
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అరాచకాలు రోజుకు ఓ చోటు బయటపడుతున్నాయి. ఆయన కుటుంబం మీద పోలీస్ స్టేషన్లలో కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కోడెల కుమారుడు శివరామ్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. ఏడు లక్షలు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కోడెల ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా కోడెల శివరామ్ తిరిగి ఇవ్వటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment