సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నవేళ నగరంలోని టోలీ చౌకీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమను సొంతూళ్లను పంపించాని డిమాండ్ చేస్తూ సుమారు వెయ్యిమంది వలస కార్మికులు టోలీ చౌకీ రోడ్డుపై బైఠాయించారు. లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రవాణా సౌకర్యాలు కల్పించి తమను సొంత ప్రాంతాలకు తరలించాలని ఆందోళనకు దిగారు. దాంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పారు. పైఅధికారులకు, ప్రభుత్వానికి వారి వినతిని తెలిజేస్తామని బంజారాహిల్స్ వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు. కార్మికులు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
(చదవండి: ఊరెళ్తామని 696 మంది దరఖాస్తు)
వదంతుల నేపథ్యంలోనే : డీసీపీ ఏఆర్ శ్రీనివాస్
‘ఇతర రాష్ట్రాలకు వెళ్లే కార్మికులకు స్పెషల్ బస్సులు, ట్రైన్లు వేస్తారనే వదంతులు విని కార్మికులు రోడ్డులపైకి వచ్చారు. వారిని సొంత ప్రాంతాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే అందరి వివరాలు సేకరించి ఇళ్లకు పంపిస్తామని చెప్పాం. తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు చెప్పారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి వారికి ఆహారం అందించాలని చెప్పాం. సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి కార్మికులు బయటకి వచ్చినా కూడా రవాణా సౌకర్యం లేదు. వారందరీనీ ఒప్పించి తిరిగి పంపించాం’అని డీసీపీ పేర్కొన్నారు.
(చదవండి: కిరాణ షాపులే కేంద్రంగా కరోనా విజృంభణ )
Comments
Please login to add a commentAdd a comment