చిత్తూరు జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ముందస్తు అనుమతితో ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీ చేసేందుకు బయలుదేరిన ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా అడ్డం కులు సృష్టించింది. పచ్చనేతల కనుసన్నల్లో ఎమర్జెన్సీని తలపించేలా పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. బుధవారం నగరిలో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలపై దురుసుగా ప్రవర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినా వదిలిపెట్టకుండా వెంటాడారు. వైఎస్సార్‌సీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీస్ వాహనంతో తొక్కించారు.