారపార్టీ నాయకులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తప్పా.. నిజమైన అర్హులకు పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇకనైనా అధికార పార్టీ నాయకులు విచక్షణతో ప్రవర్తించాలని పలువురు సూచిస్తున్నారు. -
రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులా!
-
రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులా!
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మచిలీపట్నం : టీడీపీ ప్రభుత్వం రైతుల భూములను లాక్కుని విదేశీ సంస్థలకు అప్పగిస్తుంటే అడ్డుకుంటున్న పేర్ని నానిపై అక్రమ కేసులు బనాయించారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కోర్టులో పేర్ని నానిని పలకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట 30 వేల ఎకరాల భూమిని తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని, భూపరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌గా ఉన్న పేర్ని నానిని అరెస్టుచేస్తే ఉద్యమాన్ని నీరుగార్చవచ్చనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు కుట్ర పన్నారన్నారు. ఆ పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులపాలు చేస్తున్నారనడానికి గుడివాడ, మచిలీపట్నం సంఘటనలే ఉదాహరణలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది లేదన్నారు. పేర్ని నాని విడుదలైన అనంతరం అనుబంధ పరిశ్రమల పేరుతో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేస్తామన్నారు. భూములు కోల్పోయే రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందన్నారు. పేర్ని నాని అరెస్టుతో ప్రభుత్వ వైఖరితో పాటు మంత్రి కొల్లు వైఖరి కూడా వెల్లడైందన్నారు. టీడీపీ నేతలు మితిమీరి వ్యవహరిస్తే దానికి తగ్గట్టు తామూ స్పందిస్తామని నాని స్పష్టం చేశారు. -
కక్ష గట్టి
భూ ఉద్యమం అణచివేతకు {పభుత్వ పన్నాగం వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు సంఘటితమవుతున్న అన్నదాతలు మచిలీపట్నం : టీడీపీ సర్కార్ భూదందాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇవి కచ్చితంగా కక్ష సాధింపు చర్యలేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం భూ బ్యాంకు పేరుతో వేలాది ఎకరాలను సేకరించి ఆ భూములను విదేశీ సంస్థలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా గత ఆగస్టు 30న పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరిట బందరు మండలంలో 14,427 ఎకరాల ప్రైవేటు భూమి, మరో 15వేల ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది 24 గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. భూమిని ప్రభుత్వం లాక్కుంటే తమ జీవనం ఎలా గడుస్తుందనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తరుణంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) వామపక్ష నాయకులతో కలిసి రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ భూపరిరక్షణ పోరాట సమితులను ఏర్పాటుచేశారు. రైతులకు ముఖం చూపలేకే.. పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించే పనిని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు తమ భుజాలకు ఎత్తుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన అనంతరం భూమి కోల్పోయే గ్రామాల్లో రైతులతో సమావేశమయ్యారు. కోన, బుద్దాలపాలెం, మేకావానిపాలెం, చిన్నాపురం తదితర గ్రామాల్లో వీరికి చుక్కెదురైంది. ఒక్క సెంటు భూమి కూడా అనుబంధ పరిశ్రమల కోసం ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి భూసమీకరణ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని, తుళ్లూరు తరహా ప్యాకేజీని అందజేస్తామని మంత్రి, ఎంపీ చెప్పినా రైతులు అంగీకరించలేదు. ఇటీవల రెవెన్యూ అధికారులు గ్రామాల్లో నిర్వహించిన ‘మీ ఇంటికి-మీ భూమి’ సదస్సుల్లోనూ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పొట్లపాలెంలో కుర్చీలు తగులబెట్టి రైతులు తమ నిరసస తెలియజేయగా.. పోతేపల్లిలో పోలీసుల దెబ్బలను సైతం లెక్క చేయకుండా రైతులు అధికారుల వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. పరిస్థితి చేయిదాటడంతో టీడీపీ నాయకులు వ్యూహం మార్చారు. అక్రమ కేసులు బనాయించి పోతేపల్లి, పొట్లపాలెం, బుద్దాలపాలెం గ్రామాల్లో ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకుల వ్యూహం రైతుల ముందు పనిచేయకపోవడంతో వారు తమ పన్నాగాన్ని మార్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ నాయకులను దెబ్బతీసేందుకు అక్రమ కేసులు బనాయించే అంశంపై టీడీపీ నాయకులు దృష్టిసారించారు. అనుకున్నదే తడవుగా బందరులోని వైఎస్సార్ సీపీ నాయకులకు చెందిన బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులకు తెగబడ్డారు. దీనిపై ఎక్సైజ్ సీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన పార్టీ నాయకులపై ఎక్సైజ్ ఎస్.ఐ. శ్రీనివాస్‌తో చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. మంత్రి కొల్లు రవీంద్ర నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని తెరవెనుక ఒత్తిడి తెచ్చారనే వాదనలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. పది, పదిహేను రోజుల పాటు వీరిని జైలులో ఉంచితే భూ ఉద్యమం నీరుగారుతుందన్న వ్యూహంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి అరెస్టుకు పాల్పడడం చర్చనీయాంశమైంది. టీడీపీ నేతల కుట్రను ఎదుర్కొనేందుకు టౌన్‌హాలులో వైఎస్సార్ సీపీ నాయకులు సమావేశం ఏర్పాటుచేయగా గేట్లు మూసివేసి ఎవరినీ బయటకు రానీయకుండా పోలీసులు నిర్బంధించడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత పేర్ని నాని ఇంటికి వెళ్లి అరెస్టుచేయడంతో పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. ముందస్తు వ్యూహంలో భాగంగా నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెట్టడంతో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా న్యాయమూర్తి తిరస్కరించారు. కాగా తాము బెయిల్‌పై బయటకు వచ్చాక భూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్ని నాని, నాయకులు స్పష్టం చేశారు. మంత్రి, ఎంపీ భూదాహానికి అడ్డుకట్ట వేస్తామని, 24 గ్రామాల రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గుడివాడలో టీడీపీ నేతల వీరంగం గుడివాడలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, రావి వెంకటేశ్వరరావు వీరంగం వేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయానికి తమ అనుచరులతో వచ్చి బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే కొడాలి నానిపై సవాళ్లు విసిరారు. పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆదివారం ప్రశ్నించినందుకే అరెస్టు చేసి హడావుడి చేసిన పోలీసులు.. టీడీపీ నేతలపై మాత్రం ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. -
నగరిలో బాబూగిరీ!
-
నగరిలో బాబూగిరీ!
ఎమ్మెల్యేలను వెంటాడి.. వేటాడిన పోలీసులు ⇒ తమిళనాడులోనూ చిత్తూరు ఖాకీల దౌర్జన్యకాండ ⇒ శాంతియుత ర్యాలీని చెదరగొట్టేందుకు 144 సెక్షన్.. ⇒ ముందుగానే అనుమతి తీసుకున్నా అడుగడుగునా ఆటంకాలు ⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసు వాహనంతో తొక్కించిన వైనం.. ⇒ జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల అరెస్టు సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ముందస్తు అనుమతితో ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీ చేసేందుకు బయలుదేరిన ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా అడ్డం కులు సృష్టించింది. పచ్చనేతల కనుసన్నల్లో ఎమర్జెన్సీని తలపించేలా పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. బుధవారం నగరిలో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలపై దురుసుగా ప్రవర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినా వదిలిపెట్టకుండా వెంటాడారు. వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీస్ వాహనంతో తొక్కించారు. వేధింపులకు నిరసనగా..: నగరి ఎమ్మెల్యే రోజాతోపాటు, మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతకుమారిలపై పోలీసుల వేధింపులకు నిరసనగా బుధవారం నగరిలో ర్యాలీ చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులు అనుమతి తీసుకున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి 144 సెక్షన్ విధించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండల కన్వీనర్లు పార్టీ అనుబంధ సంఘాల నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. నగరికి వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు మోహరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని బుధవారం గృహ నిర్బంధంలో ఉంచారు. తిరుపతికి వస్తున్న పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని చిత్తూరు సమీపంలో అరెస్ట్ చేశారు. నగరి, పుత్తూరుల్లో ముఖ్యనేతలను అరెస్ట్ చేసి ఉదయాన్నే జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. నగరి పట్టణాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ఎవరినీ పట్టణంలోకి ప్రవేశించకుండా చక్రబంధం చేశారు. పోలీసుల అత్యుత్సాహాన్ని చూసి.. వైఎస్సార్సీపీ నగరిలో ర్యాలీ చేయకుండా టీడీపీ నేతలు పోలీసులను ఉసిగొల్పడాన్ని పసిగట్టిన ఎమ్మెల్యేలు అత్యవసరంగా తిరుపతిలో సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పీఎల్ఆర్ గ్రాండ్ హోటల్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న నేతలు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, గిడ్డి ఈశ్వరి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్ కుమార్, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బి.మధుసూదన్‌రెడ్డిలతోపాటు ముఖ్యనేతలు హాజరై కార్యాచరణ రూపొందించారు. టీడీపీ నేతలు, పోలీసుల దాడులను తీవ్రంగా ఖండించారు. ఎలాగైనా నగరికి చేరుకుని కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలనే కృతనిశ్చయంతో బయలుదేరారు. పోలీసులు వెంటాడాన్ని గమనించిన ఎమ్మెల్యేలు, నేతలు ప్రధాన రహదారిపై వెళ్లకుండా అప్పలాయిగుంట, రామచంద్రాపురం, పచ్చికాపలం, తమిళనాడులోని పళ్లిపట్టు మీదుగా నగరి చేరుకునే యత్నం చేశారు. రాష్ట్ర సరిహద్దు దాటి పళ్లిపట్టుకు వెళ్లినా వెంటాడం మానలేదు. నేతల వాహనాలకు పోలీస్ వాహనాన్ని అడ్డంగా పెట్టి నానా హంగామా చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై దురుసుగా ప్రవర్తించి అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.పోలీసులను అడ్డుకోబోయిన చంద్రగిరి ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీస్ వాహనంతో తొక్కించారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. నేతలు వెంటనే చెవిరెడ్డిని పళ్లిపట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్స చేయించారు. అనంతరం ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి చెవిరెడ్డి బి5 పళ్లిపట్టు పోలీస్ స్టేషన్లో ఏపీ పోలీసులపై ఫిర్యాదు చేశారు. పుత్తూరులో అరెస్ట్: పళ్లిపట్టు నుంచి నగిరికి చేరుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేల బృందాన్ని మధ్యాహ్నం నగరి సమీపంలోనే అడ్డుకుని అరెస్టు చేసి పుత్తూరు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై వదిలేశారు. -
అధికార దాష్టీకం
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ పుత్తూరుకు తరలింపు సొంత పూచీకత్తుపై విడుదల ఎమర్జెన్సీని తలపించిన పోలీసుల తీరు నగరిలో ఎమ్మెల్యే ఆర్కే.రోజా, మున్సిపల్ చైర్పర్సన్ శాంతికుమార్‌పై అధికార పార్టీ నాయకుల వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. అక్రమ కేసులు బనాయించి శాంతికుమార్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయించారు. దీనికి నిరసనగా శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు నగరికి బయలుదేరిన వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వారిని పుత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 5 గంటల తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. తిరుపతి/పుత్తూరు : నగరిలో అధికార పార్టీ వేధింపులు ఎక్కువయ్యాయి. దీనికి నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు శాంతియు తర్యాలీకి సిద్ధమయ్యాయి. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారు. జిల్లా నలుమూలల్లోని వైఎస్సార్సీపీ ప్రధాన నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. కార్యకర్తలు నగరికి రాకుండా రహదారుల్లోనే అదుపులోకి తీసుకున్నారు. పుత్తూరు, నగరి, వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద బలగాలను మోహరించారు. తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినా వదిలిపెట్టలేదు. నగరి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. నగరి పట్టణంలో 144 సెక్షన్ విధించినప్పటికీ జిల్లా మొత్తం ఉన్నట్లు నానా హంగామా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, గాలి ముద్దుక్రిష్ణమనాయుడు ఎలాగైనా ధర్నాను అడ్డుకోవాలని పోలీస్ బాస్‌కు వార్నింగ్ ఇవ్వడంతో వారు నానా తంటాలు పడ్డారు. ఎన్నడూ లేని రీతిలో నిరసన ర్యాలీని నిలువరించేందుకు ఐదుగురు డీఎస్పీలు, 10మందికి పైగా సీఐలు, 20 మంది ఎస్ఐలు, వందలాది మంది పోలీసులను మోహరించా రు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ద్విచక్ర వాహనాలు, కాలినడకన వందలాది మంది నగరికి చేరుకున్నారు. ఎలాగైనా నగరి చేరుకోవాలని.. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల బృందం ఎలాగైనా నగరి చేరుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఉదయం 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిసి నగరి చేరుకునేందుకు ప్రయత్నించారు. ఓ దశలో పళ్లిపట్టులో పోలీసులకు, ఎమ్మెల్యేల బృందానికి మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు వాహనాలకు అడ్డుపడడంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఎమర్జెన్సీ చీకటి పాలనలో ఉన్నామా? అంటూ మండిపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాలుపైకి వాహనాన్ని పోనిచ్చి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మొత్తం మీద నేతలను నగరి సమీపంలో అడ్డుకుని పుత్తూరు స్టేషన్‌కు తరలించారు. -
అక్రమ కేసుల బనాయింపే బాబు లక్ష్యం
- ప్రజాపోరాటాలను అణచివేయాలని చూస్తున్నారు - నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల: ప్రజా సమస్యలను పరిష్కరించాలని నిలదీసే వారిపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఆరోపించారు. నంద్యాల పట్టణ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం నాయకులు ఆదివారం.. 72గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. వీరికి భూమా మద్దతు తెలిపి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయన్నారు. అక్రమ కేసులతో ప్రజా పోరాటాలను అణచి వేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఎల్లకాలం సాగబోవన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే ఉండబోదని, ప్రజలకు మాత్రమే తాము భయపడుతామన్న విషయం గుర్తించుకోవాలన్నారు. సీపీఎం నాయకులు కోరుతున్న విధంగా నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం రూ.350కోట్లు నిధులు మంజూరు చేయాలన్నారు. చిత్రహింసలకు గురి చేస్తున్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించారనే కసితో మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని భూమా ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను గమనించకుండా కాలుష్యానికి దూరంగా శిల్పా..బెంగళూరులో నివాసం ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండబోదని, అధికారులు తొత్తులుగా మారకుండా నిజాయితీ వ్యవహరించాలని కోరారు.నంద్యాల పట్టణంలో రహదారుల విస్తరణతో పాటు పందుల సమస్య కూడా తీవ్రంగా ఉందని గుర్తుచేశారు. రోడ్లు వెడల్పు చేయాలని చిన్నారులు సైతం ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. నంద్యాల పట్టణంలో జరుగుతున్న అవినీతి వెలుగులోకి తేవడానికి పీఏసీ చైర్మన్‌గా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. దీక్షలో సీపీఎం నాయకుడు మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీని టార్గెట్ చేసిన ప్రభుత్వం
విజయనగరం మున్సిపాలిటీ: ఏడాదిగా టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చటమే ధ్యేయంగా పనిచేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపుతున్నందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు చెప్పారు. తన కోసం ఎదురుచూస్తున్న కుమార్తెను పోలీసులు చిన్నబుచ్చుతూ బయటికి పంపించటంపై ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు పెట్టి రిమాండ్‌కు తరలించారన్నారు. అభివృద్ధి, పెట్టుబడుల పేరిట ప్రతిసారి సింగపూర్, జపాన్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెపాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో రూ.5వేల 500 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ చెప్పుకొంటున్న టీడీపీ ప్రభుత్వం బాధ్యలపై చర్యకు ఎందుకు తాత్సారం చేస్తోందన్నారు. నీరు చెట్టు కార్యక్రమంతో సొంత పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చుతోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన అయిదు హామీలు అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. -
భయపెట్టడానికే అక్రమ కేసులు
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి ధ్వజం రాజధాని గ్రామాల్లో పార్టీ నియమిత కమిటీ పర్యటన వేధింపులు ఎదుర్కొంటున్న రైతులతో నేతల భేటీ సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుర్తుతెలియని దుండగులు ఆరు గ్రామాల్లోని 13 చోట్ల పంట పొలాల్లో నిప్పు పెట్టిన నాటి నుంచి పెరిగిన పోలీసు జోక్యం, విచారణ పేరుతో మొదలైన వేధింపులు కారణంగా రాజధాని ప్రాంత రైతు కుటుంబాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి, పెనుమాక, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో వైఎస్సార్సీపీ రాజధాని గ్రామాల రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ నేతలు గురువారం పర్యటించారు. వేధింపులు ఎదుర్కొన్నవారి నివాసాలకు వెళ్లి పోలీసుల దుర్నీతిని తెలుసుకున్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు గ్రామాల్లో పర్యటిస్తున్నామని తెలియజేస్తూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న వేధింపులను వివరించారు. ఈ సందర్భంగా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో జరిగిన సభలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసులు, తెలుగు తమ్ముళ్ళు కలిసి సంయుక్తంగా పచ్చని పంట పొలాల్లో నిప్పు పెట్టి ఉంటారన్నారు. రాజధాని గ్రామాల్లో పోలీసులు ప్రవేశించడానికి వీలుగానే వారీ నీతిమాలిన పనికి పాల్పడి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రైతుల ఇష్టానికి విరుద్ధంగా వారి భూమిని తీసుకునే అధికారం ఎవరికీ లేదని, అదే జరిగితే చైన్ స్నాచర్కు, చంద్రబాబుకూ ఎలాంటి తేడా ఉండదని వ్యాఖ్యానించారు. మానసికంగా భయపెట్టడానికే అక్రమ కేసులు బనాయిస్తున్నారనీ, మీరు సంఘటితంగా ఉద్యమిస్తే వెన్నుదన్నుగా నిలిచేందుకు తమ పార్టీ సంసిద్ధంగా ఉందని చెప్పారు. సందర్భాన్ని బట్టి జగన్మోహన్రెడ్డి సైతం గ్రామాల్లో పర్యటిస్తారని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి పార్థసారధి మాట్లాడుతూ రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పటికైనా అఖిలపక్షం వేసి అందరితో చర్చించాలని డిమాండ్ చేశారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. అమాయకులైన రైతుల వద్ద ఎలాగైనా భూమి గుంజుకునేందుకే పాలకులు ఎత్తుగడలు పన్నుతున్నారన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బాబు ఇక ఎంతో కాలం సీఎంగా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదన్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీకి ఓటేయొద్దని వీధి వీధీ తిరిగి చెప్పామనీ, ఇప్పుడదే పార్టీ అధికారం చేపట్టిన ఫలితాన్ని అందరం అనుభవిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, కోన రఘుప తి, కొడాలి నాని, రక్షణనిధి, మొహమ్మద్ ముస్తఫాలు పాల్గొన్నారు. నాయకుడి ఆదేశాల మేరకే నిప్పు పెట్టినట్లు ఒప్పుకోమన్నారు.. ‘రాజధాని నిర్మాణానికి నా భూమి ఇవ్వననడమే నేను చేసిన నేరం. వైఎస్ఆర్సీపీలో తిరగడమే నా పాపం. దీనికే పోలీసులు నన్ను నిర్బంధిం చారు. మా నాయకుడి ఆదేశాల మేరకే నేను పంట పొలాల్లో నిప్పు పెట్టినట్లు ఒప్పుకోమన్నారు. బూతులు తిట్టారు. అవమానంతో చచ్చిపోదామనుకున్నాను. కానీ కుటుంబం గుర్తొచ్చి ఆగిపోయా..’ అంటూ ఉద్దండ్రాయునిపాలెం గ్రామానికి చెందిన నందిగం సురేష్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు మా అబ్బాయిపై దొంగ కేసు బనాయించారు.. ‘మా అబ్బాయిని పోలీసులమని చెప్పి పదిరోజుల క్రితం కొందరు తీసుకెళ్ళారు. ఎక్కడుంచారో కూడా తెలీకుండా రకరకాల పోలీసుస్టేషన్లు మార్చుకుంటూ చివరకు సత్తెనపల్లిలో ఉన్నట్లు చూపించారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వమన్నందుకు.. రైతుల్లో విద్వేషాలు రగుల్చుతున్నాడనీ, మీడియాకు, అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడనీ దొంగ కేసు బనాయించారు..’ అని ఇప్పటికీ పోలీసుల చెర నుంచి విడుదల కాని లింగాయపాలెంకు చెందిన శ్రీనాధ్‌చౌదరి తండ్రి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. -
రాజీనామా చేయకుంటే కేసులు పెడతారా?
* డీలర్లు కూడా మనుషులేనని గుర్తించండి * మా మంచితనాన్ని చేతగానితనంగా భావించొద్దు * ఇలాగే ఉంటే కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా * మార్కాపురం రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే జంకె హెచ్చరిక మార్కాపురం : ‘వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్న రేషన్ డీలర్లు రాజీనామా చేయకుంటే అక్రమ కేసులు బనాయిస్తారా..? మార్కాపురం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ లక్ష్మీనారాయణ, ఆర్ఐలు డీలర్ల ఇళ్లకు వెళ్లి రికార్డులు ఇవ్వమని వారిని వేధిస్తున్నారు. ఇదీ మంచి పద్ధతి కాదు. డీలర్లు కూడా మనుషులేనని గుర్తించండి. మా మంచితనాన్ని చేతగాని తనంగా భావించొద్దు’ అని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి ఎంపీపీ మాలకొండయ్య, జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డితో కలిసి వచ్చిన ఆయన.. తహశీల్దార్‌తో సుదీర్ఘంగా మాట్లాడారు. రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం మండలం చింతగుంట్ల రేషన్ డీలర్ విషయంలో అధికార పార్టీ నాయకులకు తలొగ్గి రెవెన్యూ అధికారులు వారు చెప్పినట్టు చేశారని, తామేమీ చూస్తూ ఊరుకోమని, అవసరమైతే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. విజిలెన్స్ డీటీ, ఆర్ఐల ఏకపక్ష నిర్ణయాలు, వారు ప్రజాప్రతినిధులపై చేస్తున్న విమర్శలపై కలెక్టర్, మంత్రితో పాటు హైదరాబాద్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఏ తప్పూ చేయకున్నా చింతగుంట్ల డీలర్‌పై కేసులు అక్రమంగా బనాయించారని ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం తనిఖీలకు వెళ్లిన అధికారులు రికార్డులను అక్కడే పరిశీలించాలని, తమ ఇంటికి తీసుకెళ్లడం ఎక్కడా లేదన్నారు. అలా చేయడం వల్ల రికార్డులు తారుమారు కావన్న గ్యారంటీ ఏమిటన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే రెవెన్యూ అధికారుల తీరు వివాదాస్పదంగా మారిందని, ఒక్కసారి పునరాలోచించుకుని మనస్సాక్షిగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే జంకె హితవు పలికారు. ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదన్నారు. అవసరమైతే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం ఉద్యోగాలు చేయవద్దని, పేద ప్రజల సంక్షేమం కోసం విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి మాట్లాడుతూ దరిమడుగులో షాపు నంబర్ 19కు కేటాయిస్తున్న నిత్యావసరాలను అనధికార వ్యక్తి విక్రయిస్తున్నాడని, ఈ విషయాన్ని గతంలో చెప్పినా ఎందుకు విచారణ చేపట్టలేదని తహశీల్దార్‌ను ప్రశ్నించారు. తహశీల్దార్ నాగభూషణం మాట్లాడుతూ తాము ఎవరి ప్రలోభాలకూ లొంగలేదని, దరిమడుగు డీలర్‌పై తానే స్వయంగా విచారణ చేస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. -
ఇదీ ‘అధికార’ న్యాయం!
* భూమాపై కేసులు పెట్టిన వెంటనే అరెస్టు * టీడీపీ నేతలు శిల్పా, సులోచన తదితరుల విషయంలో మీనమేషాలు * కోర్టు ఆదేశించిన తర్వాతే కేసుల నమోదు.. ఆపై అరెస్టులో ఆలస్యం * దర్జాగా తిరుగుతున్న టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో అధికార పార్టీ రాజకీయ వేధింపులు మితిమీరుతున్నాయి. అక్రమ కేసులు బనాయించడమే కాకుండా.. ఒక్కో కేసులో ఒక్కోసారి జైలుకు పంపేందుకూ వెనుకాడటం లేదు. తద్వారా ప్రతిపక్ష పార్టీల నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇందుకు పోలీసులూ సహకరిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలపై మాత్రం ఫిర్యాదులు వచ్చినా కేసులు పెట్టేందుకు పోలీసు యంత్రాంగం జంకుతోందనే ఆరోపణలున్నాయి. చివరకు కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినా.. వారిని అరెస్టు చేసేందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డిపై నమోదైన కేసులే.. తెలుగుదేశం నేతలపై నమోదైనా.. వారు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. ఈ ద్వంద్వనీతిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జెడ్పీ చైర్మన్, తెలుగుదేశం నేత మల్లెల రాజశేఖర్ ఏకంగా కల్తీ మద్యం కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్నారు. ఆయనపై పక్కా ఆధారాలున్నా.. అరెస్టు చేయడం లేదు. సీఎం చంద్రబాబు నుంచి తనకు అభయం ఉందని చెప్పుకొంటూ ఆయన తిరుగుతున్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో ఆయన కలెక్టర్ పక్కనే కూర్చున్నారు. జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ రాంపుల్లయ్యయాదవ్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ నేతలు.. అది సాధ్యంగాకపోవడంతో ఆయన ఆ సంఘం డెరైక్టర్లను కిడ్నాప్ చేశారంటూ నాటకం ఆడుతున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు డెరైక్టర్లను రాంపుల్లయ్యే కిడ్నాప్ చేశారంటూ ఆయన ఇంట్లో లేని సమయంలో శుక్రవారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. ఈ విధంగా అన్ని వ్యవహారాల్లోనూ అధికార పార్టీ జిల్లాలో ‘టై’ సృష్టిస్తోంది. అవే కేసులు.. మరి అరెస్టులేవీ? వాస్తవానికి భూమా నాగిరెడ్డిపై రెండు హత్యాయత్నం కేసులు (సెక్షన్ 307), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. మొత్తం మూడు కేసుల్లో.. మొదటి కేసు నంబర్ (224/12)లో సెక్షన్లు 147, 109, 447, 120 (బి), 427, 457, 342, 324, 307, 354, 152, 332, 336, 506, 509, రెడ్ విత్ 149, మరో కేసు (225/14)లో 147, 148, 324, 506, 307, రెడ్ విత్ 149, మూడో కేసు (226/14)లో సెక్షన్లు 324, రెడ్ విత్ 34తో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తెలుగుదేశం నేతలపై మాత్రం మొదట్లో నమోదు చేయకపోయినప్పటికీ.. తీరా కోర్టు అక్షింతలతో కేసులు నమోదయ్యాయి. అటు భూమాతో పాటు ఇటు తెలుగుదేశం నాయకుడు శిల్పామోహన్‌రెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచనతో పాటు ఇతర టీడీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులే నమోదయ్యాయి. శిల్పామోహన్‌రెడ్డి, దేశం సులోచన, దేశం సుధాకర్‌రెడ్డి, అమృతరాజు, పెదకండిగ సుబ్రమణ్యం, రంగాప్రసాద్, కృష్ణమోహన్, ఇతరులపై ఈనెల 18న.. ఐపీసీ సెక్షన్లు 120 (బి), 324, 307 ఆర్/డబ్ల్యు 34, సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద కేసులు నమోదు చేశారు. మరో కేసులో (227/14) దేశం సులోచన, వెంకటసుబ్బయ్య, గొల్ల లక్ష్మీనారాయణ, జాకీర్‌హుస్సేన్, తెలుగు కృష్ణమోహన్, అమీర్బాషాలపై సెక్షన్లు 323, 354, 427, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. ఇందులో 354, అట్రాసిటీ కేసులు.. రెండూ నాన్ బెయిలబుల్ కేసులే. తెలుగు కృష్ణమోహన్‌పై ఇప్పటికే నంద్యాల త్రీటౌన్ పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది. అయినా అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారు. బెయిల్ తెచ్చుకునేదాకా ఆగుదాం.. వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు నమోదైన వెంటనే అరెస్టు చేసేందుకు ప్రభుత్వం నంద్యాలలో యుద్ధ వాతావరణం సృష్టించింది. తెలుగుదేశం నేతల విషయంలో మాత్రం పోలీసులు స్పందించడంలేదు. టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకునే వరకు వేచిచూడాలని పోలీ సులపై అధికార పార్టీ ఒత్తిళ్లు ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. కేసులో ఉన్న శిల్పామోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి శనివారం నంద్యాల వచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్, టీడీపీ నేత దేశం సులోచన శనివారం నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేసు వెనుక కేసు పెట్టి వేధింపులు భూమా నాగిరెడ్డిపై మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఒక్కోసారి ఒక్కోకేసులో జైలుకు పంపేందుకు ప్రణాళిక వేశారు. వాస్తవానికి ఒకేసారి మూడు కేసుల్లో రిమాండ్ విధించాలని భూమా తరఫు న్యాయవాది పోలీసులను కోరారు. అయితే.. ప్రస్తుతం ఒక కేసు మాత్రమే పెడుతున్నామని.. మిగతా రెండింటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఒక కేసులో భూమా నాగిరెడ్డికి నంద్యాల కోర్టు బెయిల్ ఇచ్చింది. మిగిలిన రెండు కేసుల్లో.. ప్రస్తుతానికి ఒక కేసులో మళ్లీ జైలుకు పంపాలనేది అధికారపార్టీ దురాలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఆ కేసులో కూడా బెయిల్ వస్తే.. మూడో కేసులో ఇరికించి మళ్లీ జైలు మెట్లు ఎక్కించాలనేది అధికారపార్టీ పన్నాగంగా తెలుస్తోంది. -
రుణమాఫీపై కిరికిరి కమిటీలెందుకు
- అధికారం కట్టబెట్టిన ప్రజల్ని నట్టేట ముంచుతారా - చంద్రబాబు తీరుపై ధర్మాన ధ్వజం - చింతలపూడి నియోజకవర్గ సమావేశానికి పోటెత్తిన కార్యకర్తలు జంగారెడ్డిగూడెం : ‘ప్రజలు ప్రేమతో అధికారం కట్టబెడితే.. చంద్రబాబు ఆ ప్రజలనే నట్టేట ముంచాడు. ఎన్నికల సమయంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులను చంద్రబాబు గారడీ చేసి ఆకట్టుకున్నారు. ఓటు వేస్తే తమ బకాయిలు రద్దవుతాయని రైతులు, మహిళలు భావించారు. ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు, ఉపాధి దొరుకుతుందని కార్మికులు నమ్మారు. టీడీపీని గెలిపించారు. గెలిచిన తరువాత మొదటి సంతకం రుణమాఫీపైనే చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తరువాత కిరికిరి కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నార’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన చింతల పూడి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాలుగు నెలల పాలనలో ఏ ఒక్కనాడూ స్థిరంగా మాట్లాడలేదన్నారు. పూటకో మాట, రోజుకో ప్రకటన చేస్తూ రైతులను, మహిళలను మోసం చేస్తున్నారని దుయ్య బట్టారు. రుణమాఫీ పేరిట కమిటీలు వేస్తూ.. కాలాన్ని పొడిగించుకుంటూ రైతులు, మహిళల సహనాన్ని పరీక్షిస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్ల వరకు రివ్యూ కమిటీలు పనిచేస్తాయని చంద్ర బాబు అంటున్నారని, ఆ తరువాత ప్రజలు రివర్స్ ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో పార్టీలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూశారని, చంద్రబాబు పాలనలో పచ్చ చొక్కాలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నామని ధర్మాన ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓడిపోలేదని, ప్రజలిచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతే ఓటమి అవుతుందని ధర్మాన పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఒక్క ఎమ్మెల్యే సీటుతో ప్రారంభమై 67 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఉందన్నారు. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ 2019 నాటికి రాష్ట్రంలో 113 సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. పార్టీ ఓటమి పాలైందని కార్యకర్తలు నిరుత్సాహ పడాల్సిన పనిలేదన్నారు. సమర్థులైన వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారని, తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమై 2019లో అధికారంలోకి వస్తుందని చెప్పారు. అభివృద్ధిపై దృష్టి పెట్టండి.. అక్రమ కేసులపై కాదు : ఆళ్ల నాని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు అభివృద్ధిపై కాకుండా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంపై దృష్టి సారించారన్నారు. ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టడం మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, కార్యకర్తపై ఈగ వాలినా సహించబోమని అన్నా రు. చంద్రబాబు మాటలకు మోసపోయిన మహిళలకు న్యాయం చేసేలా జిల్లాకు చెందిన స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత కృషి చేయాలని కోరారు. డ్వాక్రా, వ్యవసాయ రుణాలను రద్దు చేస్తారని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే, వారిని వెన్నుపోటు పొడుస్తారా అని నాని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచి పనిచేయిస్తామన్నారు. ఉత్సాహంతో ముందుకు పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఆళ్ల నాని నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారన్నారు. టీడీపీ పాలన పూర్తి ప్రజా వ్యతిరేకంగా సాగుతోందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేయడం ద్వారా తన నిజస్వరూపం బయటపెట్టుకున్నా రన్నారు. నమ్మిన ప్రజలను నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 15 నియోజకవర్గాలతోపాటు నూతనంగాఏర్పాటయ్యే 3 నియోజకవర్గాలతో కలిపి 18 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేస్తుందన్నారు. దొంగ వాగ్దానాలతో గెలిచామనే గర్వంతో టీడీపీ నాయకులు విర్రవీగుతున్నారని, వారి ఆగడాలకు అంతులేకుండా పోతోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మాట్లాడుతూ సుదీర్ఘమైన పాలనా అనుభవం గల చంద్రబాబు కావాలనే రుణమాఫీ పేరిట మోసం చేశారన్నారు. రైతులు, మహిళలు మేల్కొని చంద్రబాబు వాగ్దానాలు నెరవేర్చేవరకు ఉద్యమిం చాలని పిలుపునిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ మాట్లాడుతూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. పార్టీ అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, నాయకులు బీవీఆర్ చౌదరి, చనమాల శ్రీనివాసరావు, నులకాని వీరాస్వామినాయుడు, రావూరి కృష్ణ, కొయ్య రాజారావురెడ్డి, పాములపర్తి శ్రీనివాస్, మంగా రామకృష్ణ, కేమిశెట్టి మల్లిబాబు, జేవీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిట్టినోళ్లకు గ్రేడ్లా! మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ చంద్రబాబు 100 రోజుల పాలనలో మంత్రులకు గ్రేడ్లు ఇచ్చారన్నారు. ఆ గ్రేడ్లు వారు పనిచేసినందుకు ఇచ్చినవి కాదని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎక్కువగా తిట్టినవారికి ఇచ్చినవని ఎద్దేవా చేశారు. 100 రోజుల పాలనలో ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇన్ని రోజుల పాలనలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారో.. లేదో.. చంద్రబాబు గుండెల మీద చేయివేసుకుని చెప్పాలని బోస్ డిమాండ్ చేశారు. -
పండ్ల తోటల నరికివేత
సాక్షి నెట్వర్క్: అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులతో ఆగకుండా వారి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీవారికి చెందిన ఇళ్లపై దాడులు, వ్యవసాయ పొలాలను నాశనంచేయడం, పండ్లతోటలను నరికేయడం వారికి పరిపాటిగా మారింది. మరికొందరిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. శ్రీకాకుళం జిలాల పలాల నియోజకవర్గం మందస మండలం బుడారిసింగికి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సర్పంచ్ సురేష్‌కుమార్ పాణిగ్రాహి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంలో జూన్ 30వ తేదీ రాత్రి టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ చిదిరాల సతీష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీన్ని సాకుగా తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హత్యాయత్నం చేశారంటూ 200మంది టీడీపీ వర్గీయులు మర్నాడు దాడులకు తెగబడ్డారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీటీసీ మొరవినేని భాస్కరరావుపై మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. వారి ఇంటి లోని ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక వర్గంలోని రాపూరు మండలం తెగచెర్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొడ్డు మధుసూధన్ రెడ్డికి చెందిన కారును తగులబెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పొలాలకు ఉన్న కంచెను కూడా తగులబెట్టారు. అనంతపురం జిల్లా కనగానపల్లిలో హరిజన సుబ్బరాయుడు పొలంలో మే 18వ తేదీన 350 మామిడి చెట్లను నరికివేశారు. అలాగే శింగనమల నియోజకవర్గం యల్లనూరులో 86 చీనీ చెట్లు, పెద్దమల్లేపల్లిలో 100 చీనీచెట్లను నరికివేశార.ు. చిత్తూరుజిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.