కంప్యూటర్లతో కుస్తీ పట్టే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు... కొండలను అలవోకగా ఎక్కేశారు. రోప్‌తో రరుు్యన వాగులు, వంకలు దాటేశారు. కాల్వలు... గుట్టలు... గుహలు... అన్నింటా సాహసం చూపించి అబ్బురపరచారు. కింగ్‌ఫిషర్స్ బ్లూ బెవరేజస్ లిమిటెడ్ శనివారం కీసర సమీపంలోని దివ్య రిసార్ట్స్‌లో నిర్వహించిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో నగరంతో పాటు కర్ణాటక, కేరళ, వుహారాష్ట్ర, ఏపీ తదితర రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగులు ఉత్సాహంగా ట్రెక్కింగ్ చేశారు.
కొండలు, కోనల్లోని చెట్లు గవునించి, వాటి ప్రత్యేకత తెలుసుకున్నారు. ‘సాఫ్ట్’వేర్‌లోనే కాదు... ‘హార్డ్’రాక్‌ల్లో ఇలాంటి సాహస విన్యాసాలు చేసే సత్తా తవులో ఉందని నిరూపించారు. ఇందుకోసం మొత్తం నాలుగు వేల దరఖాస్తులు అందగా.. వాటిల్లో నుంచి 60 వుందిని ఎంపిక చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నట్టు బేస్ క్యాంప్ ప్రాజెక్ట్ అధికారి చంద్రిక చెప్పారు. ఆదివారం కూడా శిక్షణ ఉంటుందన్నారు. నిత్యం ఒత్తిడితో ఉండే ఐటీ ఉద్యోగుల్లో... మానసిక, శారీరక, ప్రశాంతత, ధైర్య సాహసాలు చేయగలమన్న నమ్మకం దీని ద్వారా కలుగుతాయున్నారు.
- అంజిరెడ్డి
ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి
హార్డ్ రాక్
Published Sun, Aug 31 2014 3:07 AM | Last Updated on Mon, Oct 22 2018 7:57 PM
Advertisement