రైడ్ ఆనందం.. ఆరోగ్యం..
అనగనగా ఓ రాకుమారుడు... అని కథ మొదలెట్టగానే ఠక్కున మదిలో మెదిలేది గుర్రం ఎక్కి అతగాడు వస్తున్న ఊహా చిత్రమే. సొగసైన గుర్రం పరుగు... దానిని రయిమున దూకిస్తున్న రాకుమారుడు... అందులో ఎంత రాజసం..! లైఫ్‌లో ఒక్కసారన్నా గుర్రమెక్కి స్వారీ చేయాలలని అనిపించక మానదు. ఆ ఊహను నిజం చేసి... గుర్రానికి కళ్లెం వేసి... స్వారీ చేసే అవకాశం కల్పిస్తోంది టోలీచౌకీలోని ‘హైదరాబాద్ హార్స్ రైడింగ్ స్కూల్’. దీని వల్ల ఆనందమే కాదు... సంపూర్ణ ఆరోగ్యమూ కలుగుతుందనేది నిపుణుల వూట...
చాలా ఖర్చుతో కూడుకున్న ఈ రాచ క్రీడకు సిటీలో క్రేజ్ బాగా పెరుగుతోంది. నగరవాసులే కాదు... ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రైడింగ్ నేర్చుకొంటున్న ఔత్సాహికులు వేలల్లోనే ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రొఫెషనల్స్, వారి పిల్లలు, సామాన్యులు సైతం దీనికి క్యూ కడుతున్నారు. రైడింగ్ వల్ల ఎంజాయ్‌మెంటే కాదు... పరిపుష్టమైన ఆరోగ్యం కూడా కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
‘సంపన్నులకే పరిమితమైన ఈ క్రీడను సామాన్యులకూ చేరువ చేయూలనేది నా ఆకాంక్ష. అందుకే విదేశాలకు వెళ్లి కష్టపడి డబ్బు సంపాదించా. దాంతోనే ఈ స్కూలు మొదలు పెట్టా. ప్రభుత్వం సాయువుందిస్తే వురింత వుందికి ఈ క్రీడ చేరువ అవుతుంది’ అంటారు హైదరాబాద్ హార్స్ రైడింగ్ స్కూల్ నిర్వాహకుడు అబ్దుల్ వాహబ్. నగరవాసులతో పాటు ఇతర జిల్లాల వారు, కొరియూ, స్కాట్‌లాండ్ నుంచి కూడా ఇక్కడకు ట్రైనింగ్‌కు వస్తుంటారని ఆయున చెప్పారు. ‘దాదాపు రెండు వేల వుందికి పైగా ఇందులో శిక్షణ పొందుతున్నారన్నారు. హార్స్ రైడింగ్‌తో వుుడిపడిన షో జంపింగ్, హార్స్ పోలో, స్టాలిష్ వాక్, టెన్ పెగ్గింగ్ గేమ్స్ కూడా నేర్చుకోవచ్చన్నారు.
ఇతర సాహస క్రీడలు కూడా...
హార్స్ రైడింగ్‌తో పాటు రైఫిల్ షూటింగ్, ప్యారా గ్లైడింగ్, ఆర్చెరీ లాంటి సాహస క్రీడలు సవ్ముర్ క్యాంప్‌లో నేర్పిస్తారు. హార్స్ ఫీల్డ్‌లో ఆసక్తి ఉంటే చక్కటి కెరీర్ అవకాశాలున్నాయి. విదేశాలలో 2 లక్షల నుంచి 20 లక్షల వరకు సంపాదించవచ్చు. ట్రైనింగ్ తీసుకున్నవారికి విదేశాల్లో ప్లేస్‌మెంట్ సర్వీస్ కూడా కల్పిస్తున్నారిక్కడ. ఈ స్కూల్లో హార్స్ ట్రెయినింగ్, హార్స్ ట్రేడింగ్, హార్స్ బ్రీడింగ్, హాస్టల్ సదుపాయం ఉన్నారుు. ఒక్కో గుర్రానికి నెలకు రూ.12 నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతుంది. ఒక్కో గుర్రం ధర లక్ష నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ స్కూల్‌లో చేరాలనుకొంటే... ‘హెచ్‌హెచ్‌ఆర్‌ఎస్.ఇన్’ వెబ్‌సైట్‌లో లాగిన్ కావచ్చు.
ఆనందం... ఆరోగ్యం...
ఆటిజం, మెదడు బలహీనంగా ఉన్న పిల్లలకు కంటి చూపు, వినికిడి ఇలా రకరకాల సున్నితమైన సమస్యలుంటాయి. అలాంటి సమస్యలపై గుర్రపు స్వారీ ద్వారా జరిపే ఈక్వెన్ థెరపీ చక్కటి ప్రభావం చూపిస్తుంది. ప్రత్యక్షంగా మా బాబు సిద్ధార్థ విషయంలో ఈ మార్పు చూస్తున్నాం. వాళ్లు యాక్టివ్‌గా వూరి, సంతోషంగా ఉంటారు.
- శ్రీనివాస్‌రావ్, పెడిగ్రీ సంస్థ ఇండియా హెడ్
భయం పోయింది
మా అబ్బారుు బాగా చదువుతాడు. కానీ భయస్తుడు. హార్స్ రైడింగ్ నేర్చుకోవటం వల్ల వాడిలో ఆ బెరుకూ, భయం పోవటమే కాదు, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతోంది. అంతే కాదు మావాడు వెయిట్ తగ్గి, గ్రోత్ బాగుండాలని కూడా హార్స్ రైడింగ్ శిక్షణ ఇప్పిస్తున్నాం.
- డాక్టర్ ప్రత్యూష, కిమ్స్
హార్స్ రైడింగ్ నా డ్రీమ్. కర్నూల్ నుంచి రైడింగ్ నేర్చుకోవడానికి వచ్చా. అఫర్డబుల్ ప్రైస్‌లో ఈ స్కూల్‌లో మంచి ట్రైనింగ్ లభిస్తుంది. నా కల నిజమైన ఆనందం పట్టలేకపోతున్నా. మార్వార్, కాంటీవార్, సింధీ మేలు జాతి రకాల గుర్రాలు ఇక్కడ ఉన్నారుు.
- తనూజ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
ఓమధు
ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి