kodela shivaramakrishna
-
టీడీపీ సమర్పించు కేబుల్ వార్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ సమర్పించు ‘కేబుల్ వార్’ ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది. సంపాదనే పరమావధిగా, పార్టీ అండ చూసుకొని నియోజకవర్గంలో కేబుల్ ప్రసారాలపై ఆధిపత్యం కోసం నల్లపాటి, కోడెల వర్గీయులు పోరుకు కాలు దువ్వుతున్న తీరు ఆ పార్టీలో కాక రేపుతోంది. తండ్రి దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అధికారాన్ని అడ్డుపెట్టుకొని 2016లో కోడెల శివరాం కేబుల్ వ్యవస్థను తన గుప్పెట్లోకి తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి తన పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా కేబుల్ ఆపరేటర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అండతో కేబుల్ ప్రసారాలు ప్రారంభించిన నల్లపాటి రాము కూడా విస్తరణకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఎన్సీవీ కేబుల్ వైర్లను కత్తిరించి అగ్గి రాజేశారు. ఈ వ్యవహారంతో నల్లపాటి వర్సెస్ కోడెల వర్గీయులు మరోమారు ఘర్షణకు దిగడంతో ఇరువర్గాలపై కేసుల నమోదు వరకు వ్యవహారం వెళ్లింది.ఎన్‌సీవీపై దాడి చేసి కబ్జా...ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నల్లపాటి రామచంద్రప్రసాద్(రాము) నరసరావుపేట నియోజకవర్గంలో నల్లపాటి కేబుల్ విజన్(ఎన్సీవీ) పేరిట ప్రసారాలను గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రతినెలా రూ. లక్షల్లో ఆదాయం వస్తుండటంతో 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల శివరాం కేబుల్ వ్యవస్థను తన గుప్పెట్లో తీసుకునేందుకు కుట్ర పన్నారు. తన అనుచరులతో అప్పుడు వైఎస్సార్ సీపీలో ఉన్న నల్లపాటి రాముపై దాడి చేయడంతోపాటు ఎన్సీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేబుల్ వ్యవస్థను హస్తగతం చేసుకొన్న శివరాం రాజాగారి కోటలోని తన ఇంటి నుంచి కే–ఛానల్ పేరిట కేబుల్ కార్యకలాపాలు నిర్వహించారు. జీసీటీవీ కార్యాలయాన్నీ ధ్వంసం చేసి ఆ వ్యవస్థను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంత అరాచకం సృష్టించినా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి కేసులు, పరిహారం లేకుండా వ్యవహారాన్ని చక్కదిద్దారుఅగ్రవర్ణ వ్యక్తి ఫిర్యాదుతో అట్రాసిటీ కేసు...కే–ఛానల్లో భాగస్వామి అయిన విజయవాడకు చెందిన గన్నపనేని నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదుతో నల్లపాటి వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని నల్లపాటి రామచంద్రప్రసాద్ దీనిపై గుంటూరు రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఓ వైపు నా కేబుల్ వ్యవస్థను నాశనం చేస్తూనే, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయిన తనపైనే అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారట. ఈ కేసు నమోదు వ్యవహారంలో కోడెల శివరాం తెరవెనుక ఉండి చక్రం తిప్పారనే చర్చ పేటలో నడుస్తోంది.మరోసారి పట్టు కోసం పోరు.. తలపట్టుకుంటున్న ఎమ్మెల్యే...తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకులు కేబుల్ వ్యవహారంలో పోరుకు దిగడం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబుకు సంకటంగా మారింది. ఎటూ చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంతో చేతులెత్తేశారు. అయితే ఎన్నికల ముందు కేబుల్ వ్యవస్థను అప్పగిస్తానని నల్లపాటి రాముకు ఆయన హామీ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల అనంతరం ఎన్సీవీ కేబుల్ ప్రసారాలను ప్రారంభించారు. కోడెల శివరాం మాత్రం కేబుల్ వ్యవస్థ తనకే కావాలంటూ ముందుకు రావడంతో ఎమ్మెల్యే ఎవరికి సర్దిచెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. 2016లో కేబుల్ అధిపత్యంలో జరిగిన పోరులో పెద్ద ఎత్తున ఆస్తుల ధ్వంసంతోపాటు వ్యక్తిగత దాడులు జరిగాయి. ప్రస్తుతం రెండు వర్గాలు ఒకే పార్టీలో ఉండి మరోసారి పోరుకు సిద్ధమవుతుండటంతో ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోందన్న ఆందోళన టీడీపీలో నెలకొంది.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లపాటి రాము నియోజకవర్గంలో కేబుల్ ప్రసారాలను రెండు నెలలుగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు మద్దతు తెలపడంతో ప్రస్తుతం రాముకు చెందిన ఎన్సీవీ కేబుల్ ప్రసారాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని కోడెల శివరాం భాగస్వామి నరసింహారావు తన సిబ్బందితో ఎన్‌సీవీకి చెందిన కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు అంతరాయం కలిగించారట. గత శుక్రవారం అరండల్‌పేటలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎన్‌సీవీకి చెందిన కేబుల్ వైర్లను కోడెల వర్గానికి చెందిన కొందరు కత్తిరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్సీవీ సిబ్బంది అక్కడికి చేరుకొని వైర్ల కత్తిరించిన ముగ్గురు యువకులను పట్టుకుని కార్యాలయానికి తరలించారు. యువకులు దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని విడిపించారు. -
ఆస్తులు అమ్ముకుని పనిచేస్తుంటే.. చంద్రబాబు మాత్రం వారిని బుజ్జగిస్తూ..
జనం ఛీకొట్టినా తెలుగుదేశం నాయకత్వంలో మార్పు రావడంలేదు. ఆ పార్టీలో ఒక్కో కులానికి ఒక్కో న్యాయం అమలవుతోంది. అధికారంలో ఉన్నా అంటే.. అధికారం పోయినా అంతే. చంద్రబాబు సామాజికవర్గ నేతలకు ఇబ్బంది కలిగితే వెంటనే యాక్షన్ ఉంటుంది. ఇతర కులాల నేతలకు ఎంత ఇబ్బంది కలిగించినా పట్టించుకునేవారుండరు. ఇప్పుడిదే గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు గుంటూరు పచ్చపార్టీలో ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజికవర్గానికి మాత్రమే చెందిన పార్టీ అని తొలి నుంచి ప్రచారం ఉంది. పదవులు ఎవరికి ఇచ్చినా పెత్తనం మాత్రం ఒకే సామాజికవర్గం చేతుల్లో ఉంటుంది. అది చంద్రబాబు సామాజిక వర్గం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బడుగు, బలహీనవర్గాల పార్టీ అని చంద్రబాబు పదే పదే డప్పు కొడుతుంటారు. కాని ఆయన చెప్పేదొకటి.. చేసేదొకటి. బీసీలైతే ఏమాత్రం తేడా వచ్చినా తొక్కేస్తారు. అదే మనోడైతే నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పచ్చపార్టీలో ఇదే జరుగుతోంది. నర్సరావుపేటలో గత ఎన్నికల్లో బీసీ నేత చదలవాడ అరవిందబాబు టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నాలుగేళ్లనుంచి ఇన్చార్జిగా పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే అరవిందబాబు ఆర్దికంగా ఇబ్బందులు పడ్డారు. అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. గత నాలుగేళ్లుగా సొంత ఆస్తులను సైతం అమ్ముకుని నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీని నడుపుతున్నాడు. చదవండి: అక్కడ ఆటలు సాగవని అర్థమైంది.. అందుకే గ్లాస్లో మునకేశాడా? మరో ఏడాదిలోగా ఎన్నికలు రానున్న తరుణంలో ఇప్పుడు సడన్ గా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వర్లు తెరపైకి వచ్చారు. తాము కూడా టికెట్ రేసులో ఉన్నామంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు కమ్మ సామాజికవర్గం నేతలతో సమావేశమై ఈసారి టికెట్ మన సామాజికవర్గానికే దక్కేలా చూడాలని కులపెద్దలను కోరినట్లు సమాచారం. అరవిందబాబును కట్టడి చెయ్యడానికి ఒకవైపు నల్లపాటి రాము, మరోవైపు కడియాల వెంకటేశ్వర్లు ఇద్దరూ తెగ పోటీ పడుతున్నారు. ఇన్ చార్జిగా ఉన్న అరవిందబాబును ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వకుండా ప్రతిరోజూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వర్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేష్ కు ఎన్ని ఫిర్యాదులు చేసినా వారిద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నర్సరావుపేటలో టీడీపీ అభిమానులందరూ పార్టీని బతికించడానికి అరవిందబాబు ఆస్తులు అమ్ముకుంటే.. చంద్రబాబు మాత్రం పార్టీని నాశనం చేస్తున్న కమ్మ సామాజికవర్గానికి కొమ్ము కాస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ నేతలతోపాటు పార్టీకి సపోర్టు చేస్తున్న ఎల్లో మీడియా కూడా బీసీ నేత అరవిందబాబుకు వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తున్నాయి. నర్సరావుపేట పక్కనే ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజికవర్గం నేతలు ఇన్ ఛార్జిని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. రెండు నెలల క్రితం సత్తెనపల్లి టీడీపీ ఇన్ ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. కన్నాను ఇన్ ఛార్జిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కోడెల శివరాం సొంత కుంపటి ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించినా ఎటువంటి చర్యలు లేవు. పైగా చంద్రబాబును విమర్శిస్తే పార్టీ నేతలు శివరాంను బుజ్జగించారే కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కన్నా కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం, ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కోడెల శివరాం కమ్మ సామాజికవర్గంకు చెందిన నేత కావడంతోనే పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతుంది. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్ మధ్య వార్ నడుస్తోంది. ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నాయకులే. పుల్లారావుకు వ్యతిరేకంగా బాష్యం ప్రవీణ్ నారా ట్రస్ట్ పేరుతో పాగా వెయ్యడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో ఇద్దరు నేతలు కొట్టుకోవడం మొదలయ్యింది. ఇక్కడ ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నేతలు కావడంతో.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా రక్షించుకోవడానికి అధినాయకత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. పుల్లారావును జో కొడుతూ భాష్యం ప్రవీణ్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. షోకాజ్ నోటీసు పేరుతో అగ్ర నాయకత్వం భాష్యం ప్రవీణ్‌ను పిలిపించి బుజ్జగించి పంపించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నా భాష్యం ప్రవీణ్‌పై చర్యలు తీసుకోకపోవడానికి కమ్మ సామాజికవర్గం నేత కావడమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇలా టీడీపీ అధినేత తన సామాజికవర్గానికి ఒక న్యాయం.. మిగతా సామాజికవర్గాలకు మరొక న్యాయం అంటూ రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని గుంటూరు జిల్లాలో టాక్ నడుస్తోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
సత్తేనపల్లి ఇన్చార్జి నియామకంపై మల్లగుల్లాలు !
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. కోడెల చివరి రోజుల్లో ఆయన్ను పట్టించుకోని టీడీపీ నాయకులు అనంతరం శవరాజకీయాలకు దిగి నానాయాగీ చేశారు. కోడెల మరణంతో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పదవి ఖాళీ అయింది. ఈ పదవిని కోడెల తనయుడు శివరామకృష్ణకు ఇచ్చి రాజకీయంగా సానుభూతి సంపాదించుకోవాలని చంద్రబాబు యోచించినట్టు తెలిసింది. గత ఐదేళ్లలో తమను వేధించిన శివరామ్‌కే ఇన్చార్జి పదవిని ఇస్తామంటే ఒప్పుకునేది లేదని కోడెల వ్యతిరేకవర్గం తేల్చి చెప్పినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందే కోడెల శివప్రసాదరావుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వొద్దని సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం నాయకులు రోడ్లపై నిరసనలు చేపట్టారు. ఎన్నికల అనంతరం కోడెల కుటుంబంపై కే–ట్యాక్స్ కేసులు వరుసగా నమోదవుతూ పార్టీ పరువు బజారున పడుతుండటంతో అప్పట్లో కోడెల వ్యతిరేక వర్గం నాయకులు పార్టీ ఇన్చార్జిగా కోడెలను తొలగించాలని డిమాండ్ చేశారు. 200 వాహనాలతో సత్తెనపల్లి నుంచి ర్యాలీగా గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కోడెలను పార్టీ నుంచి పోమ్మనలేక పొగబెట్టాలని భావించిన చంద్రబాబు రాయపాటి రంగబాబును రంగంలోకి దించాడు. కోడెల వ్యతిరేక వర్గంతో రంగబాబు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. రంగబాబే నియోజకవర్గ పార్టీ ఇన్చార్జని కోడెల వ్యతిరేకవర్గం నాయకులు ప్రచారం చేశారు. కోడెల మరణంతో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తానేనని శివరామ్ సైతం సన్నిహితులతో చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నట్టు ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి... రాజకీయంగా సానుభూతి సంపాదించడం కోసం కోడెల శివరామ్‌ను నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమిస్తే క్యాడర్ పార్టీ మారే అవకాశం ఉంది. క్యాడర్ డిమాండ్‌ను శిరసా వహిస్తూ వేరే వ్యక్తిని నియమిస్తే కోడెల కుటుంబంపై చంద్రబాబు నకిలీ ప్రేమ బయటపడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక సతమతవుతున్నారని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకులు అంటున్నారు. మరో వైపు ఇన్చార్జి పదవి కోసం రాయపాటి రంగబాబు, టీడీపీ అనుబంధ సంస్థ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బూరి మల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో సత్తెనపల్లి టిక్కెట్ ఆశించి భంగపడినవారిలో అబ్బూరి మల్లీ కూడా ఒకడు. శివరామ్‌కు ఇన్చార్జి బాధ్యతలు దక్కకుండా కోడెల వ్యతిరేక వర్గాన్ని ఈ ఇద్దరూ లీడ్ చేస్తున్నట్టు సమాచారం. కోడెల మరణించినప్పుడు ఆయన కుటుంబంపై వల్లమాలిన ప్రేమాభిమానాలు ఒలకబోసిన జిల్లా టీడీపీ నాయకులు సైతం శివరామ్‌ను ఇన్చార్జిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. -
కోడెల కాల్ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ
సాక్షి, హైదరాబాద్/అమరావతి : టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై దర్యాప్తు కొనసాగుతోందని బంజారాహిల్స్ ఏసీపీ కే.శ్రీనివాసరావు వెల్లడించారు. అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 12 మందిని విచారించామని చెప్పారు. కోడెల కుంటుంబ సభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేశామని తెలిపారు. కోడెల భౌతిక కాయానికి సంబంధించి పోస్టుమార్టం పూర్తి నివేదిక ఇంకా అందలేదని పేర్కొన్నారు. కోడెల ఫోన్లోని కాల్‌డేటా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. సీడీఆర్ఏ కాల్ లిస్టు రిపోర్టును పరిశీలిస్తున్నామన్నారు. ఇక సోషల్ మీడియాలో కోడెల కాల్ డేటాపై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. కోడెల కుమారుడు శివరామ్‌ను త్వరలోనే విచారిస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. (చదవండి : ఒక మరణం.. అనేక అనుమానాలు) మొబైల్ ఇంకా దొరకలేదు.. కోడెల శివప్రసాదరావు మృతి కేసులో కీలకం కానున్న ఆయన మొబైల్ ఇంకా దొరకలేదని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. విచారణ కొనసాగుతోందని అన్నారు. ‘సత్తెనపల్లిలో కోడెల మేనల్లుడు కంచేటి సాయి ఇచ్చిన ఫిర్యాదు ఫ్యాక్స్ ద్వారా అందింది. న్యాయనిపుణుల సలహా తీసుకొని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు రికార్డు చేశాం. కోడెల కుమారుడు శివరాంతో పాటు కోడెల సన్నిహితులు మరికొంతమందిని విచారించాల్సి ఉంది. కోడెల కాల్ డేటాపై ఆరా తీస్తున్నాం. ఆయన ఎవరెవరితో మాట్లాడారు అనేది తెలిస్తే కేసులో పురోగతి లభిస్తుంది. కోడెల పోస్టుమార్టం రిపోర్టు, కాల్ డేటా, ఎఫ్ఎస్సెల్ రిపోర్ట్ అందాల్సి ఉంది’అన్నారు. (చదవండి : కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు) -
మూడు బృందాలతో దర్యాప్తు: సీపీ అంజనీకుమార్
-
కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు
-
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
-
కోడెల మృతిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామన్నారు. అయితే కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, పోస్ట్‌మార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కోడెల కుమార్తె ఆయన గదిలోకి వెళ్లి చూడటంతో విషయం తెలిసిందని, ఘటనా స్థలంలో ముగ్గురు ఉన్నట్లుగా తెలిసిందని డీసీపీ పేర్కొన్నారు. కోడెల మృతి బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని తెలిపారు. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా కోడెల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆయన నివాసంలో ఆధారాలను సేకరిస్తోంది. అలాగే కోడెల గదిలో ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మూడు బృందాలతో దర్యాప్తు: సీపీ అంజనీకుమార్ కోడెల మృతిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ‘అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. మూడు బృందాలతో దర్యాప్తు జరుపుతున్నాం. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్టు తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుంది. అలాగే కోడెల నివాసంలో ఆధారాల సేకరణ నిమిత్తం అక్కడకు చేరుకుని క్లూస్ టీమ్, టెక్నికల్ టీమ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదిక అనంతరం మృతిపై వివరాలు వెల్లడిస్తాం. బంజారాహిల్స్ పోలీసులు’ అని సీపీ పేర్కొన్నారు. చదవండి: కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అర్ధంతర మృతి.. ఆ తర్వాత తెరపైకి వచ్చిన పలు కథనాలు, వదంతులతో అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారా? లేక మరేదైనా కారణముందా?.. ప్రస్తుతం అందరినీ తొలస్తున్న ప్రశ్నలివే. కోడెల శివప్రసాదరావు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. లేదు, డాక్టర్ అయిన కోడెల ప్రమాదకరమైన ఇంజెక్షన్ చేసుకొని.. ఆత్మహత్య చేసుకున్నారని మరో కథనం ప్రచారంలోకి వచ్చింది. అసలు ఆదివారం రాత్రి కోడెల ఇంట్లో ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. రెండ్రోజుల కిందటే కోడెల హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చారని సన్నిహితులు చెప్తున్నారు. కొడుకు శివరాం పిలువడం వల్లే ఆయన హైదరాబాద్ వచ్చారని అంటున్నారు. కోడెలకు, ఆయన తనయుడికి మధ్య మనస్పర్థలు ఉన్నాయని ప్రచారమూ సాగుతోంది. అయితే ఆయన కుమారుడు శివరాం విదేశీ పర్యటనలో ఉన్నారని, రేపు ఉదయం ఆయన హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. కోడెల పిరికివారు కాదు.. రెండు రోజులుగా కోడెలకు-ఆయన కొడుకుకు మధ్య గొడవ జరిగిందని, తండ్రి కోడెలపై కొడుకు చేయి చేసుకున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కోడెల ఆత్మహత్య చేసుకొని ఉంటారు అని చెప్తున్నారు. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం కోడెలది ఆత్మహత్య కాకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకుడు, వృత్తిరీత్యా వైద్యుడు అయిన కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు అంటున్నారు. కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు! కోడెల ఆకస్మిక మృతి వ్యవహారంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? లేక గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారా? అన్నది ఒక ప్రశ్న కాగా.. ఆదివారం రాత్రి కోడెలను బసవతారకం ఆస్పత్రిలో చేర్పించిందెవరు? అనేది మరో ప్రశ్న. అంతేకాకుండా కోడెల కోడుకు బసవతారకం ఆస్పత్రికి రాలేదని తెలుస్తోంది. తండ్రి విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో ఉన్నా కొడుకు ఎందుకు రాలేదు? ప్రస్తుతం కోడెల కొడుకు ఎక్కడ ఉన్నాడు? తండ్రి మృతి విషయం అతనికి తెలుసా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కోడెలను అత్యవసరంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్చడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి సమీపంలో ఉంది. అయినా నిమ్స్ ఆస్పత్రిలో కాకుండా బసవతారకం ఆస్పత్రికి ఆయనను ఎందుకు తరలించారో తెలియాల్సి ఉంది. మొత్తానికి కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? లేక గుండెపోటుతో మృతి చెందారా? అన్నది పోస్టుమార్టం నివేదికతో వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. అయితే పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణ అయింది. -
‘కోడెల అక్రమాల్లో మీకు కూడా వాటాలున్నాయా’
సాక్షి, తిరుపతి: రుయా ఆస్పత్రిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండి పడ్డారు. సోమవారం రుయా ఆస్పత్రిని సందర్శించిన భూమన కోడెల తనయుడి బినామీలు అక్రమాలకు పాల్పడుతుంటే.. మీరు ఎందుకు సహకరిస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబీకుల అక్రమాల్లో మీకు కూడా వాటాలున్నాయా అని ప్రశ్నించారు. నెల నెలా కోడెల కుటుంబీకుల బినామీలు రూ. 40 లక్షలు దోచుకుంటుంటే.. మీరేందుకు మౌనంగా ఉన్నారని ఆస్పత్రి యాజమాన్యం మీద మండి పడ్డారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా మీ తీరు మారదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ చెప్పిన తర్వాత కూడా కోడెల కుమారుడి బినామీ ల్యాబ్‌ను ఎందుకు మూయించలేదని అధికారులను ప్రశ్నించారు. మీ చర్యల వల్ల మాకు కూడా వాటాలు అందుతున్నట్లు జనాల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయని పేర్కొన్నారు. సాయంత్రం లోగా అక్రమ ల్యాబ్‌ను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. -
కోడెల శివరామ్‌కు చుక్కెదురు
సాక్షి, గుంటూరు : పాపం పండింది.. కేసులు చుట్టుముడుతున్నాయి.. చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయి. కే–ట్యాక్స్‌లు, ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో ప్రజలను, సొంత పార్టీ నేతలను దోచుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణకు చుక్కెదురైంది. శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్ ఆథరైజేషన్‌ను రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్లో కోడెల శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లో బైక్‌ల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. 1025 బైక్‌లను టీఆర్ లేకుండా విక్రయించినట్టు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) లేకుండా బైక్‌లు డెలివరీ చేసిన శివరామ్ టీఆర్, లైఫ్ ట్యాక్స్, శాశ్వత రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జీ, హెచ్ఆర్పీఎస్ (హైసెక్యూరిటీ) నంబర్ ప్లేట్, పోస్టల్, ఇతర ఫీజుల కింద ఒక్కో బైక్‌కు సగటున రూ.8 వేల చొప్పున వసూలు చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా కోడెల శివరామ్ నొక్కేశారు. రవాణా శాఖ అధికారుల విచారణలో ఈ విషయాన్ని బైక్‌ల యజమానులు తెలిపారు. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ లేకుండా బైక్‌ల విక్రయాలు చేసి ప్రభుత్వానికి రూ.లక్షల్లో గండి కొట్టిన శివరామ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రవాణా శాఖ అధికారులు గౌతమ్ షోరూమ్‌ను సీజ్ చేయడంతో శివరామ్ కోర్టును ఆశ్రయించాడు. 576 వాహనాలను మాత్రమే టీఆర్ లేకుండా విక్రయించామని కోర్టు ముందు ఒప్పుకున్నాడు. ఈ బైక్‌ల విక్రయాలకు సంబంధించి ఎగ్గొట్టిన మొత్తాన్ని చెల్లిస్తానని శివరామ్ తెలియజేశాడు. 576 బైక్‌లకు సంబంధించి 40.26 లక్షలు ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన మొత్తాన్ని శివరామ్ ఎగ్గొట్టినట్టు రవాణా శాఖ అధికారులు నిర్ధారించారు. షాక్‌ల మీద షాక్‌లు.. కోడెల శివరామ్‌కు షాక్ మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఫర్నిచర్‌ను షోరూమ్‌లో వినియోగించుకున్నందుకు శివరామ్‌పై ఇటీవలే పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నగరంలో భాగ్యనగర్ ఎక్స్టెన్షన్ ఏరియాలో అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసు జారీ చేశారు. త్వరలో ఆ భవనాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ హీరో షోరూమ్ ఆథరైజేషన్ రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన పాపాలన్నీ పండుతున్నాయని తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడని అందరూ అంటున్నారు. మిగిలిన విక్రయాలపై విచారణ... గౌతమ్ షోరూమ్‌లో 1025 బైక్‌లు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్టు రవాణా శాఖ అధికారుల విచారణలో తెలిసింది. అయితే 576 బైక్‌లను మాత్రమే టీఆర్ లేకుండా విక్రయించినట్టు శివరామ్ ఒప్పుకున్నారు. మిగిలిన 449 బైక్‌ల విక్రయాలపై రవాణా శాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బైక్‌ల విక్రయాల్లో జరిగిన కుంభకోణంలో శివరామ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. ఒక వైపు రవాణా శాఖ, మరో వైపు పోలీస్ శాఖ అధికారులు బైక్‌ల విక్రయాల కుంభకోణంపై విచారణ వేగవంతం చేస్తుండటంతో కోడెల శివరామ్‌కు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈయనపై సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నగరంలోని నగరంపాలెం, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం శివరామ్ హైకోర్టును ఆశ్రయించాడు. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ నుంచి దొంగతనంగా తీసుకువచ్చిన ఫర్నిచర్‌ను శివరామ్ తన షోరూమ్‌లో వినియోగించాడు. -
‘కోడెల’ దోపిడీపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : అధికారం అడ్డంపెట్టుకొని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అతని తనయుడు శివరామ్ చేసిన దోపిడీపై చర్యలు తీసుకోవాలని పమిడిపాడు గ్రామ మాజీ సర్పంచ్ లాం కోటేశ్వరరావు సోమవారం కోడెల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను ఎండీగా ఉన్న ఎన్సీవీ కార్యాలయాన్ని కోడెల శివరామ్, అతని అనుచరులు గతంలో ధ్వంసం చేసి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం కలిగించారన్నారు. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోక పోగా తమపైనే తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కోడెల కుటుంబం చేసిన అరాచకాలు, దోపిడీ ప్రజలకు తెలియజేసేందుకే ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గాన్ని, వ్యాపారులను వదలకుండా కేట్యాక్స్ వసూలు చేశారన్నారు. భవన నిర్మాణాలు మొదలపెట్టిన తర్వాత అధికారులచే పనులు నిలిపివేసి యజమానుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్నారు. కమ్మ హాస్టల్ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు ఇచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ కళాశాలను అక్రమంగా అద్దెకు ఇచ్చి ప్రతి నెలా లక్షలాది రూపాయలు కోడెల శివరామ్ మెక్కాడన్నారు. చివరకు అన్న క్యాంటీన్ భోజనాలను సైతం కోడెల కుమార్తెకు చెందిన సేఫ్ కంపెనీలో పనిచేసే కార్మికులకు అమ్మి సొమ్ము చేసుకున్నారన్నారు. సొంత సామాజిక వర్గం కూడా చీదరించుకొనేలా కప్పం కట్టించుకొని, చివరకు కోడెల కుటుంబంతో సహా ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. మొదట కోడెల శివరామ్ కట్ చేయించిన కేబుల్ వైర్లను టాక్టర్‌లో తీసుకొచ్చిన లాం కోటేశ్వరరావు మాజీ స్పీకర్ ఇంటి ప్రాంగణంలో వాహనాన్ని అడ్డుగా నిలిపాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ వెంకట్రావు సిబ్బందితో వెళ్లి నచ్చచెప్పటంతో ఆందోళనను విరమించారు. -
కోడెల కుటుంబం మరో అరాచకం
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అరాచకాలు రోజుకు ఓ చోటు బయటపడుతున్నాయి. ఆయన కుటుంబం మీద పోలీస్ స్టేషన్లలో కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కోడెల కుమారుడు శివరామ్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. ఏడు లక్షలు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కోడెల ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా కోడెల శివరామ్ తిరిగి ఇవ్వటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
కోడెల శివరామ్‌పై టీడీపీ నేత ఫిర్యాదు
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడి అక్రమాలపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఓ కాంట్రాక్టు విషయంలో కోడెల శివరామ్ తనను మోసం చేశారంటూ టీడీపీ నేత శివరామయ్య పోలీసులను ఆశ్రయించారు. ఏడు లక్షల రూపాయలు ఇస్తేనే పని చేయనిస్తానని తనను బెదిరించారని, ఆ తర్వాత డబ్బు తీసుకుని కూడా కాంట్రాక్టును రద్దు చేయించారని ఆరోపించారు. ఈ మేరకు శివరామ్‌తో పాటుగా ఆయన అనుచరులపై కూడా నరసారావుపేట వన్‌టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. కాగా ‘కే ట్యాక్స్’ పేరిట తమను వేధించారంటూ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ్ అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. -
కోడెల వ్యవహారంపై టీడీపీ కీలక నిర్ణయం!
సాక్షి, అమరావతి: ‘కే టాక్స్’ వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తెపై వస్తున్న ఫిర్యాదులపై నోరు మెదపకూడదని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెలను వెనకేసుకుని వస్తే ఉన్న పరువు కూడా పోతుందని ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటే మంచిదని పలువురు పార్టీ సీనియర్ నేతలు సూచించడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తమ నుంచి డబ్బులు వసూలు చేశారని అనేక మంది బాధితులు కోడెలతో పాటు ఆయన కుమారుడు, కుమార్తెపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవన్నీ రాజకీయ వేధింపుల్లో భాగంగానే వస్తున్నాయని ఒక ప్రతినిధి బృందం డీజీపీకి ఫిర్యాదు చేయాలని రెండురోజుల క్రితం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయించారు. సోమవారం ఆ బృందం డీజీపీని కలవాలని నిర్ణయించినా టీడీపీ నాయకులెవరూ వెళ్లలేదు. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో పలువురు నాయకులు కోడెల వైఖరిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబు మిన్నకుండిపోయినట్లు సమాచారం. కోడెల కుటుంబీకులపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, చాలామంది ఆయన, ఆయన కుమారుడు, కుమార్తె అవినీతి వ్యవహారాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని టీడీపీ ఉప నేత బుచ్చయ్యచౌదరి ఆ సమావేశంలో మండిపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పార్టీ తలదూర్చితే ఆయన అవినీతి వ్యవహారాలను సమర్థించినట్లవుతుందని, మౌనంగా ఉంటే మంచిదని, లేకపోతే ఉన్న పరువు కూడా పోతుందని చెప్పడంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అందుకే కోడెలను సమర్థిస్తూ ఏ ఒక్క టీడీపీ నాయకుడు మాట్లాడేందుకు ముందుకు రావడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: కోడెల బండారం బట్టబయలు) -
కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం
సాక్షి, నరసారావుపేట: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడి అక్రమాలపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. నరసారావుపేట ఐలా బజారుకు చెందిన బసవేశ్వరరావు అనే వ్యక్తి మంగళవారం కోడెల శివరామ్‌పై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శివరామ్‌తోపాటు మరికొంతమంది తన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్స్‌తో ఆక్రమించుకున్నారని, దీనిపై కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా.. ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
విపక్షం ‘కేబుల్స్’ కట్!
-
విపక్షం ‘కేబుల్స్’ కట్!
- అధికారపక్షం దాష్టీకం నరసరావుపేటలో టీడీపీ రాళ్లదాడి - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సహా పలువురికి గాయాలు - కర్నూలులో సీపీఎం చానల్‌పైనా దాడి - పోలీసు, రెవెన్యూ అధికారులే పాత్రధారులు నరసరావుపేట/కర్నూలు : అధికారపార్టీ పూర్తిగా బరితెగిస్తోంది. గిట్టని పత్రికలు, చానళ్లపై రకరకాల మార్గాలలో ప్రతాపం చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ.. తన తప్పులను ఎత్తిచూపుతున్న కేబుల్ చానళ్ల నిర్వాహకులపైనా దాడులకు తెగబడుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ఆధ్వర్యంలో ఎన్సీవీ కేబుల్ కార్యాలయంపై జరిగిన రాళ్లదాడిలో పలువురికి గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటు పలువురు నాయకులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల సమక్షంలోనే కేబుల్ వైర్ల కత్తిరింపు జరగడం గమనార్హం కాగా.. దాడికి గురైన వైఎస్సార్సీపీ నేతలనే అదుపులోకి తీసుకోవడం అధికార పార్టీ బరితెగింపునకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు కర్నూలులోనూ తెలుగుటీడీపీ నేతులు ఇదే తరహా దాష్టీకానికి పాల్పడ్డారు. సీపీఎంకు చెందిన సీమ కమ్యూనికేషన్ చానల్‌ను రెవెన్యూ, పోలీసు అధికారులను ప్రయోగించి నిలిపివేయించింది. చానల్ కార్యాలయాన్ని సీజ్ చేయడానికి వచ్చిన పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆందోళనకారులు దిగ్బంధించడంతో ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. నరసరావుపేటలో టీడీపీ వర్గీయుల వీరంగం నరసరావుపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు ఆదివారం దాడిచేశారు. పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి రామిరెడ్డిపేటలోని కేబుల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వారిపై కూడా టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నరసరావుపేట జెడ్పీటీసీ షేక్ నూరుల్‌అక్తాబ్ తలకు, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఎ.హనీఫ్ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు చెందిన క్వాలిస్ కారు ధ్వంసమవ్వగా.. పోలీసు జీపు అద్దం పగిలిపోయింది. అయితే పోలీసులు దాడికి పాల్పడిన వారిని వదిలేసి వైఎస్సార్సీపీ వర్గీయులైన ఎన్సీవీ అధినేత నల్లపాటి రాము, పమిడిపాడు నాయకుడు లాం కోటేశ్వరరావులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించడం గమనార్హం. ఆర్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ధర్నా ఈ సంఘటనపై గాయపడిన నాయకులతో ఫిర్యాదు చేయించి ఆర్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యేడాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నాకు దిగారు. దాడి ఘటనను పూర్తిగా ఖండిం చారు. ఇంత కిరాతకమైన ప్రభుత్వాన్ని తామెప్పుడూ చూడలేదన్నారు. కర్నూలులో తీవ్రస్థాయికి కేబుల్ వార్! కర్నూలు నగరంలో కేబుల్ వార్ తీవ్రస్థాయికి చేరింది. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ సిటీ కేబుల్ ప్రసారాలు కొనసాగుతున్నాయి. ఏడాది కిందట సీపీఎం ఆధ్వర్యంలో సీమ కమ్యూనికేషన్ చానల్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు.. జిల్లాలో అనుమతులు లేకుండా ప్రసారాలు చేస్తున్నారంటూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆరు నెలల కిందట కార్యాలయాన్ని సీజ్ చేశారు. దీంతో సీమ కమ్యూనికేషన్ నిర్వాహకులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని జీ నెట్వర్క్ అనుమతులతో ప్రసారాలను పునరుద్ధరించారు. ఇదే సమయంలో జెమినీ చానల్ ప్రసారాలకు సంబంధించిన అనుమతులు సైతం సీమ కమ్యూనికేషన్‌కే దక్కడంతో రెండు వర్గాల మధ్య కేబుల్ వార్ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలోనే గతనెలలో మున్సిపల్ అధికారులు సీమ కమ్యూనికేషన్‌కు సంబంధించిన వైర్లను తొలగించడంతో ఆపరేటర్లు ఆందోళన చేశారు. తాజాగా ఆదివారం సాయంత్రం గాయత్రి ఎస్టేట్‌లో ఉన్న సీమ కమ్యూనికేషన్స్ చానల్‌పై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు జరిపారు. అధికారుల నిర్బంధం : పీస్ చానల్ ద్వారా నిషేధిత ప్రసారాలను నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు కర్నూలు ఆర్డీవో రఘుబాబు, డీఎస్పీలు రమణమూర్తి, వినోద్‌కుమార్,ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు చానల్ కార్యాలయాన్ని సీజ్ చేసేందుకు వెళ్లారు. వారిని సీపీఎం నాయకులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. మూడో అంతస్తులో చానల్ కార్యాలయం ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కిందికి దిగకుండా నిర్బంధించారు.