tolichowki
-
హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ప్రిజం పబ్ ఫైరింగ్ మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. టోలీచౌకిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్ధం విన్నామంటూ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.ఇరువర్గాల మధ్య ఘర్షణ మాత్రమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. భూ వివాదంలో అక్తర్ ఇంటికి షకీల్, అతని అనుచరులు చేరుకున్నారు. ప్లాట్ విషయంలో ఇరువర్గాలకు చెందిన వారు గొడవ పడ్డారు. ఇదే సమయంలో ఫైరింగ్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఫేస్బుక్ పరిచయం.. వివాహితకు శాపం -
Tolichowki: మినర్వా స్వీట్లో మోడల్స్ సందడి (ఫోటోలు)
-
Virat Kohli: నా జీవితంలోనే బెస్ట్ సర్ప్రైజ్.. భయ్యాను చూడగానే హత్తుకున్నా: సిరాజ్
Mohammed Siraj- Virat Kohli: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ హైదరాబాదీ బౌలర్‌కు కోహ్లి అందించిన ప్రోత్సాహం మరువలేనిది. కష్ట సమయంలో తనకు భయ్యా(కోహ్లి) అండగా నిలబడ్డాడంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పాడు కూడా! ఇక ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో కోహ్లి(15 కోట్లు)తో పాటు సిరాజ్‌ను కూడా ఆర్సీబీ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. పర్సు నుంచి 7 కోట్లు ఖర్చు చేసి అతడిని అట్టిపెట్టుకుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సిరాజ్ తన ఐపీఎల్ జ్ఞాపకాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి తనను సర్ప్రైజ్ చేశాడంటూ పాత ఘటనను గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఆర్సీబీలోని ప్రతి ఆటగాడిని ఓరోజు మా ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాను. తర్వాత హోటల్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లాను. అయితే, నేను భయ్యాను పిలిచినపుడు.. ‘‘నాకు వెన్ను నొప్పి ఉంది మియాన్. నేను మీ ఇంటికి రాలేను’’ అన్నాడు. సరే.. విశ్రాంతి తీసుకో భయ్యా అని చెప్పాను. అంతకంటే నేనేం చేయగలను మరి! ఆ తర్వాత ఒక్కొక్కరుగా మా ఇంట్లోకి వచ్చారు. పార్థివ్ పటేల్ భాయ్, చహల్ భాయ్ కనిపించారు. ఆ సమయంలో కోహ్లి భయ్యా కారు దిగడం చూశాను.వ వెంటనే వెళ్లి భయ్యాను హత్తుకున్నాను. నా జీవితంలో బెస్ట్ సర్ప్రైజ్ అంటే ఇదే! ఎందుకంటే భయ్యా వెన్ను నొప్పి.. రాలేను అని చెప్పి మా ఇంటికి వచ్చాడు కదా! ఇక విరాట్ కోహ్లి టోలీ చౌకీకి వచ్చాడన్న విషయం పెద్ద వార్త అయింది మరి!’’ అంటూ సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగ వీరిద్దరు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాలో సభ్యులుగా ఉన్నారు. ఆర్సీబీ గతంలో షేర్ చేసిన వీడియో The RCB Podcast powered by Kotak Mahindra Bank: Trailer 10 episodes, plenty of interesting and never heard before stories about the tournament that made them the superstars they are! (1/n)#PlayBold #WeAreChallengers #TheRCBPodcast pic.twitter.com/MWPQG3IEwH — Royal Challengers Bangalore (@RCBTweets) February 1, 2022 -
భర్తతో విడాకులు, మరో వ్యక్తితో ప్రేమ, ప్రియుడు నిర్లక్ష్యం చేస్తున్నాడని
సాక్షి, గోల్కొండ: కుటుంబ కలహాలతో పాటు ప్రియుడు నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సబా(31) తన కుటుంబ సభ్యులతో కలిసి టోలిచౌకి రాహుల్ కాలనీ ఫేజ్–1లో ఉంటోంది. మొదటి భర్తతో విడాకులు అయ్యాయని స్థానికులు తెలిపారు. కొన్ని రోజులుగా మరో వ్యక్తితో కలిసి ఉంటోంది. ఇటీవల తాను ప్రేమించిన వ్యక్తి కొద్ది రోజులుగా నిర్లక్ష్యం చేస్తున్నాడని, కొద్ది రోజులుగా ఆమె బాధపడుతోంది. దీనికి తోడు కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయి. దీంతో గురువారం రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నెల్లూరు జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థి దారుణ హత్య? -
మామ్స్ హోమ్ మేడ్ ఫుడ్.. ఫుల్‌టైమ్ వంట
‘అమ్మ చేతి వంట ఎప్పుడూ రుచిగానే ఉంటుంది. అమ్మ మనసు పంచే ప్రేమలా’ అంటారు హైదరాబాద్ టోలీచౌకీలో ఉంటున్న జరీనా షా. పన్నెండేళ్లుగా మామ్స్ హోమ్ మేడ్ ఫుడ్ పేరుతో హోమ్ షెఫ్‌గా రాణిస్తున్న జరీనా పిల్లల స్నేహితులు అడిగారని ఇంటి నుంచే ఫుడ్ బిజినెస్‌ను మొదలుపెట్టారు. దీనినే ఉపాధిగా మలుచుకొని ఉద్యోగులకు, ఫంక్షన్లకు ఆర్డర్ల మీద వంటలు చేస్తున్నారు. అంతటితో ఆగిపోకుండా మాల్స్, కైట్ ఫెస్టివల్, లిటరరీ ఫెస్టివల్స్ అంటూ నగరంలో జరిగే కార్యక్రమాల్లో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఇంటి వంటను రుచిగా అందిస్తున్నారు. ‘వంట చేయడం అంటే ఇష్టం, చేసిన వంటను నలుగురు మెచ్చుకుంటూ తింటూ ఉంటే మనసుకు చాలా ఆనందం కలుగుతుంది’ అంటారు జరీనా. రెండు వందల మందికైనా టిఫిన్లు, భోజనాలను సిద్ధం చేసే పనిలో రోజంతా తీరికలేకుండా ఉంటారామె. (కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్ చేశారా) ఆరుగురు కోడళ్లలో ఒకరిగా.. యాభై నాలుగేళ్ల తన జీవితం గురించి ప్రస్తావిస్తూ ‘‘ముప్పై ఏళ్లుగా వంటలోనే మమేకం అయి ఉన్నాను. పుట్టింట్లో ఉన్నప్పుడు వంటలో అసలు ఓనమాలు కూడా తెలియవు. అత్తింటిలో అడుగుపెట్టాకే వంట నేర్చుకున్నాను. ఆరుగురు కోడళ్లలో రెండవకోడలిని. అందరం కలిసి పనులు చేసుకుంటూ ఉండేవాళ్లం. నా చేతి వంట బాగుంటుందని మా అత్తగారు గొప్పగా చెబుతుండేవారు. ఇంటిల్లిపాది మెచ్చుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉండేది. మా కుటుంబసభ్యులు అందరు కలిస్తేనే రెండు వందల మంది అయ్యేవారు. పిల్లలు కాలేజీలకు వచ్చే సమయానికి వేరు కాపురాలు అయిపోయాయి. పిల్లలకు లంచ్ బాక్సులు కట్టి ఇస్తే, వాటిని వాళ్ల స్నేహితులు తిని తెగ మెచ్చుకునేవారట. వారి కోసం కూడా స్వయంగా బాక్సులు కట్టి పంపేదాన్ని. (చికెన్- పాలకూర ఫ్రిట్టర్స్ ఎలా తయారు చేయాలో తెలుసా?) ఇదే విధానం వాళ్లు ఉద్యోగాల్లోకి వచ్చాక కూడా కొనసాగింది. పిల్లలు, వారి స్నేహితులు అడిగారు కదా కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ చేసి ఇచ్చేదాన్ని. ఆర్డర్లు పెరుగుతుండటంతో దీనినే ఫుల్‌టైమ్ జాబ్‌గా ఎంచుకున్నాను. ఉద్యోగుల కోసం టిఫిన్లు, లంచ్ బాక్సులు, చిన్న చిన్న పార్టీలకు ఆర్డర్స్ మీద వెజ్, నాన్‌వెజ్ వంటకాలను అందిస్తూ వచ్చాను. నోటి మాటగానే చాలా మందికి తెలిసిపోయింది. మా ఏరియా నుంచే కాకుండా నగరంలో మిగతా చోట్ల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్లు వస్తాయి. హోమ్మేడ్ హలీమ్‌తో పాటు బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాలు, ఖద్దూకా ఖీర్.. వంటి అన్ని రకాల స్వీట్ల తయారీ ఉంటుంది. నా వంట ద్వారా నేను ఉపాధి పొందడమే కాదు, దీని ద్వారా మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నందుకు తృప్తిగానూ ఉంటుంది. ఉచితంగా ఆహారం ఇప్పుడు పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆర్థిక అవసరం ఏమీ లేదు. పిల్లలు ఇప్పుడు కూర్చో, ఎందుకు కష్టపడతావు అంటారు. కానీ, రుచికరమైన ఆహారాన్ని తయారుచేయడంపై ఉన్న ఇష్టమే ఇంకా ఈ బిజినెస్‌లో కొనసాగేలా చేస్తోంది. రోజులో ఎక్కువ గంటలు నిల్చొనే పనులు చేయడం వల్ల కాలు నొప్పి సమస్య వచ్చిందని, ఇంట్లో ఈ పనిని వదిలేయమంటారు. కానీ, మనసు ఒప్పుకోదు. నేను వంటలు చేస్తాను అని మా చుట్టుపక్కల వారికి తెలుసు కాబట్టి, పేదవాళ్లు ఎవరైనా వచ్చి భోజనం అడుగుతారు. నేనీ పని ఆపేస్తే వారికి ఎలా సాయం చేయగలను. దీని ద్వారా రోజులో కొంతమంది పేదవారికైనా నా చేతులతో వండిన ఇంటి భోజనాన్ని అందిస్తాను కదా అనిపిస్తుంది. స్వయంగా సిద్ధం వంటకు రుచి రావాలంటే అందులో వాడే మసాలా దినుసుల వాడకం ముఖ్యం. సన్నని మంట మీద సువాసన వచ్చేలా వేయించిన మసాలా దినుసులను ఏ రోజుకు ఆ రోజు నేనే స్వయంగా తయారుచేసుకుంటాను. వంటకాలలో మిక్సీ వాడకం అంటూ ఉండదు’ అని చెప్పే జరీనా కరోనా పాజిటివ్ వచ్చినవారు కోరితే అన్ని రోజులూ ఉచితంగా ఫుడ్ డెలివరీ చేశారు. ‘చేసిన సాయం చెప్పుకుంటే దేవుడు హర్షించడు, నాకు ఆ శక్తిని ఇచ్చినందుకు వారికే నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను’ అంటారామె. – నిర్మలారెడ్డి -
మామ చేతిలో అల్లుడు దారుణహత్య
హైదరాబాద్: పిల్లనిచ్చిన మామ చేతిలో అల్లుడు దారుణహత్యకు గురైన ఘటన ఆదివారం రాయదుర్గంలో చోటుచేసుకుంది. వివరాలు.. టోలిచౌకీకి చెందిన షేక్ సల్మాన్(20) మణికొండలో బ్లాక్‌బర్డ్ బ్యూటీ పేరుతో టైలర్ షాపు నిర్వహిస్తున్నాడు. కాగా గోల్కొండలోని అక్బర్‌పురలో నివసిస్తున్న ఫరహాన అనే మహిళతో 2019లో షేక్ సల్మాన్‌కు వివాహమైంది. కొంతకాలం వీరిద్దరు బాగానే ఉన్నా.. గత 7 నెలల నుంచి సల్మాన్ భార్యను శారీరకంగా హింసకు గురి చేయడమేగాక తీవ్రంగా కొట్టేవాడు. దీంతో ఫరహాన తండ్రికి విషయం చెప్పడంతో సల్మాన్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే సల్మాన్ వారి మాటలను పట్టించుకోకుండా ఫరహానను మరింతగా హింసించడం మొదలుపెట్టాడు. దీంతో సల్మాన్‌ను అంతమొందించాలని భావించిన అతని మామ తన బంధువులతో కలిసి మణికొండ ఏరియాలోని అతని టైలర్ షాపు వద్దే కిడ్నాప్ చేశాడు. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నక్కలపల్లి చెరువు వద్దకు తీసుకెళ్లి సల్మాన్ గొంతుకు వైరు బిగించి.. తలపై బండరాయితో మోది హత్యకు పాల్పడ్డాడు. కాగా షేక్ సల్మాన్ కనిపించడం లేదని అతని తరపు బంధువులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు నక్కలపల్లి చెరువు వద్ద శవంగా కనిపించిన వ్యక్తి సల్మానే అని నిర్థారణకు వచ్చి బంధువులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
టోలీచౌకీ వాసి దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు హైదరాబాద్ నగరంలో టోలీచౌకీకి చెందిన షేక్ సల్మాన్‌గా పోలీసులు గుర్తించారు. వైరుతో గొంతు బిగించి, తలపై రాయితో కొట్టి చంపిన ఆనవాలు కనిపిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం సహకారంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, షేక్ సల్మాన్‌ను తానే హతమార్చానని ఓ వ్యక్తి రాయదుర్గం పోలీసులకు లొంగిపోయాడు. -
ఇడిసిపెడితే నేను పోత సారు..
గోల్కొండ/గచ్చిబౌలి/శంషాబాద్: వలస కార్మికులు రోడ్డెక్కారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని టోలిచౌకీ, గచ్చిబౌలి, శంషాబాద్‌లో ఆందోళనకు దిగారు. లాక్డౌన్ కారణంగా చేసేందుకు పని లేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా, జార్ఖండ్, కర్ణాటకలతో పాటు బిహార్ రాష్ట్రాలకు చెందిన వేల మంది కార్మికులు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం వలస కూలీలకు అందిస్తున్న సాయం తమకు అందడం లేదని, ఉండటానికి స్థలం లేక పడరాని పాట్లు పడుతున్నామని బిహార్‌కు చెందిన అభయ్ అనే భవన నిర్మాణ కార్మికుడు వెల్లడించాడు. రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడటంతో నో వర్క్, నో పే అంటూ వాటి యజమానులు తమను గెంటేశారన్నారు. పోలీసులు పుట్‌పాత్‌లపై పడుకోనివ్వడం లేదని, టోలిచౌకీ పరిసరాల్లో ఒక్క నైట్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మరోవైపు గచ్చిబౌలిలోని ఎల్అండ్టీ లేబర్ కాలనీలో కార్మికులు సైతం ధర్నాకు దిగారు. తమకు జీతాలిచ్చి, బస్సులు ఏర్పాటు చేస్తే సొంతూళ్లకు వెళ్లిపోతామంటూ ఆందోళన చేశారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయంలోని విస్తరణ పనులు చేస్తున్న వలస కార్మికులు కూడా తమను సొంతూళ్లకు పంపించాలంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయాచోట్లకు వెళ్లి ఆందోళనకారులకు సర్దిచెప్పారు. కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తామని.. త్వరలోనే ప్రత్యేక వాహనాల ద్వారా స్వస్థలాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఇక్కడ ఉండలేం.. రోడ్డెక్కిన గ్రానైట్ కార్మికులు.. సర్దిచెప్పిన అధికారులు ‘లాక్‌డౌన్‌తో పనుల్లేక 40 రోజులుగా అవస్థలు పడుతున్నాం. ఇక ఇక్కడ ఉండలేం. మా రాష్ట్రాలకు తిరిగి వెళ్తాం. వెంటనే అనుమతి ఇవ్వండి’ అంటూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని పారిశ్రామిక ప్రాంతంలో వందలాది మంది కార్మికులు ఆదివారం రోడ్డెక్కా రు. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మ ధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వందల సంఖ్యలో గ్రానైట్, వాటికి అనుబంధంగా ఉన్న అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో పనులు లేకపోవడంతో ప్రభుత్వం, దాతలు అందించే ఆహారం, వితరణతో నెట్టుకొస్తున్నారు. ఇక పరిశ్రమలు తెరుస్తారో.. లేదోనని కార్మికులు ఆందోళన చెందారు. తమ ప్రాంతాలకు ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకున్న కార్మికులు ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ నాగండ్ల కోటి, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ రాజేష్, వీఆర్వో బాలయ్య, అర్బన్ సీఐ వెంకన్నబాబు, మైనింగ్ ఏజీ గంగాధర్ కార్మికులకు నచ్చజెప్పారు. గ్రానైట్ పరిశ్రమలను నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సోమవారం నుంచి పనులు చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని సర్ది చెప్పారు. అప్పటి వరకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో శాంతించారు. ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రోడ్డుపై ఆందోళనకు దిగిన గ్రానైట్ కార్మికులు -
లాక్డౌన్: టోలీచౌకీలో కార్మికుల ఆందోళన!
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నవేళ నగరంలోని టోలీ చౌకీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమను సొంతూళ్లను పంపించాని డిమాండ్ చేస్తూ సుమారు వెయ్యిమంది వలస కార్మికులు టోలీ చౌకీ రోడ్డుపై బైఠాయించారు. లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రవాణా సౌకర్యాలు కల్పించి తమను సొంత ప్రాంతాలకు తరలించాలని ఆందోళనకు దిగారు. దాంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పారు. పైఅధికారులకు, ప్రభుత్వానికి వారి వినతిని తెలిజేస్తామని బంజారాహిల్స్ వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు. కార్మికులు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. (చదవండి: ఊరెళ్తామని 696 మంది దరఖాస్తు) వదంతుల నేపథ్యంలోనే : డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ‘ఇతర రాష్ట్రాలకు వెళ్లే కార్మికులకు స్పెషల్ బస్సులు, ట్రైన్లు వేస్తారనే వదంతులు విని కార్మికులు రోడ్డులపైకి వచ్చారు. వారిని సొంత ప్రాంతాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే అందరి వివరాలు సేకరించి ఇళ్లకు పంపిస్తామని చెప్పాం. తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి వారికి ఆహారం అందించాలని చెప్పాం. సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి కార్మికులు బయటకి వచ్చినా కూడా రవాణా సౌకర్యం లేదు. వారందరీనీ ఒప్పించి తిరిగి పంపించాం’అని డీసీపీ పేర్కొన్నారు. (చదవండి: కిరాణ షాపులే కేంద్రంగా కరోనా విజృంభణ ) -
డబ్బులిస్తే.. ‘రాసి’పెడతారు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని టోలిచౌకి సూర్యనగర్ కాలనీలో ఉన్న న్యూ మదీన జూనియర్ కాలేజీ (సెంటర్ కోడ్– 60237) కేంద్రంగా గుట్టుగా సాగుతోన్న మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం కాలేజీపై దాడిచేసిన ప్రత్యేక బృందం.. కాలేజీ ప్రిన్సిపాల్, ముగ్గురు పరిపాలన విభాగం సిబ్బంది, ఆరుగురు విద్యార్థుల్ని పట్టుకుంది. ఇదీ జరుగుతున్న తంతు.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు బోర్డు నుంచి అనుమతి పొందిన కాలేజీల్లో న్యూ మదీన జూనియర్ కాలేజీ ఒకటి. ఇక్కడ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో కొందరికి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ షోయబ్ తన్వీర్ కచ్చితంగా పాస్ చేయిస్తానంటూ ఎర వేశాడు. ఒక్కో సబ్జెక్టుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఆయా పరీక్షల ప్రశ్నపత్రాలు స్థానిక పోలీసుస్టేషన్లలో ఉంటాయి. ఓఎంఆర్ షీట్‌తో కూడిన ఆన్సర్ షీట్స్ మాత్రం పరీక్ష కేంద్రానికే చేరతాయి. అక్కడ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంటర్మీడియట్ బోర్డ్ వీటిని అందిస్తుంది. వీటిని బోర్డుకు చెందిన ఎగ్జామినర్ పర్యవేక్షణలో ఆయా సెంటర్లకు చెందిన వారు సిద్ధం చేస్తారు. దీన్నే తన్వీర్ అనుకూలంగా మార్చుకున్నాడు. ప్రతి ప్రశ్నపత్రంతోనూ జతచేసి ఉండే ఆన్సర్‌షీట్స్ బుక్‌లెట్‌ను ముందు రోజు రాత్రే వీళ్లు మార్చేస్తున్నారు. ఓఎంఆర్ షీట్‌కు డమ్మీ జవాబుపత్రాన్ని జత చేస్తున్నారు. పరీక్ష రాసేటపుడు విద్యార్థి బుక్లెట్పై ఉండే ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్ పేపర్‌తో పాటు ఈ బుక్లెట్ నంబర్ కూడా వేయాలి. మదీన జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తమతో ఒప్పందం కుదుర్చుకున్న వారికి ఓఎంఆర్ షీట్స్‌తో డమ్మీ బుక్లెట్స్ ఇస్తున్నాడు. అదే సమయంలో ప్రిన్సిపాల్.. అసలు బుక్‌లెట్స్‌ను కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సయ్యద్ కలీముద్దీన్, షబానా బేగం, జాహెదా షరీన్‌కు ఇచ్చి పుస్తకాల్లో చూసి రాయిస్తున్నాడు. ఆయా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలూ వీరికి ఇస్తున్నాడు. పరీక్ష ముగిశాక ఈ అసలు బుక్‌లెట్స్‌ను ఒప్పం దం చేసుకున్న విద్యార్థులకు అందించి, వాటిని ఓఎంఆర్ షీట్ కు జతచేయిస్తూ దానిపై ఆ బుక్లెట్ నంబర్ వేయిస్తున్నాడు. అదుపులో పది మంది.. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు దీనిపై పక్కా సమాచారం అందుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం న్యూ మదీన కాలేజీపై దాడి చేసింది. ఆ సమయంలో బుక్‌లెట్స్‌లో పరీక్షలు రాస్తున్న ముగ్గురు సిబ్బందితో పాటు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద లభించిన ఆధారాలను బట్టి ఒప్పందం చేసుకున్న విద్యార్థులైన అహ్మద్ నజీర్ (సెయింట్ జోసఫ్ జూనియర్ కాలేజీ–టోలిచౌకి), మహ్మద్ అహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఇక్బాల్ అబ్బాస్, ఫిరాజ్ మీర్జా (నియోసిస్ జూనియర్ కాలేజీ), మహ్మద్ రియాన్ నజీర్ (న్యూ రిలయన్స్ జూనియర్ కాలేజీ), నిసార్ అహ్మద్ (నారాయణ జూనియర్ కాలేజీ)ను పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు కామర్స్, నలుగురు కెమిస్ట్రీ పరీక్షలు రాయిస్తున్నారని గుర్తించారు. మరో ఇద్దరు విద్యార్థులైన మహ్మద్ అలీఖాన్, అబుబకర్ అబ్దుల్లా బిన్ మహఫూజ్ కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారిని టాస్క్‌ఫోర్స్ బృందం గోల్కొండ పోలీసులకు అప్పగించింది. ఈ తరహాలో మరికొందరికీ ప్రిన్సిపాల్ పరీక్షలు రాయించినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగానూ దర్యాప్తు చేపట్టారు. యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ మూకుమ్మడి మాల్ ప్రాక్టీస్ ఘటన నేపథ్యంలో న్యూ మదీన జూనియర్ కాలేజీ యాజమాన్యానికి ఇంటర్ బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేసింది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలో మాల్‌ప్రాక్టీస్ వాస్తవమేనని తేలిందని, దీంతో 8 మందిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్ చేశా మంది. యాజమాన్యం తమ తప్పిదాన్ని అంగీకరించిన నేపథ్యంలో కాలేజీ అనుబంధ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని యాజమాన్యానికి నోటీసు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. -
వాట్సాప్ కాల్లో ట్రిపుల్ తలాక్
-
‘తలాక్..తలాక్..తలాక్’ ఫోన్ కట్
సాక్షి, హైదరాబాద్ : వాట్సాప్ కాల్ చేసి భార్యకు త్రిపుల్ తలాఖ్ చెప్పాడో భర్త. తమ వివాహబంధం నేటితో ముగిసిపోయిందంటూ ఫోన్ పెట్టేశాడు. నివ్వెరపోయిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. వివరాలు.. యూసుఫ్ గూడకు చెందిన సమియాభానుకు టోలిచౌకికి చెందిన మహ్మద్ మెజిమిల్ షరీఫ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఓ పాప జన్మించిన తర్వాత కలతలు మొదలయ్యాయి. సమియాను వదిలించుకుని షరీఫ్ మరో పెళ్లి చేసుకోవాలన్నాడు. నిత్యం వేధింపులకు గురిచేయడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. టోలిచౌకిలోని ఎం.డి.లైన్స్‌లో గల జెమ్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్‌గా పనిచేసే షరీఫ్ నుంచి సమియాకు ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది. భర్త మనస్సు మారిందని భావించిన ఈ ఇల్లాలు సంబరపడిపోతూ ఫోన్ రిసీవ్ చేసుకుంది. అంతలోనే పిడుగులాంటి వార్త. ‘ఇక నుంచి నీకు, నాకు ఏ సంబంధం లేదు.. తలాఖ్, తలాఖ్, తలాఖ్’ అంటూ షరీఫ్ ఫోన్ పెట్టేశాడు. ఊహించని పరిణామంతో నిర్ఘాంతపోయిన ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు దర్నాకు దిగింది. భర్త పనిచేసే పాఠశాల ఎదుట కూడా సమియా ఆందోళనకు దిగడంతో అక్కడి నుంచి పరారయ్యాడు షరీఫ్. తనలా మరో ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా కాపాడాలని సమియా కోరుతోంది. చట్టరిత్యా ట్రిబుల్ తలాక్ చెల్లదని.. అతనిపై వరకట్న వేధింపులకు సంబంధించి ఐపీసీ 498 ఏ, 406, 506, డీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. షరీఫ్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. -
3వ తరగతి బాలికపై లైంగిక దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని టోలిచౌకిలో దారుణం చోటుచేసుకుంది. మూడవ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఈ ఘటన టోలిచౌకిలోని ఆజాద్ ఇంటర్ నేషనల్ స్కూల్లో జరిగింది. స్కూలు యాజమాన్యంలోని ఓ వ్యక్తి తమ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. -
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఈవ్‌టీజర్..
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తూ, వారితో సీక్రెట్‌గా దిగిన ఫోటోలను ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరిస్తున్న ఓ యువకుడిని బుధవారం షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన అల్తాన్ ఖాన్ తరచూ అమ్మాయిలను వేధించేవాడు. వారితో రహస్యంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. అల్తాన్ ఖాన్ చర్యలకు విసుగు చెందిన ఓ అమ్మాయి షీ టీం పోలీసులను ఆశ్రయించింది. టోలీచౌకి చౌరస్తా వద్ద మాటు వేసిన పోలీసులు అల్తాన్ ఖాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో అమ్మాయిలను వేధించిన కేసులో అల్తాన్ ఖాన్ అరెస్టయిన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
టోలిచౌకిలో దారుణం
-
దొంగతనానికి వచ్చి..ఇంటికి నిప్పు?
హైదరాబాద్‌సిటీ: టోలిచౌకి పరిధిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో మంటలు ఎగసిపడటంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. దొంగతనానికి వచ్చిన దుండగులు చోరీ అనంతరం నిప్పుపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఇంటి యాజమాని సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకులపై ప్రజల దాడులు
-
బ్యాంకులపై ప్రజల దాడులు
నగదు కష్టాలు తీవ్రతరమవుతుండటంతో అసహనానికి గురవుతున్న సాధారణ ప్రజానీకం బ్యాంకు శాఖలపై దాడికి కూడా పాల్పడుతున్నారు. నగదు అందించలేని బ్యాంకుల వద్ద నిరసనలకు దిగుతున్నారు. హైదరాబాద్‌లోని టోలిచౌక ప్రాంతంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమకు అవసరమైన నగదును అందించడంలో విఫలమైనందుకు నిరసనగా.. ప్రజలు రోడ్డును బ్లాక్ చేశారు. బస్సులను నిలిపివేశారు. ఇటు ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గురుద్వారా ట్రాహాలోని ఓ కోఅపరేటివ్ బ్యాంకు తమ కస్టమర్లకు సరిపడ నగదు అందించలేదని తెలుసుకున్న భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) సభ్యులు ఆ బ్యాంకు వద్దనున్న రోడ్డును బ్లాక్ చేశారు. బ్యాంకు తలుపును కూడా బీకేయూ సభ్యులు నిన్న సాయంత్రం నుంచి లాక్ చేసి ఉంచారు. అదేవిధంగా తనభావాన్లోని ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ వద్ద కస్టమర్లు నిరసనకు దిగడంతో ఆ శాఖ కూడా మూతపడింది. మొరాబాద్ స్టేట్ బ్యాంకుపై ఏకంగా స్థానికులు దాడిచేశారు. నో క్యాష్ బోర్డు పెట్టడంతో ఆగ్రహానికి లోనైన వారు ఈ దాడికి పాల్పడ్డారు. ఇదేమాదిరి ఘటనలు పలు బ్యాంకు శాఖల వద్ద చోటుచేసుకున్నాయి. ఇన్ని రోజులు సహనంతో వేచిచూసిన ప్రజానీకం, కరెన్సీ లేని కష్టాలు తీవ్రతరమవుతుండటంతో ఆగ్రహానికి లోనవుతున్నారు. బ్యాంకుల వద్ద ఎన్నిరోజులు నిల్చున్నా పరిస్థితి మారకపోతుండటంతో అక్కడే నిరసనలకు దిగుతున్నారు. మరోవైపు ప్రభుత్వం, ఆర్బీఐ మాత్రం తమ వద్ద ప్రజలకు అవసరమైన నగదు ఉందంటూ పలు ప్రకటనలు గుప్పిస్తోంది. బ్యాంకుల వద్ద జరుగుతున్న ఈ ఘటనలతో బ్యాంకుల బయట సెక్యురిటీని ప్రభుత్వం భారీగా పెంచుతోంది. -
ఖాతాదారులపై లాఠీచార్జ్.. ఉద్రిక్తం
-
ఖాతాదారులపై లాఠీచార్జ్.. ఉద్రిక్తం
హైదరాబాద్: కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు ప్రజల్లో అసహనం రేపుతున్నాయి. హైదరాబాద్‌లోని టోలిచౌకి ఎస్బీఐ బ్రాంచ్ వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాంకు వద్ద బారులు తీరిన ఖాతాదారులను నియంత్రించే సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనైన ఖాతాదారులు అక్కడి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో టోలిచౌకి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని.. ట్రాఫిక్ జాం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
షేక్‌పేట్‌లో బోల్తా పడిన కారు: ఒకరి మృతి
హైదరాబాద్: మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన నగరంలోని టోలీచౌకీ సమీపంలోని షేక్‌పేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హకీంపేట,టోలిచౌకీలో పోలీసుల కార్డెన్‌సెర్చ్
-
రైడ్ ఆనందం.. ఆరోగ్యం..
అనగనగా ఓ రాకుమారుడు... అని కథ మొదలెట్టగానే ఠక్కున మదిలో మెదిలేది గుర్రం ఎక్కి అతగాడు వస్తున్న ఊహా చిత్రమే. సొగసైన గుర్రం పరుగు... దానిని రయిమున దూకిస్తున్న రాకుమారుడు... అందులో ఎంత రాజసం..! లైఫ్‌లో ఒక్కసారన్నా గుర్రమెక్కి స్వారీ చేయాలలని అనిపించక మానదు. ఆ ఊహను నిజం చేసి... గుర్రానికి కళ్లెం వేసి... స్వారీ చేసే అవకాశం కల్పిస్తోంది టోలీచౌకీలోని ‘హైదరాబాద్ హార్స్ రైడింగ్ స్కూల్’. దీని వల్ల ఆనందమే కాదు... సంపూర్ణ ఆరోగ్యమూ కలుగుతుందనేది నిపుణుల వూట... చాలా ఖర్చుతో కూడుకున్న ఈ రాచ క్రీడకు సిటీలో క్రేజ్ బాగా పెరుగుతోంది. నగరవాసులే కాదు... ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రైడింగ్ నేర్చుకొంటున్న ఔత్సాహికులు వేలల్లోనే ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రొఫెషనల్స్, వారి పిల్లలు, సామాన్యులు సైతం దీనికి క్యూ కడుతున్నారు. రైడింగ్ వల్ల ఎంజాయ్‌మెంటే కాదు... పరిపుష్టమైన ఆరోగ్యం కూడా కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘సంపన్నులకే పరిమితమైన ఈ క్రీడను సామాన్యులకూ చేరువ చేయూలనేది నా ఆకాంక్ష. అందుకే విదేశాలకు వెళ్లి కష్టపడి డబ్బు సంపాదించా. దాంతోనే ఈ స్కూలు మొదలు పెట్టా. ప్రభుత్వం సాయువుందిస్తే వురింత వుందికి ఈ క్రీడ చేరువ అవుతుంది’ అంటారు హైదరాబాద్ హార్స్ రైడింగ్ స్కూల్ నిర్వాహకుడు అబ్దుల్ వాహబ్. నగరవాసులతో పాటు ఇతర జిల్లాల వారు, కొరియూ, స్కాట్లాండ్ నుంచి కూడా ఇక్కడకు ట్రైనింగ్‌కు వస్తుంటారని ఆయున చెప్పారు. ‘దాదాపు రెండు వేల వుందికి పైగా ఇందులో శిక్షణ పొందుతున్నారన్నారు. హార్స్ రైడింగ్‌తో వుుడిపడిన షో జంపింగ్, హార్స్ పోలో, స్టాలిష్ వాక్, టెన్ పెగ్గింగ్ గేమ్స్ కూడా నేర్చుకోవచ్చన్నారు. ఇతర సాహస క్రీడలు కూడా... హార్స్ రైడింగ్‌తో పాటు రైఫిల్ షూటింగ్, ప్యారా గ్లైడింగ్, ఆర్చెరీ లాంటి సాహస క్రీడలు సవ్ముర్ క్యాంప్‌లో నేర్పిస్తారు. హార్స్ ఫీల్డ్‌లో ఆసక్తి ఉంటే చక్కటి కెరీర్ అవకాశాలున్నాయి. విదేశాలలో 2 లక్షల నుంచి 20 లక్షల వరకు సంపాదించవచ్చు. ట్రైనింగ్ తీసుకున్నవారికి విదేశాల్లో ప్లేస్మెంట్ సర్వీస్ కూడా కల్పిస్తున్నారిక్కడ. ఈ స్కూల్లో హార్స్ ట్రెయినింగ్, హార్స్ ట్రేడింగ్, హార్స్ బ్రీడింగ్, హాస్టల్ సదుపాయం ఉన్నారుు. ఒక్కో గుర్రానికి నెలకు రూ.12 నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతుంది. ఒక్కో గుర్రం ధర లక్ష నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ స్కూల్లో చేరాలనుకొంటే... ‘హెచ్హెచ్ఆర్ఎస్.ఇన్’ వెబ్సైట్లో లాగిన్ కావచ్చు. ఆనందం... ఆరోగ్యం... ఆటిజం, మెదడు బలహీనంగా ఉన్న పిల్లలకు కంటి చూపు, వినికిడి ఇలా రకరకాల సున్నితమైన సమస్యలుంటాయి. అలాంటి సమస్యలపై గుర్రపు స్వారీ ద్వారా జరిపే ఈక్వెన్ థెరపీ చక్కటి ప్రభావం చూపిస్తుంది. ప్రత్యక్షంగా మా బాబు సిద్ధార్థ విషయంలో ఈ మార్పు చూస్తున్నాం. వాళ్లు యాక్టివ్‌గా వూరి, సంతోషంగా ఉంటారు. - శ్రీనివాస్‌రావ్, పెడిగ్రీ సంస్థ ఇండియా హెడ్ భయం పోయింది మా అబ్బారుు బాగా చదువుతాడు. కానీ భయస్తుడు. హార్స్ రైడింగ్ నేర్చుకోవటం వల్ల వాడిలో ఆ బెరుకూ, భయం పోవటమే కాదు, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతోంది. అంతే కాదు మావాడు వెయిట్ తగ్గి, గ్రోత్ బాగుండాలని కూడా హార్స్ రైడింగ్ శిక్షణ ఇప్పిస్తున్నాం. - డాక్టర్ ప్రత్యూష, కిమ్స్ హార్స్ రైడింగ్ నా డ్రీమ్. కర్నూల్ నుంచి రైడింగ్ నేర్చుకోవడానికి వచ్చా. అఫర్డబుల్ ప్రైస్‌లో ఈ స్కూల్లో మంచి ట్రైనింగ్ లభిస్తుంది. నా కల నిజమైన ఆనందం పట్టలేకపోతున్నా. మార్వార్, కాంటీవార్, సింధీ మేలు జాతి రకాల గుర్రాలు ఇక్కడ ఉన్నారుు. - తనూజ, సాఫ్ట్వేర్ ఉద్యోగి ఓమధు ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి