
(ఫైల్ ఫోటో)
సాక్షి, కృష్ణా: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక, మద్యం రవాణా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ అన్నారు. ఆయన గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక, మద్యం రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. గుర్తించిన మార్గాలలో సీసీ కెమెరాలు, మొబైల్ చెక్ పోస్ట్, ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేశాని తెలిపారు. సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (ఆగస్ట్ నుంచి గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన)
పాత నేరస్తులుగా ఉంటే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై రౌడీషీట్ కూడా తెరుస్తామని వినీత్ బ్రిజ్ లాల్ అన్నారు. గురువారం ఒక్క రోజే 41 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. 65 వాహనాలు స్వాధీనం చేసుకొన్నామని, 851 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రజలు సహకరిస్తే అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడం సులభతరం అవుతుందని అన్నారు. (జగనన్న చేదోడుపై సర్వత్రా హర్షం!)
Comments
Please login to add a commentAdd a comment