కోడెల మృతిపై కేసు నమోదు | Kodela Siva Prasada Rao commits suicide: Police Case Filed | Sakshi
Sakshi News home page

కోడెల మృతిపై 174 సెక్షన్‌ కింద కేసు నమోదు

Published Mon, Sep 16 2019 3:22 PM | Last Updated on Mon, Sep 16 2019 4:24 PM

Kodela Siva Prasada Rao commits suicide: Police Case Filed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతిపై 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామన్నారు. అయితే  కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం  కోడెల  ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, పోస్ట్‌మార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

కోడెల కుమార్తె ఆయన గదిలోకి వెళ్లి చూడటంతో విషయం తెలిసిందని, ఘటనా స్థలంలో ముగ్గురు ఉన్నట్లుగా తెలిసిందని డీసీపీ పేర్కొన్నారు. కోడెల మృతి బంజారాహిల్స్‌ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని తెలిపారు. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా  కోడెల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీమ్‌  ఆయన నివాసంలో ఆధారాలను సేకరిస్తోంది. అలాగే కోడెల గదిలో ఎలాంటి సూసైడ్‌ నోటు లభ్యం కాలేదని  పోలీసులు తెలిపారు.

మూడు బృందాలతో దర్యాప్తు: సీపీ అంజనీకుమార్‌
కోడెల మృతిపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. ‘అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం​. మూడు బృందాలతో దర్యాప్తు జరుపుతున్నాం. బంజారాహిల్స్‌ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్టు తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుంది.  అలాగే కోడెల నివాసంలో ఆధారాల సేకరణ నిమిత్తం అక్కడకు చేరుకుని క్లూస్‌ టీమ్‌, టెక్నికల్‌ టీమ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదిక అనంతరం మృతిపై వివరాలు వెల్లడిస్తాం. బంజారాహిల్స్‌ పోలీసులు’ అని సీపీ పేర్కొన్నారు. 

చదవండి:

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?

సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!

కోడెల శివప్రసాదరావు కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement