dcp srinivas
-
రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌కు డ్రగ్స్ పాజిటివ్: పోలీసులు
సాక్షి, హైదరాబాద్: వీఐపీలే టార్గెట్‌గా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు పేర్కొన్నారు. సోమవారం హైదర్షాకోట్లో దాడులు చేశామని, ఇద్దరు నైజీరియన్లు సహా డ్రగ్స్ అమ్ముతున్న అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 పాస్‌పోర్టులు, 10 సెల్ఫోన్లు, 2 బైక్‌లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.డ్రగ్స్‌ను నైజీరియన్ మహిళ అనోహ బ్లెస్సింగ్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఫేక్ పాస్పోర్టుతో నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. 2019 నుంచి ఆమె డ్రగ్స్ సరాఫరా చేస్తోందని తెలిపారు. ముంబై, గోవా, బెంగళూరు ద్వారా ఆరు నెలల్లో 2.6 కిలోల కొకైన్‌ను హైదరాబాద్‌కు నైజీరియన్ మహిళా తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆరు నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్ సరాఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌తోపాటు డ్రగ్స్ తీసుకున్న కిషన్ రాటి, అంకిత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్ ,హేమంత్, నిఖిల్ దావన్, మధు, రఘు కృష్ణంరాజు వెంకట్.. మరో అరుగురుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంకిత్, అమన్ ప్రీత్ సింగ్, ప్రసాద్, నిఖిల్ ధావన్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.ఇక డ్రగ్స్ సరాఫరా చేసిన అనోహా బ్లెస్సింగ్, నిజాం కాలేజీ విద్యార్థి అబీజ్ నోహం, బెంగళూరు లీడ్ కన్సల్టెన్సీ సీఈవో అల్లం సత్య వెంకట గౌతమ్, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్, సానబోయిన వరుణ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సత్య వెంకట గౌతమ్‌పై గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్పారు.డ్రగ్స్ గ్యాంగ్‌కు చెందిన కీలక సూత్రధాని ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్న అయిదుగురు నుంచి శాంపిల్స్ తీసుకోగా.. అయిదుగురికి కూడా కొకైన్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. అమన్ ప్రీత్ సింగ్‌ను పరీక్షిస్తే.. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌ను డ్రగ్స్ వినియోగదారుడిగా పరిగణిస్తున్నామని.. పెడ్లర్‌గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని అన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ వినియోగదారుడైనా నిందితుడేనని తెలిపారు. -
లాక్డౌన్: టోలీచౌకీలో కార్మికుల ఆందోళన!
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నవేళ నగరంలోని టోలీ చౌకీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమను సొంతూళ్లను పంపించాని డిమాండ్ చేస్తూ సుమారు వెయ్యిమంది వలస కార్మికులు టోలీ చౌకీ రోడ్డుపై బైఠాయించారు. లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రవాణా సౌకర్యాలు కల్పించి తమను సొంత ప్రాంతాలకు తరలించాలని ఆందోళనకు దిగారు. దాంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పారు. పైఅధికారులకు, ప్రభుత్వానికి వారి వినతిని తెలిజేస్తామని బంజారాహిల్స్ వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు. కార్మికులు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. (చదవండి: ఊరెళ్తామని 696 మంది దరఖాస్తు) వదంతుల నేపథ్యంలోనే : డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ‘ఇతర రాష్ట్రాలకు వెళ్లే కార్మికులకు స్పెషల్ బస్సులు, ట్రైన్లు వేస్తారనే వదంతులు విని కార్మికులు రోడ్డులపైకి వచ్చారు. వారిని సొంత ప్రాంతాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే అందరి వివరాలు సేకరించి ఇళ్లకు పంపిస్తామని చెప్పాం. తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి వారికి ఆహారం అందించాలని చెప్పాం. సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి కార్మికులు బయటకి వచ్చినా కూడా రవాణా సౌకర్యం లేదు. వారందరీనీ ఒప్పించి తిరిగి పంపించాం’అని డీసీపీ పేర్కొన్నారు. (చదవండి: కిరాణ షాపులే కేంద్రంగా కరోనా విజృంభణ ) -
కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు
-
కోడెల మృతిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామన్నారు. అయితే కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, పోస్ట్‌మార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కోడెల కుమార్తె ఆయన గదిలోకి వెళ్లి చూడటంతో విషయం తెలిసిందని, ఘటనా స్థలంలో ముగ్గురు ఉన్నట్లుగా తెలిసిందని డీసీపీ పేర్కొన్నారు. కోడెల మృతి బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని తెలిపారు. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా కోడెల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆయన నివాసంలో ఆధారాలను సేకరిస్తోంది. అలాగే కోడెల గదిలో ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మూడు బృందాలతో దర్యాప్తు: సీపీ అంజనీకుమార్ కోడెల మృతిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ‘అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. మూడు బృందాలతో దర్యాప్తు జరుపుతున్నాం. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్టు తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుంది. అలాగే కోడెల నివాసంలో ఆధారాల సేకరణ నిమిత్తం అక్కడకు చేరుకుని క్లూస్ టీమ్, టెక్నికల్ టీమ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదిక అనంతరం మృతిపై వివరాలు వెల్లడిస్తాం. బంజారాహిల్స్ పోలీసులు’ అని సీపీ పేర్కొన్నారు. చదవండి: కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆర్ధిక లావాదేవీల వివాదం వల్లే విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయమున్న ఐదుగురు కీలక నిందితులైన కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రాములను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్య కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ సోమవారం మీడియాకు వెల్లడించారు. భూ వివాదమే హత్యకు కారణమని... పక్కా పథకం ప్రకారమే రాంప్రసాద్‌ను హతమార్చారని...హత్యకు నెల రోజుల ముందు నుంచి రెక్కీ నిర్వహించారని డీసీపీ తెలిపారు. హత్య జరిగే సమయంలో కోగంటి సత్యం సోమాజిగూడ యశోదా ఆస్పత్రి సమీపంలోనే ఉన్నారని, హత్య జరిగిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. అయితే ఈ హత్య కేసులో తన ప్రమేయం లేకుండా ఉండేలా సత్యం జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: రాంప్రసాద్ హత్య కేసులో సంచలన నిజాలు కాగా రాంప్రసాద్, కోగంటి సత్యం చాలా ఏళ్లపాటు కలిసి వ్యాపారం చేశారని, ఈ నేపథ్యంలో కోగంటి సత్యంకు రూ.70కోట్లు రాంప్రసాద్ బాకీ పడ్డారన్నారు. అయితే రూ.23 కోట్లు చెల్లించేలా ఇరువురి మధ్య సెటిల్మెంట్ జరిగిందని, చెల్లించాల్సిన రుణాన్ని భారీగా తగ్గించినా రాంప్రసాద్ అప్పు తీర్చలేదని కోగంటి సత్యం ఆగ్రహంతో కక్ష కట్టినట్లు చెప్పారు. ఈ హత్య కోసం రూ.10 లక్షల సుపారీ ఇచ్చేందుకు సత్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అనుచరుడు శ్యాం తన వాటర్ ప్లాంట్‌లోనే తయారైనట్లు చెప్పారు. కేసులో ప్రమేయం ఉన్న మరో ఆరుగురు పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడించారు. ఇక కోగంటి సత్యంపై 21 కేసులు ఉన్నాయని తెలిపారు. చదవండి: ‘రాంప్రసాద్‌ను చంపింది నేనే’ -
జయరామ్ హత్య కేసులో 50 మందిని విచారించాం
-
కార్డన్ సెర్చ్.. పోలీసుల అదుపులో రౌడీ షీటర్లు
రాజేంద్రనగర్ (రంగారెడ్డి): రాజేంద్రనగర్‌లోని చింతల్మెట్ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పత్రాలు లేకపోవడంతో 50 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నలుగురు రౌడీ షీటర్లు, పది మంది పాత నేరస్తులు ఉన్నారని సమాచారం. -
'షారూఖ్, సల్మాన్ ఫొటోలతో ఎర'
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న చాలా రకాల సోషల్ వెబ్సైట్ల ద్వారా అమ్మాయిలను మోసగాళ్లు ట్రాప్ చేస్తున్నారని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వివాహిత రాధిక కిడ్నాప్ కేసును ఛేదించిన సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడారు. ప్రొఫైల్ పిక్చర్స్‌గా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సినిమా హీరోల ఫొటోలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. ఇలా అమ్మాయిలను తేలికగా మభ్య పెడుతున్నారని చెప్పారు. పెళ్లి అయిన పెద్దవాళ్లే ఇలాంటివారి వలలో పడుతుంటే ఇంకా పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అమ్మాయిల తల్లిదండ్రులకు సూచించారు. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈనెల 6న రాజేంద్రనగర్‌లో కిడ్నాపైన వివాహిత రాధిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సోషల్ వెబ్సైట్ల ద్వారా 2011లో నిందితుడు రిజ్వాన్ తో రాధికకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ పెళ్లి చేసుకోడానికే ఇంటి నుంచి పారిపోయారని డీసీపీ పేర్కొన్నారు. రాధికది కిడ్నాప్ కాదని, ప్రియుడు రిజ్వాన్‌తో కలిసి కోల్‌కతాకు వెళ్లారని పోలీసులు తెలిపారు. -
రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరిగింది: డీసీపీ
మేడ్చల్ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం మురారిపల్లిలోని హనీబర్గ్ రిసార్ట్స్‌లో గతరాత్రి రేవ్ పార్టీ జరిగిందని బాలనగర్ డీసీపీ శ్రీనివాస్ ధ్రువీకరించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఏడుగురు నైజీరియర్లతో పాటు మరో ఏడుగురు బౌన్సర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న రిసార్ట్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. పోలీసుల దాడుల నేపథ్యంలో పలువురు యువతులు తప్పించుకున్నారని ఆయన తెలిపారు.