
నిర్వాసితులపై కేసులను ఎత్తేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితులపై అక్రమ కే సు ల్ని ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నిర్వాసితులపై కాల్పులు, లాఠీచార్జీపై ప్ర భుత్వం క్షమాపణ చెప్పాల్సిందిపోయి వారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపా రు. పోలీసులు అరెస్టు చేసిన మెదక్ జిల్లా సీపీఎం కార్యదర్శి మల్లేశ్, మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కమిటీ కన్వీనర్ భాస్కర్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎక్కువ మంది రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరని, భూఉద్యమ నాయకులను జైలుకు పంపి నిర్వాసితులను బలవంతంగా ఒప్పించడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.