
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడి అక్రమాలపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఓ కాంట్రాక్టు విషయంలో కోడెల శివరామ్ తనను మోసం చేశారంటూ టీడీపీ నేత శివరామయ్య పోలీసులను ఆశ్రయించారు. ఏడు లక్షల రూపాయలు ఇస్తేనే పని చేయనిస్తానని తనను బెదిరించారని, ఆ తర్వాత డబ్బు తీసుకుని కూడా కాంట్రాక్టును రద్దు చేయించారని ఆరోపించారు. ఈ మేరకు శివరామ్‌తో పాటుగా ఆయన అనుచరులపై కూడా నరసారావుపేట వన్‌టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.
కాగా ‘కే ట్యాక్స్’ పేరిట తమను వేధించారంటూ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ్ అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.