
ఖాతాదారులపై లాఠీచార్జ్.. ఉద్రిక్తం
హైదరాబాద్: కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు ప్రజల్లో అసహనం రేపుతున్నాయి. హైదరాబాద్‌లోని టోలిచౌకి ఎస్‌బీఐ బ్రాంచ్ వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బ్యాంకు వద్ద బారులు తీరిన ఖాతాదారులను నియంత్రించే సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనైన ఖాతాదారులు అక్కడి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో టోలిచౌకి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని.. ట్రాఫిక్ జాం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.