నరసరావుపే టౌన్(పల్నాడు జిల్లా): ఛీటింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ ఎస్.వెంకట్రావు మంగళవారం తెలిపారు. వివరాలు.. బరంపేటకు చెందిన పోతుల విక్రమ్, లక్ష్మీజ్యోతి భార్యాభర్తలు. విక్రమ్ ఆదిత్య పేరిట లక్ష్మీజ్యోతి యూట్యూబ్ చానల్‌ను 2014లో నుంచి నిర్వహిస్తోంది. సుమారు ఈ చానల్‌కు 10 లక్షల మంది సబ్ స్క్రెబర్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం లక్ష్మీజ్యోతి హైదరాబాద్‌కు చెందిన వ్యాకుడ్ ఆవుట్ కంపెనీతో తన యూట్యూబ్ చానల్ ద్వారా యాడ్స్ ఇచ్చేందుకు ఒప్పదం కుదుర్చుకుంది. ఈ క్రమంలో భర్త విక్రమ్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి వేర్వేరుగా జీవిస్తున్నారు.
చదవండి: పెళ్లి చేసుకో.. లేకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడతా..
అయితే లక్ష్మీజ్యోతి సంతకాన్ని ఫోర్జరీ చేసి వ్యాకుడ్ అవుట్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భర్త విక్రమ్ రద్దు చేశాడు. యూట్యూబ్ చానల్ ద్వారా ప్రతినెల వచ్చే ఆదాయాన్ని తన రెండో భార్య తమ్ముడు వావిళ్ళపల్లి సంతోష్ అకౌంటుకు మళ్లించాడు. రెండేళ్ల నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు మోసం చేసి దారి మళ్లించినట్లు లక్ష్మీజ్యోతి గ్రహించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి అతడి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ కోసం గాలిస్తున్నట్లు సీఐ వెంకట్రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment